పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
చీతా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు
చిరుతల పురోగతిని సమీక్షించడానికి, ఆరోగ్య స్థితిని పర్యవేక్షించడానికి ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడమైంది.
చిరుత టాస్క్ ఫోర్స్ పర్యాటక రంగ అవస్థాపన సౌకర్యాల అభివృద్ధిపై సూచనలు, సలహాలు ఇస్తుంది.
ముఖ్యమైన పరిరక్షణ ప్రభావాలను కలిగి ఉండటానికి చిరుతను తిరిగి తీసుకురావడం జరిగింది.
Posted On:
07 OCT 2022 3:26PM by PIB Hyderabad
పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్, ఇతర అనువైన నిర్దేశిత ప్రాంతాలలో ఇటీవల చేపట్టిన చిరుతల ప్రవేశాన్ని పర్యవేక్షించడానికి ఒక టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ (ఎన్‌టీసీఏ) చీతా టాస్క్ ఫోర్స్ పనిని సులభతరం చేస్తుంది. అవసరమైన అన్ని సహాయాలను అందిస్తుంది. ఈ టాస్క్ ఫోర్స్ రెండేళ్లపాటు అమలులో ఉంటుంది. ఈ టాస్క్ ఫోర్స్ తమ ఆదేశాల ప్రకారం చిరుతలను క్రమం తప్పకుండా సందర్శించడానికి ఒక ఉపసంఘాన్ని(సబ్ కమిటీ) నియమించుకోవచ్చు.
చిరుత పులుల పునరుద్ధరణ అనేది నిజమై చిరుతల ఆవాసాలను, వాటి జీవవైవిధ్యాన్ని తిరిగి నెలకొల్పేందుకు ఒక నమూనా లేదా నమూనాలో భాగం. ఇది జీవవైవిధ్య క్షీణత, వేగవంతమైన నష్టాన్ని అరికట్టడానికి సహాయపడుతుంది. ఈ జంతు జాతులలో అతిపెద్ద మాంసాహారిని తిరిగి తీసుకురావడం చారిత్రక పరిణామ సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. ఫలితంగా పర్యావరణ వ్యవస్థలోని వివిధ స్థాయిలపై సమతుల్యత ఏర్పడి వివిధ స్థాయిలలో ప్రభావాలు ఏర్పడతాయి. చిరుతను తిరిగి తీసుకురావడం వల్ల ముఖ్యమైన పరిరక్షణ చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. చిరుత భారతీయ జింకలు, దుప్పిలలో ఉండే అధిక వేగాన్ని అనుసరించేందుకు పరిణామ క్రమంలో ఏర్పడిన వేగం. చిరుతను పునరుద్ధరించడం ద్వారా, పలు బెదిరింపు జాతులతో కూడిన దాని వేటాడే స్థావరాన్ని మాత్రమే కాకుండా, అంతరించిపోతున్న ఇతర జాతుల గడ్డి భూములు/ బహిరంగ అటవీ పర్యావరణ వ్యవస్థలను కూడా రక్షించగలుగుతాం. వీటిలో కొన్ని అంతరించిపోయే జాతులు కూడా ఉన్నాయి.
టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు కారణం:
a. చిరుతపులి ఆరోగ్య స్థితిని, పురోగతిని సమీక్షించండం, చిరుతల పర్యవేక్షణ, దిగ్బంధం, సాఫ్ట్ రిలీజ్ ఎన్‌క్లోజర్‌ల సంరక్షణ, మొత్తం ప్రాంతం రక్షణ స్థితి, అటవీ & పశువైద్య అధికారులచే నిర్వచించబడిన ప్రోటోకాల్‌లకు కట్టుబడి ఉండేలా చూడటం. మధ్యప్రదేశ్ అటవీ శాఖకు, ఎన్‌టీసీఏ విభాగానికి భారతదేశంలో చిరుత పరిచయంపై సలహాలు మరియు మొత్తం ఆరోగ్యం, ప్రవర్తన మరియు వాటి సంరక్షణకు సంబంధించి చిరుత స్థితిపై అవగాహన కల్పించడం.
b. వేట నైపుణ్యాలను, కునో నేషనల్ పార్క్ యొక్క ఆవాసాలకు చిరుతల అనుసరణను పర్యవేక్షించడం.
c. క్వారంటైన్ బోమాస్ నుండి సాఫ్ట్ రిలీజ్ ఎన్‌క్లోజర్‌లకు ఆపై గడ్డి భూములు, బహిరంగ అటవీ ప్రాంతాలకు చిరుత విడుదలను పర్యవేక్షించడం.
d. ఎకో-టూరిజం కోసం చిరుత ఆవాసాన్ని తెరవడం. ఈ విషయంలో నిబంధనలను పరిశీలించడం.
e. కునో నేషనల్ పార్క్, ఇతర రక్షిత ప్రాంతాల అంచు ప్రాంతాలలో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సలహా అందించడం.
f. చిరుత మిత్రలు మరియు స్థానిక సంఘాలకు అవగాహన పెంపొందించడానికి, సాధారణంగా చిరుతలను రక్షించడంలో పాల్గొనేందుకు వారితో క్రమం తప్పకుండా సంభాషించండం.
టాస్క్ ఫోర్స్ సభ్యులు:
1. ప్రిన్సిపల్ సెక్రటరీ (అటవీ), మధ్యప్రదేశ్
2. ప్రిన్సిపల్ సెక్రటరీ (టూరిజం), మధ్యప్రదేశ్
3. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ & హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, మధ్యప్రదేశ్
4. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) & చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, మధ్యప్రదేశ్
5. శ్రీ అలోక్ కుమార్, రిటైర్డ్. ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (వైల్డ్ లైఫ్) & చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్, మధ్యప్రదేశ్
6. డాక్టర్ అమిత్ మల్లిక్, ఇన్స్పెక్టర్ జనరల్, ఎన్‌టీసీఏ, న్యూఢిల్లీ
7. డాక్టర్ విష్ణు ప్రియ, వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్ శాస్త్రవేత్త
8. శ్రీ అభిలాష్ ఖండేకర్, సభ్యుడు ఎంపీ ఎస్బీడబ్య్లూఎల్, భోపాల్
9. శ్రీ శుభోరంజన్ సేన్, ఎపీసీసీఎఫ్- వన్యప్రాణి - మెంబర్ కన్వీనర్
*****
(Release ID: 1866049)
Visitor Counter : 213