ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గువాహటి లో 08 అక్టోబర్ 2022న జరిగిన 70వ ఎన్ ఇ సి ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


ఎన్ఈఆర్ 'అమృత్ సమయ్'లో ప్రవేశించింది. దీనిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి , ఎదుగుదల అభివృద్ధి అవకాశాలన్నింటిని జాగృత పరచాలి: శ్రీ జి. కిషన్ రెడ్డి

భాగస్వాములు, కేంద్ర/ రాష్ట్ర ఏజెన్సీలు, ప్రైవేట్ రంగం సమిష్టి గా పనిచేయాల్సిన అవసరం ఉంది; ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ,కనెక్టివిటీని మరింత పెంపొందించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది: శ్రీ కిషన్ రెడ్డి

ఎన్.ఇ.ఆర్. రాష్ట్రాలకు 10% జిబిఎస్ ను సంపూర్ణంగా, లక్ష్యంగా
వినియోగించుకోవడం శరవేగంగా అభివృద్ధి చెందడానికి కీలకం

10% జిబిఎస్ వినియోగాన్ని క్రమం తప్పకుండా విశ్లేషించాల్సిన అవసరం ఉంది; తదనుగుణంగా విధానాల పునఃసమీక్ష, డేటా అడ్డంకులను అధిగమించడం , కేంద్ర సంబంధిత మంత్రిత్వ శాఖలతో అద్భుతమైన సమన్వయం తప్పనిసరి ;

లక్ష్యిత అభివృద్ధి కార్యక్రమాల అమలుకు మరింత దోహదపడేలా బలాలు , బలహీనతల సమీక్ష, కీలక రంగాలలో అంతరాల గుర్తింపు అవసరం;

పర్యాటక మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, నైపుణ్యం - సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమైన ప్రాధాన్యతలు.

ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ఈ ప

Posted On: 08 OCT 2022 1:05PM by PIB Hyderabad

గువాహటిలో జరిగిన ఈశాన్య ప్రాంత మండలి (ఎన్.ఇ.సి) 70వ ప్లీనరీ సమావేశంలో ఈశాన్య ప్రాంత అభివృద్ధి, పర్యాటకం, సాంస్కృతిక శాఖల కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు.

ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలు,  కేంద్ర మంత్రిత్వ శాఖలకు చెందిన సీనియ ర్ అధికారులను ఉద్దేశించి శ్రీ కిషన్ రెడ్డి

ప్రసంగిస్తూ, ఈ ప్రాంతం పెరుగుదల, అభివృద్ధికి కీలకమైన అనేక అంశాలను గురించి వివరించారు.

 

ఈశాన్య ప్రాంతం లో శాంతి, సుస్థిరత కోసం , అనుసంధానాన్ని పెంపొందించ డానికి భారత ప్రభుత్వం నిర్విరామంగా కృషి చేస్తోందని, ee దిశగా

గణనీయమైన పురోగతిని కూడా సాధించిందని ఆయన అన్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి లేకుండా భారతదేశం అభివృద్ధి చెందలేదనేది గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ నమ్మకమని ఆయన అన్నారు

 

ఎన్ ఈఆర్ తన 'అమృత్ సమయ్'లో ప్రవేశించిందని, దీనిని మనం పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని, ఎదుగుదలకు, అభివృద్ధికి సంబంధించిన అన్ని అవకాశాలను మేల్కొల్పాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంపూర్ణ సమన్వయంతో మాత్రమే ఎన్ ఈఆర్ ను భారతదేశ వృద్ధి చోదక శక్తిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని చేరుకోగలమని మంత్రి అధికారులకు వివరించారు.

 

కేంద్రం, రాష్ట్రాలు, ప్రైవేటు రంగాలు, భాగస్వాములు అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని, ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని మరింత పెంపొందించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

 

ఎన్.ఇ.ఆర్. రాష్ట్రాల కు 10% జిబిఎస్ ను సంపూర్ణంగా, లక్ష్యంగా వినియోగించుకోవడం శరవేగంగా అభివృద్ధి చెందడానికి కీలకమని

ఆయన అన్నారు. 10 శాతం జీబీఎస్ వినియోగాన్ని క్రమం తప్పకుండా విశ్లేషించాల్సిన అవసరం ఉందని, తదనుగుణంగా విధానాలను పునఃసమీక్షించాలని, డేటా అడ్డంకులను అధిగమించడం, కేంద్ర మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు. విధానాలను సవరించడం, మార్గదర్శకాలు మొదలైన వాటిని సమర్థవంతంగా వినియోగించుకునేలా చూడటం కోసం తమ సిఫారసులను అందించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరినీ కోరారు.

 

ఇటీవల ఏర్పాటు చేసిన అగ్రి టాస్క్ ఫోర్స్ త్వరలో తన తుది నివేదికను విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి స్థాయిలో వినియోగాన్ని కొనసాగించడానికి

టాస్క్ ఫోర్స్ సిఫార్సులను సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన అన్నారు.

 

"బలాలు , బలహీనతల విశ్లేషణ" నిర్వహించాల్సిన అవసరం ఉందని "కీలక రంగాలలో అంతరాలను గుర్తించాల్సిన అవసరం ఉందని" మంత్రి సూచించారు. ఇది మరింత లక్ష్యిత అభివృద్ధి కార్యక్రమాలకు సహాయపడుతుంది.

ప్రాజెక్టు అంశాల ఎంపికలోఎన్ ఇ ఆర్ జిల్లాల వారీ  ఎస్ డి జి ఇండెక్స్, ఆకాంక్షాత్మక జిల్లాలు, గ్రామీణ ఆవాసాలు, ప్రాంతాలకు అనుసంధానం

పేదరిక సూచీ ల స్థాయిని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అన్నారు. మంచి టెండరింగ్ నిబంధనలు , బలమైన పర్యవేక్షణను నిర్ధారించాలని ఆయన అధికారులను కోరారు.

 

ఈ ప్రాంతం పర్యాటక సామర్థ్యం గురించి ప్రస్తావిస్తూ, ఈ ప్రాంతం సంపూర్ణ సామర్థ్యం సాకారం కావడం కోసం డిఒఎన్ఇఆర్ మంత్రిత్వ శాఖ ఒక టూరిజం టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోందని మంత్రి తెలిపారు. పర్యాటక,  మౌలికసదుపాయాలను అభివృద్ధి చేయడం, నైపుణ్యం, సామ ర్థ్యాన్ని పెంపొందించుకోవడం ఈ ప్రాంతంలో

పర్యాటక రంగాన్ని అభివృద్ధి

చేయడానికి ముఖ్యమైన ప్రాధాన్యత లని ఆయన పేర్కొన్నారు.

 

ఎన్.ఇ.ఆర్ లో యువత కు ఉపాధిని సృష్టించడానికి భద్రతా సేవల పరిశ్రమ అందించే సామర్థ్యాన్ని కూడా మనం అన్వేషించాలని ఆయన నొక్కిచెప్పారు.

 

ప్రైవేట్ పెట్టుబడుల అవసరాన్ని మంత్రి మరింత నొక్కిచెప్పారు. ఎన్ ఇ ఆర్ లో పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్ర , రాష్ట్ర

ప్రభుత్వాలు సంయుక్తంగా

పనిచేయాల్సిన అవసరం ఉందని

ఆయన అన్నారు. కొన్ని అగ్ర ప్రాధాన్య/లక్ష్య రంగాలను గుర్తించి, ఈ ప్రాంతంలో పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచి, ఆ రంగాలలో అడ్డంకులను అధిగమించడానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.

 

ఎన్ ఇ ఆర్ కోసం త్వరలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ నిర్వహించాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు స్నేహపూర్వక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టడం ప్రారంభించాలని మంత్రి అన్నారు.

పెట్టుబడిదారుల అవసరాలకు అనుగుణంగా విధానాలను మార్చడం, ల్యాండ్ బ్యాంకులను డిజిటలైజ్ చేయడం, ప్లాట్ స్థాయి సమాచారం కలిగి ఉండటం, ప్రక్రియలను సరళీకృతం చేయడం, సింగిల్ విండో క్లియరెన్స్ వ్యవస్థను అందించడం, తక్షణం పెట్టుబడి పెట్టగల ప్రాజెక్టుల జాబితాను అభివృద్ధి చేయడం, ప్రతి రాష్ట్రంలో పెట్టుబడిదారుల ఫెసిలిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయడం, అప్రోచ్ రోడ్లు, పవర్ కనెక్టివిటీ, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వడంపై పెట్టుబడి పెట్టడం వంటి వివిధ చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు. రాబోయే నెలల్లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహణ కోసం ఒక కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించడానికి తాను పేర్కొన్న కార్యక్రమాలపై పనిచేయాలని సీనియర్ అధికారులకు శ్రీ కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.

***


(Release ID: 1866097) Visitor Counter : 223