వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అంకుర ప‌రిశ్ర‌మ‌ల కోసం క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కాన్ని నోటిఫై చేసిన ప‌రిశ్ర‌మ‌లు, అంత‌ర్గ‌త వాణిజ్య (డిపిఐఐటి) ప్రోత్సాహ‌క‌ విభాగం


రుణాలు ఇచ్చే సంస్థ‌ల‌కు రిస్క్ త‌గ్గింపు చ‌ర్య‌కింద కీల‌క‌మైన చ‌ర్య‌గా , స్టార్ట‌ప్‌ల రుణాల‌కు గ్యారంటీ ఇచ్చే ప‌థ‌కం ఇది

Posted On: 07 OCT 2022 2:35PM by PIB Hyderabad

 

వాణిజ్య‌, ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ కింద గ‌ల పారిశ్రామిక‌, అంత‌ర్గ‌త వాణిజ్య ప్రోత్సాహ‌క విభాగం (డిపిఐఐటి) స్టార్ట‌ప్ లకోసం క్రెడిట్ గ్యారంటీ ప‌థ‌కం ఏర్పాటును నోటిఫై చేసింది. వాణిజ్య బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియ‌ల్ కంపెనీలు, సెక్యూరిటీలు ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) వ‌ద్ద రిజిస్ట‌ర్ అయిన ప్ర‌త్యామ్నాయ పెట్టుబ‌డి ఫండ్‌లు అందించే రుణాల‌కు వ‌ర్తించే క్రెడిట్ గ్యారంటీ ఇచ్చే ప‌థ‌కం.
  డిపిఐఐటి జారీ చేసే ఆదేశాలు, ఎప్ప‌టిక‌ప్పుడు జ‌రిపే స‌వ‌ర‌ణ‌ల‌ను  దృష్టిలోపెట్టుకుని  ఇందులో నిర్వ‌చించిన స్టార్ట‌ప్ నిర్వ‌చనం ప్ర‌కారం అర్హ‌త గ‌ల రుణ‌గ్ర‌హీత‌ల‌కు రుణాలు ఇచ్చే స‌భ్య సంస్థ‌ల‌కు అవి ఇచ్చే రుణాల‌పై ఒక నిర్ణీత ప‌రిమితి వ‌ర‌కు రుణ గ్యారంటీని ఇచ్చేందుకు సిజిఎస్ఎస్ ను నిర్దేశించారు.ఈ ప‌థ‌కం కింద క్రెడిట్ గ్యారంటీ స‌దుపాయం లావాదేవీల ఆధారితంగా ఉంటుంది. వ్య‌క్తిగ‌త కేసుల విష‌యంలో ఈ ప‌రిమితి ప‌ది కోట్ల రూపాయ‌ల ప‌రిమితికి లోబ‌డి ఉంటుంది లేదా మిగిలి ఉన్న రుణ మొత్తం అందులో ఏది త‌క్కువ అయితే దానికి వ‌ర్తిస్తుంది.

 లావాదేవీల ఆధారిత గ్యారంటీ కింద‌, గ్యారంటీ క‌వ‌ర్‌ను అర్హ‌త‌గ‌ల ఒక‌ రుణ‌గ్ర‌హీత పై ఎంఐఎస్ ఈ గ్యారంటీ స‌దుపాయాన్ని పొందుతుంది.  బ్యాంకులు, ఎన్‌బిఎఫ్ సిల నుంచి అర్హ‌త‌గ‌ల స్టార్ట‌ప్‌లు  రుణాలు తీసుకునేందుకు లావాదేవీల ఆధారిత గ్యారంటీలు త‌గిన ప్రోత్సాహాన్నిస్తాయి.లావాదేవీల ఆధారిత గ్యారంటీ అనేది ఆమోదించిన వాస్త‌వ రుణం మొత్తం 3 కోట్ల రూపాయ‌లు కంటే ఎక్కువ , 5 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు అయితే, డిఫాల్ట్ అయిన మొత్తంలో 75 శాతం వ‌ర‌కు, అలాగే వాస్త‌వ ఆమోదిత మొత్తం  ప్ర‌తి రుణ‌గ్ర‌హీత‌కు 5 కోట్ల రూపాయ‌ల కంటే ఎక్కువగా ఉంటే  డిఫాల్ట్ అయిన మొత్తంలో 65 శాతం వ‌ర‌కు ఉంటుంది.

అద‌న‌పు గ్యారంటీ క‌వ‌ర్ , సెబి కి చెందిన ఎఐఎఫ్ రెగ్యులేష‌న్ల కింద రిజిస్ట‌ర్ అయిన వెంచ‌ర్ డెట్ ఫండ్స్‌కు క‌ల్పింప‌బ‌డుతుంది. ఈ నిధుల స్వ‌భావం, అవి అందించే రుణ నిధుల‌ను బ‌ట్టి ఇది ఉంటుంది. అద‌న‌పు గ్యారంటీ కవర్ పరిధి వాస్తవ నష్టాలు లేదా పూల్ చేసిన పెట్టుబడిలో గరిష్టంగా 5శాతం వరకు కవర్ చేయబడి ఉంటుంది, వీటిలో ఏది తక్కువైతే అది గరిష్టంగా ఒక్కో రుణ‌గ్ర‌హీత‌కు రూ.10 కోట్లకు లోబడి ఉంటుంది.

ఈ పథకాన్ని అమలు చేయడానికి సంస్థాగత యంత్రాంగాలతో పాటు, డిపిఐఐటి పథకం  సమీక్ష, పర్యవేక్షణ కార్యాచరణ ప‌రిశీల‌న కోసం నిర్వహణ కమిటీ  ,రిస్క్ ఎవాల్యుయేషన్ కమిటీ ని ఏర్పాటు చేస్తారు. నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (NCGTC) ఈ పథకాన్ని నిర్వహిస్తుంది.

 2016 జ‌న‌వ‌రి 16వ తేదీన స్టార్ట‌ప్ ఇండియా కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక‌ను ప్ర‌ధాన‌మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. వీటికి ప్ర‌భుత్వ స‌హ‌కారం అందించ‌డం,  దేశంలో ఇందుకు సంబంధించిన  ప‌థ‌కాలు , స్టార్ట‌ప్‌ల‌కు  ప్ర‌యోజ‌నాలు క‌ల్పించ‌చేందుకు , దేశంలో ఒక చురుకైన స్టార్ట‌ప్ ఎకోసిస్ట‌మ్‌ని సృష్టించేందుకు దీనిని ఉద్దేశించారు. ఆవిష్కర్తలకు రుణం అందించ‌డం ద్వారా ఎంట‌ర్‌ప్రెన్యుయ‌ర్‌షిప్‌ను ప్రోత్స‌హించ‌డానికి, స్టార్టప్‌లకు వెంచర్ రుణాన్ని అందించడానికి,  బ్యాంకులు , ఇతర సభ్య సంస్థలను ప్రోత్సహించడానికి క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని రూపొందించింది. 

పూచీలేని ఉచిత లోన్ అందుబాటులో లేని సమస్యను ,డిపిఐఐటి గుర్తింపు పొందిన స్టార్టప్‌ల కోసం ప్ర‌త్యేకంగా రూపొందించిన క్రెడిట్ గ్యారెంటీ ప‌థ‌కం పరిష్కరిస్తుంది.  పూర్తి స్థాయి వ్యాపార సంస్థలుగా మారడానికి వినూత్న స్టార్టప్‌లు సాగించే ప్ర‌యాణంలో వాటికి ఆర్థికంగా తోడ్పాటును అందిస్తుంది. భారతీయ స్టార్టప్ ప‌రిస్థితుల‌ను  ప్రపంచంలోనే అత్యుత్తమంగా మార్చడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ప్రభుత్వం ప్ర‌త్యేక  దృష్టిపెట్టిన‌ద‌నేందుకు  ఈ పథకం నిద‌ర్శ‌నం.

భార‌తీయ అంకుర ప‌రిశ్ర‌మ‌ల‌కు దేశీయంగా పెట్టుబ‌డిని స‌మ‌కూర్చే ల‌క్ష్యంతో , సిజిఎస్ ఎస్ ప్ర‌స్తుతం  స్టార్ట‌ప్ ల కోసం, స్టార్ట‌ప్ ఇండియా చొర‌వ కింద గ‌ల ఫండ్ ఆఫ్ ఫండ్స్ ఫ‌ర్ స్టార్ట‌ప్స్‌, స్టార్ట‌ప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్‌కు అద‌నంగా ఇది ఉంటుంది.
వివిధ మంత్రిత్వ‌శాఖ‌లు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, వెంచర్ డెట్ ఫండ్స్, విద్యా సంస్థ‌లు, స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోని నిపుణులు  వాటాదారులతో సిజిఎస్ ఎస్  ఫ్రేమ్‌వర్క్ పై  విస్తృతమైన సంప్రదింపుల అనంత‌రం దీనిని రూపొందించారు. స్టార్టప్‌లకు పూచీ రహిత నిధులను అందించే రుణ సంస్థలకు ఈ పథకం రిస్క్ తగ్గింపు చర్యగా పనిచేస్తుంది.

***


(Release ID: 1866515) Visitor Counter : 231