ఆర్థిక మంత్రిత్వ శాఖ
ఈ నెల 8వ తేదీ వరకు ప్ర ప్రత్యక్ష పన్ను వసూళ్లలో 23.8 శాతం వృద్ధి
Posted On:
09 OCT 2022 11:43AM by PIB Hyderabad
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 8వ తేదీ వరకు (అక్టోబర్ 8, 2022) వరకు ప్రత్యక్ష పన్ను వసూళ్ల తాత్కాలిక గణాంకాలు స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తు వస్తున్నాయి. అక్టోబర్ 8, 2022 వరకు ప్రత్యక్ష పన్ను స్థూల వసూళ్లు రూ. 8.98 లక్షల కోట్లుగా నమోద అయ్యాయి, ఇది గత సంవత్సరం ఇదే కాలానికి సంబంధించిన స్థూల వసూళ్ల కంటే ఇది 23.8 శాతం మేర అధికం. ప్రత్యక్ష పన్ను వసూళ్లు, రీఫండ్‌ల నికరం రూ.7.45 లక్షల కోట్లు, ఇది గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే నికర వసూళ్ల కంటే 16.3% ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రత్యక్ష పన్నుల మొత్తం వసూళ్లు బడ్జెట్ అంచనాలలో 52.46 శాతానికి సమానము. ఇప్పటి వరకు స్థూల ఆదాయ సేకరణల పరంగా కార్పొరేట్ ఆదాయపు పన్ను (సీఐటీ) మరియు వ్యక్తిగత ఆదాయపు పన్ను (పీఐటీ) వృద్ధి రేటు విషయానికి వస్తే.. సీఐటీ వృద్ధి రేటు 16.73 శాతం కాగా, పీఐటీ (ఎస్‌టీటీతో సహా) 32.30 శాతం. వాపసుల సర్దుబాటు తర్వాత సీఐటీ నికర వృద్ధి 16.29 శాతం మరియు పీఐటీలో 17.35 శాతం (పీఐటీ మాత్రమే)/16.25% (ఎస్‌టీటీతో సహా పీఐటీ).1 ఏప్రిల్, 2022 నుండి అక్టోబర్ 8, 2022 మధ్య కాలంలో రూ.1.53 లక్షల కోట్ల రీఫండ్‌లు జారీ చేయబడ్డాయి, ఇది అంతకు ముందు సంవత్సరం ఇదే కాలంలో జారీ చేయబడిన రీఫండ్‌ల కంటే 81.0 శాతం అధికం.
****
(Release ID: 1866516)
Visitor Counter : 214