ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో టెలి మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్ వర్కింగ్ (టెలి-మానస్) చొరవ ప్రారంభం


టోల్ ఫ్రీ నెంబరు- 14416పై 24X7 టెలీ మెంటల్ హెల్త్ సేవలు లభ్యం

23 టెలీ-మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్ వర్క్ ఏర్పాటు; నోడల్ మెంటరింగ్ ఇన్ స్టిట్యూట్ లుగా ఎన్ ఐ ఎం హెచ్ ఎ ఎన్ ఎస్ , బెంగళూరు,
ఐ ఐ ఐ టి బి

మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలకు అందరికీ అందించాలన్న ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక టెలి-మానస్ సెల్ ను ఏర్పాటు చేయాలి.

Posted On: 10 OCT 2022 4:10PM by PIB Hyderabad

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మానసిక ఆరోగ్య రంగంలో ఒక కొత్త మైలురాయిని నెలకొల్పడంగా,  కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ టెలీ మెంటల్ హెల్త్ అసిస్టెన్స్ అండ్ నెట్ వర్కింగ్ అక్రాస్ స్టేట్స్ (టెలి-మానస్) చొరవను బెంగుళూరు లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్ (నిమ్హాన్స్)లో కర్ణాటక రాష్ట్ర ఆరోగ్య - కుటుంబ సంక్షేమ,  వైద్య విద్య శాఖ మంత్రి నిమ్హాన్స్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కె. సుధాకర్ సమక్షంలో.కర్ణాటక గవర్నర్ శ్రీ థావర్ చంద్ గెహ్లాట్ ఈ రోజు వర్చువల్ గా ప్రారంభించారు. 

 

కోవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో మానసిక ఆరోగ్య సంక్షోభం , మహమ్మారి వల్ల పెరిగిన సవాళ్లను తట్టుకునే డిజిటల్ మానసిక ఆరోగ్య నెట్ వర్క్ ను ఏర్పాటు చేయాల్సిన తక్షణ అవసరాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం 2022-23 కేంద్ర బడ్జెట్లో నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (ఎన్ టి ఎం హెచ్ పీ)) ని ప్రకటించింది.

 

టెలి-మానస్ దేశవ్యాప్తంగా 24 గంటలూ ఉచిత టెలీ-మెంటల్ హెల్త్ సేవలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ప్రత్యేకించి మారుమూల లేదా తక్కువ-సేవలు గల ప్రాంతాల్లోని ప్రజలకు సేవలు అందిస్తుంది. ఈ కార్యక్రమంలో 23 టెలీ-మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ నెట్వర్క్ ఉంది, నిమ్హాన్స్ నోడల్ సెంటర్ గా ఉంటుంది. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ-బెంగళూరు (ఐఐఐటిబి) టెక్నాలజీ మద్దతును అందిస్తుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బెంగళూరు , నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్ (ఎన్ హెచ్ ఆర్ ఎస్ సి) సాంకేతిక మద్దతును అందిస్తాయి.

 

ప్రతి రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంలో కనీసం ఒక టెలి-మానస్ సెల్ ను ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది

 

ఈ సేవల కోసం దేశవ్యాప్తంగా టోల్ ఫ్రీ, 24/7 హెల్ప్ లైన్ నెంబరు (14416) ను ఏర్పాటు చేశారు. తద్వారా ఫోన్ చేసే వారు సేవలను పొందడానికి తమ భాషను ఎంచుకోవడానికి వీలు కల్పించారు. సంబంధిత రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని టెలి-మానస్ సెల్స్ కు కాల్స్ ను మళ్ళిస్థారు. 

టెలి-మానస్ ను రెండు అంచెల వ్యవస్థలో నిర్వహిస్తారు; టైర్ 1లో రాష్ట్ర స్థాయి టెలి-మానస్ విభాగాలు ఉంటాయి, వీటిలో శిక్షణ పొందిన కౌన్సిలర్లు, మానసిక ఆరోగ్య నిపుణులు ఉంటారు. టైర్ 2లో ఫిజికల్ కన్సల్టేషన్ కోసం డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (డి ఎం హెచ్ పీ)/మెడికల్ కాలేజ్ రిసోర్సెస్/లేదా ఆడియో విజువల్ కన్సల్టేషన్ కోసం ఇ-సంజీవని స్పెషలిస్టులు ఉంటారు. ప్రస్తుతం ఐదు ప్రాంతీయ సమన్వయ కేంద్రాలతో పాటు 51 స్టేట్/యుటి టెలి మానస్ కేంద్రాలు ఉన్నాయి.

 

సెంట్రలైజ్డ్ ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ( ఐ వి ఆర్ ఎస్) ద్వారా ప్రాథమిక మద్దతు , సలహాలు అందించే ప్రారంభ దశ ను స్థిరపరుస్తున్నారు. ఇది తక్షణ మానసిక ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సహాయపడటమే కాకుండా, సంరక్షణ కొనసాగింపును కూడా సులభతరం చేస్తుంది. నేషనల్ టెలీ కన్సల్టేషన్ సర్వీస్ , ఇ-సంజీవని, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, మానసిక ఆరోగ్య నిపుణులు, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్ నెస్ సెంటర్లు , ఎమర్జెన్సీ సైకియాట్రిక్ ఫెసిలిటీస్ వంటి ఇతర సర్వీసులతో టెలి-మానస్ ను అనుసంధానం చేయడం ద్వారా ప్రత్యేక సంరక్షణకు దీనిని ఉద్దేశించారు. అంతిమంగా ఇది మొత్తం మానసిక స్వస్థత,  అనారోగ్య నివారణ పై దృష్టి పెడుతుంది. మానసిక ఆరోగ్య సంరక్షణను అందించే అన్ని వ్యవస్థలను ఏకీకృతం చేస్తుంది. నిమ్హాన్స్ మెజారిటీ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 900 మంది టెలీ మానస్ కౌన్సిలర్లకు శిక్షణ ఇచ్చింది.

 

వీటిలో ఎయిమ్స్, పాట్నా, ఎయిమ్స్ రాయ్ పూర్, సిఐపి రాంచీ, ఎయిమ్స్,  భోపాల్, ఎయిమ్స్ ,కళ్యాణి, ఎయిమ్స్ , భువనేశ్వర్, పిజిఐఎంఇఆర్, చండీగఢ్, హాస్పిటల్ ఫర్ మెంటల్ హెల్త్, అహ్మదాబాద్, గుజరాత్, ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైకియాట్రీ అండ్ హ్యూమన్ బిహేవియర్ బాంబోలిమ్ గోవా, ఎయిమ్స్, నాగ్ పూర్, ఎయిమ్స్, జోధ్ పూర్, కెజిఎంయు,  లక్నో, ఎయిమ్స్ రిషికేష్, ఐహెచ్ బిఎఎస్, ఢిల్లీ, ఐజిఎంఎస్, సిమ్లా, సైకియాట్రిక్ డిసీజెస్ హాస్పిటల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, శ్రీనగర్, ఎల్ జిబిఆర్ హెచ్, తేజ్ పూర్,

నింహాన్స్, బెంగళూరు, ఐఎంహెచ్ ఎఎస్, కోజికోడ్, కేరళ, ఐఎంహెచ్, చెన్నై, ఐఎంహెచ్, హైదరాబాద్, జిప్మర్ అండ్ ఎయిమ్స్, మంగళగిరి ఉన్నాయి.

 

ఆంధ్రప్రదేశ్, అస్సాం, అండమాన్-  నికోబార్ దీవులు, చత్తీస్ గఢ్, దాద్రా నగర్ హవేలీ , డామన్ అండ్ డయ్యూ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ - కాశ్మీర్, కర్ణాటక, కేరళ, లడఖ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ , పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు నేడు టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ను ప్రారంభించాయి.

 

ఈ కార్యక్రమంలో నిమ్హాన్స్ డైరెక్ట ర్ డాక్టర్ ప్రతిమా మూర్తి, శ్రీ విశాల్ చౌహాన్, జెఎస్ (ఎంఒహెచ్ ఎఫ్ డబ్ల్యు), విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర ప్రముఖులు, మంత్రిత్వ శాఖ కు చెందిన సీనియ ర్ అధికారులు పాల్గొన్నారు.

 

*****(Release ID: 1866610) Visitor Counter : 305