రక్షణ మంత్రిత్వ శాఖ
భారత వైమానిక దళంలో వెపన్ సిస్టమ్స్ శాఖ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ప్రభుత్వం
ఉపరితల ఆధారిత& ప్రత్యేక వాయుమార్గ ఆయుధ వ్యవస్థల ఆపరేటర్లను ఒకే గొడుగు కిందకు
Posted On:
08 OCT 2022 10:39AM by PIB Hyderabad
భారత వైమానిక దళం (ఐఎఎఫ్)లో వెపన్స్ సిస్టం (డబ్ల్యుఎస్ -ఆయుధ వ్యవస్థలు) విభాగం పేరిట ఒక కొత్త విభాగాన్ని సృష్టించే ఒక చారిత్రాత్మక నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్ని ఉపరితల- ఆధారిత, ప్రత్యేక వాయుమార్గ ఆయుధ వ్యవస్థల నిర్వహణ వ్యవహారానికి కట్టుబడి ఉండే ఒక సంస్థ కింద అన్ని ఆయుధ విభాగ ఆపరేటర్లను ఏకీకరణ చేసేందుకు డబ్ల్యుఎస్ విభాగ సృష్టి దోహదం చేస్తుంది.
ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణులు, ఉపరితలం నుంచి వాయు క్షిపణులు, దూరం నుంచి పైలెట్ (నడిపే) విమానం, ద్వి/ బహుళ సిబ్బంది కలిగిన విమానం ఆయుధ వ్యవస్థ ఆపరేటర్లు వంటి నాలుగు ప్రత్యేక శాఖలకు చెందిన ఆపరేటర్లు శాఖ కిందకు వస్తారు. భారత వైమానిక దళ యుద్ధ పోరాట సామర్ధ్యాన్ని పెంచడంలో అత్యున్నత స్థాయిలో ఈ శాఖ దోహదం చేయనున్నది.
***
(Release ID: 1866244)
Visitor Counter : 234