ఆర్థిక మంత్రిత్వ శాఖ

11వ తేదీ మంగళవారం నుండి 16వ తేదీ వరకు జరిగే ఐఎంఎఫ్ - ప్రపంచ బ్యాంక్ వార్షిక సమావేశాలకు హాజరయ్యేందుకు


అమెరికాలో అధికారిక పర్యటన నిమిత్తం అర్థరాత్రి బయల్దేరిన ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్

కేంద్ర ఆర్థిక మంత్రి అనేక దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలతో పాటు
జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశాల లో కూడా పాల్గొంటారు

Posted On: 10 OCT 2022 2:37PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి. నిర్మలా సీతారామన్ అక్టోబరు 11 నుండి అధికారిక పర్యటన కోసం  అమెరికా వెళ్తున్నారు.  శ్రీమతి సీతారామన్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంక్, జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ (ఎఫ్ఎంసిజి) వార్షిక సమావేశాలకు హాజరుకానున్నారు.

జపాన్, దక్షిణ కొరియా, సౌదీ అరేబియా, ఆస్ట్రేలియా, భూటాన్, న్యూజిలాండ్, ఈజిప్ట్, జర్మనీ, మారిషస్, యుఎఇ, ఇరాన్, నెదర్లాండ్స్‌తో సహా పలు దేశాలతో ఆర్థిక మంత్రి ద్వైపాక్షిక సమావేశాలలో పాల్గొంటారు. ఆర్థిక మంత్రి ఓఈసిడి, యూరోపియన్ కమిషన్, యుఎన్డిపి నాయకులు, అధిపతులతో కూడా విడివిడిగా  సమావేశాలు నిర్వహిస్తారు.
ఆర్థిక మంత్రి సంయుక్త ట్రెజరీ సెక్రటరీ శ్రీమతి జానెట్ యెల్లెన్, ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్  డేవిడ్ మాల్పాస్‌లను విడివిడిగా కలుసుకుని పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు.

వాషింగ్టన్ డీసీలో ఉన్న లాభాపేక్షలేని ప్రముఖ పబ్లిక్ పాలసీ సంస్థ బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూషన్‌లో "భారత ఆర్థిక అవకాశాలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పాత్ర"పై ఫైర్ సైడ్ చాట్‌లో కూడా కేంద్ర ఆర్థిక మంత్రి పాల్గొంటారు. శ్రీమతి  సీతారామన్ ఈ సందర్శనలో స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జాన్ హాప్‌కిన్స్ యూనివర్శిటీలో 'టెక్నాలజీ, ఫైనాన్స్, గవర్నెన్స్' ఇంటర్‌లింకేజ్‌ల ద్వారా భారతదేశపు ప్రత్యేకమైన డిజిటల్ పబ్లిక్ గూడ్స్ ఆలోచన, ప్రభావాలపై  తన ఆలోచనలను పంచుకుంటారు. పర్యటన  తరువాతి భాగంలో, కేంద్ర ఆర్థిక మంత్రి యుఎస్‌ఐబిసి, యుఎస్‌ఐఎస్‌పిఎఫ్‌లతో 'భారత్-యుఎస్ కారిడార్‌లో పెట్టుబడులు, ఆవిష్కరణలను బలోపేతం చేయడం'  "భారతదేశం డిజిటల్ విప్లవంలో పెట్టుబడులు పెట్టడం" అనే అంశాలపై రౌండ్‌టేబుల్ సమావేశాలకు హాజరవుతారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులతో ఈ సమావేశాలు జరుగుతాయి. 

***



(Release ID: 1866622) Visitor Counter : 186