అంతరిక్ష విభాగం

భారత అంకుర సంస్థలు త్వరలో అంతరిక్ష ఉపగ్రహాలతో పాటు ఉపగ్రహ నక్షత్రరాశుల ద్వారా రాకెట్లను ప్రయోగించనున్నాయి: కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్


ఇండియన్ స్పేస్ అసోసియేషన్, మొదటి వార్షికోత్సవం సందర్భంగా దిల్లీలో జరిగిన ఇండియా స్పేస్ కాన్‌క్లేవ్‌లో ప్రసంగించిన మంత్రి

అంతరిక్ష సంస్కరణల కారణంగా, అంతరిక్ష వ్యర్థాల నిర్వహణ, నానో-శాటిలైట్, లాంచ్ వెహికల్, గ్రౌండ్ సిస్టమ్స్, అత్యాధునిక రంగాలలో పరిశోధన పనిచేస్తున్న అంకుర సంస్థలు అతి స్వల్ప కాలంలో 2 నుండి 102కి పెరిగాయి: కేంద్రమంత్రి శ్రీ జితేంద్ర సింగ్

ఇస్రో నేతృత్వంలోని అంతరిక్ష విప్లవంతో పాటు ప్రైవేట్ రంగం, అంకుర సంస్థలు సమాంతరంగా ఉన్నాయి: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 10 OCT 2022 3:47PM by PIB Hyderabad

భారత అంకుర సంస్థలు త్వరలో అంతరిక్ష ఉపగ్రహాలతో పాటు ఉపగ్రహ నక్షత్రరాశులను ప్రయోగించి తమ రాకెట్‌లను ప్రయోగించనున్నాయని కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వ శాఖప్రధానమంత్రి కార్యాలయంఅంతరిక్షం, అటామిక్ ఎనర్జీ శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ నేడు తెలిపారు.

ఎల్&టీ, హెచ్ఎఎల్ సంస్థలు దేశీయంగా ఐదు పీఎస్ఎల్‌వీలను ఉత్పత్తి చేస్తున్నాయని మంత్రి తెలిపారు. OneWeb తమ ఉపగ్రహాలను ఇస్రో మరియు ఎన్ఎస్ఐఎల్ ద్వారా ప్రయోగించేందుకు సిద్ధంగా ఉందని మంత్రి తెలియజేశారు.

ఇండియన్ స్పేస్ అసోసియేషన్మొదటి వార్షికోత్సవం సందర్భంగా దిల్లీలో జరిగిన ఇండియా స్పేస్ కాన్‌క్లేవ్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు. జూన్, 2020లో అంతరిక్ష రంగంలోకి ప్రైవేట్ పరిశ్రమలను తీసుకురావాలనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విప్లవాత్మక నిర్ణయం అనంతరం దేశం యొక్క అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ యొక్క రూపురేఖలు పూర్తిగా మారాయని అన్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూఅంతరిక్ష సంస్కరణల ద్వారా దేశంలోని అంకుర సంస్థలు తమ వినూత్న సామర్థ్యాలను ఆవిష్కరించాయన్నారు. అతి తక్కువ కాలంలో కేవలంమూడు-నాలుగు సంవత్సరాల క్రితం రెండు అంతరిక్ష అంకుర సంస్థల నుండినేడు 102 స్టార్టప్‌లు అత్యాధునికమైన అంతరిక్ష శిధిలాల నిర్వహణ, నానో-ఉపగ్రహంప్రయోగ వాహనంగ్రౌండ్ సిస్టమ్స్పరిశోధన మొదలైన రంగాలలో పాలుపంచుకుంటున్నాయి. పరిశోధనాభివృద్ధిఅకాడెమియా, పరిశ్రమల ఏకీకరణతోఇస్రో నేతృత్వంలో అంతరిక్ష విప్లవం వచ్చిందని చెప్పడం సురక్షితం అని మంత్రి అన్నారు. ప్రైవేట్ రంగం, అంకుర సంస్థలు సమాంతరంగా ఉన్నాయన్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూమన యువ ప్రైవేట్ పారిశ్రామిక సంస్థల బలం, వినూత్న సామర్థ్యం రాబోయే కాలంలో ప్రపంచ అంతరిక్ష సాంకేతిక విజ్ఞానంలో ముందంజలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. స్పేస్ డొమైన్ అందించే అపరిమిత అవకాశాలను పరిష్కరించడానికి భారత యువ సాంకేతిక నిపుణలు, అంతరిక్ష సాంకేతిక రంగంలో కొత్త అడ్డంకులను అధిగమించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అక్టోబర్ 11, 2021న అంతరిక్షం ఉపగ్రహ సంస్థల యొక్క ప్రధాన పరిశ్రమల సంఘమైన- ఇండియన్ స్పేస్ అసోసియేషన్ (ISpA)ని ప్రారంభించిన సందర్భాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ గుర్తుచేసుకున్నారుఆ సందర్భంగా ప్రధాని, అంతరిక్ష సంస్కరణలకు మన విధానం నాలుగు స్తంభాలపై ఆధారపడి ఉంది- నవకల్పనలో ప్రైవేట్ రంగానికి స్వేచ్ఛ, వ్యవస్థను ప్రారంభించే పాత్రలో ప్రభుత్వంయువతను భవిష్యత్తును సిద్ధం చేయడం, అంతరిక్ష రంగాన్ని సామాన్యుల పురోగతికి వనరుగా చూడడం” అన్నట్లు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

ఏడాది కన్నా తక్కువ వ్యవధిలో భారత అంతరిక్ష పరిశ్రమ వృద్ధికి అంతర్జాతీయ అనుసంధానతను అభివృద్ధి చేయడంలో, అద్భుతంగా పనిచేస్తున్నందుకు ISpA పాత్రను మంత్రి ప్రశంసించారు. ISpA సభ్యులు విధాన న్యాయవాదాన్ని చేపట్టడంలో, విజ్ఞానం, దృష్టిలో నిమగ్నమై భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ఉన్నతంగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూవాణిజ్యపరమైన అంతరిక్ష ఆధారిత విహారయాత్రల రంగంలో భారతదేశం ముందంజలో ఉండేందుకు భారత ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ISpA ప్రధాన పాత్ర పోషిస్తుందని మంత్రి అన్నారు. దీని కోసంకీలకమైన వాటాదారుల మధ్య పరస్పర చర్యలకు మధ్యవర్తిగా ISpA చేస్తున్న పాత్ర కీలకమైనదని మంత్రి తెలిపారు.

ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ‘ఆత్మనిర్భర్ భారత్’ నినాదాన్ని ఉన్నతంగా ఉంచడం వల్ల దేశంలో ముఖ్యమైన సాంకేతిక పురోగతులు, పెట్టుబడులకు నాంది పలుకుతుందనిఇది అంతిమంగా అధిక నైపుణ్యం కలిగిన ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని మంత్రి అన్నారు. అదే సమయంలో అంతరిక్ష సంస్కరణలకు ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అనుసరిస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇటీవలి ప్రపంచ పరిణామాల దృష్ట్యా అంతరిక్ష వ్యూహాత్మక ఔచిత్యాన్ని గురించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూఅంతరిక్షం ఒక ద్వంద్వ-వినియోగ సాంకేతికత డొమైన్ అన్నారుఅద్భుతమైన అవకాశాలను అందించే ఒక ప్రముఖ బహుముఖ రంగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అనేక దేశాలు ఈ రోజు తమ సైనిక అంతరిక్ష సామర్థ్యాలను అభివృద్ధి చేయడంపై దృష్టి సారిస్తున్నాయనిదాని సురక్షితమైనస్నేహపూర్వక వినియోగాన్ని నిర్ధారించడానికి అవసరమైనప్పుడు ప్రత్యర్థులకు దానిని తిరస్కరించే నిరోధక సామర్థ్యాన్ని కూడా పెంపొందించుకుంటున్నాయని మంత్రి అన్నారు.

భారతదేశం కూడా ఈ ఉద్భవిస్తున్న యుద్ధ కోణాన్ని బలపరిచేందుకు సంకల్పించిందన్నారు. వాస్తవానికిప్రైవేట్ పారిశ్రామిక సామర్థ్యం సమర్థవంతంగా శక్తివంతం చేసేందుకు అంతరిక్ష రంగంలో ఆత్మనిర్భరతను సాధించేందుకు భారత ప్రభుత్వం బలమైన, నిర్ణయాత్మక చర్యలను చేపడుతోందని అన్నారు. రాబోయే కాలంలో భారత్ ఇతర దేశాలకు అంతరిక్ష సాంకేతికతను అందించే అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియారక్షణ రంగం మూడు సేవలతో వారి అవసరాలను తీర్చడంలో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ పోషించిన నిర్మాణాత్మక పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్థావించారు. రాబోయే కాలంలో ప్రభుత్వం ISpA సామర్థ్యం, సామర్థ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడంలో చాలా లోతైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా అద్భుతమైన ప్రదర్శనను అందించినందుకు ISpA చైర్మన్ మరియు డైరెక్టర్ జనరల్‌తో పాటు వారి సభ్యులకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

మంత్రి ఇండియన్ స్పేస్ అసోసియేషన్ చైర్మన్జయంత్ డి పాటిల్ఇస్రో చైర్మన్, S. సోమనాథ్‌తో కలిసి “భారతదేశంలో అంతరిక్ష పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం: సమగ్ర వృద్ధిపై దృష్టి సారించడం” అనే అంశంపై తయారు చేసిన నివేదికను ఆవిష్కరించారు.

సమావేశం ముగింపులో డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూఇస్రో యొక్క విజయాలు మనకు ప్రపంచ గుర్తింపు ప్రశంసలను రెండింటినీ సంపాదించిపెట్టాయని అన్నారు. ప్రపంచంలోని అతిపెద్ద రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాల సమూహంతో ఇస్రో ఖగోళ అంతరిక్షంలో ప్రత్యేక స్థానాన్ని పొందడం ఒక గౌరవం అన్నారు. ఇస్రో సాధించిన విజయాలతో భారతదేశం గర్వపడేలా చేస్తుందని మంత్రి ఉద్ఘాటించారు.

 

 

                                                     

 <><><><><>



(Release ID: 1866609) Visitor Counter : 283