రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గ్రీన్ ఎన్విరాన్ మెంట్ కోసం భారతీయ రైల్వే సమీకృత వ్యూహం


రైల్వే 2030 నాటికి నికర జీరో కార్బన్ ఉద్గారిణిగా మారేందుకు భారతీయ రైల్వే యత్నాలు

Posted On: 07 OCT 2022 11:57AM by PIB Hyderabad

రవాణా రంగం ఉద్గారాల అరంగా గణనీయమైన ఉపశమన సామర్థ్యం కలిగిన కీలక రంగాలలో ఒకటిగా ఉండడంతో  భారత ప్రభుత్వం, తన జాతీయ నిర్దేశిత లక్ష్యాల (నేషనల్లీ డిటర్మిండ్ కంట్రిబ్యూషన్స్ - ఎన్ డిసి) లో భాగంగా, 33% ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాన్ని నిర్దేశించుకుంది,

2030 నాటికి సరుకు రవాణాలో భారతీయ రైల్వేల వాటాను ~35-36% నుండి 45% కు పెంచడం భారత ప్రభుత్వం చేపట్టిన అత్యంత కీలకమైన రవాణా ఉద్గారాల ఉపశమన వ్యూహాలలో ఒకటి.

వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశ ఎన్ డి సి కి దోహదపడటంలో అనేక మార్గాల ద్వారా రైల్వేలు ప్రధాన పాత్రను పోషిస్తున్నాయి:

2030 నాటికి మొత్తం భూ ఆధారిత సరుకు రవాణాలో రైల్వేల వాటాను ప్రస్తుతమున్న 36% నుండి 45% కు పెంచడం.

దేశవ్యాప్తంగా డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డిఎఫ్ సి) లను ఏర్పాటు చేయడం,

ప్రాజెక్టు మొదటి దశ లోనే 30 సంవత్సరాల కాలంలో సుమారు 457 మిలియన్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంచనా.

దాని ఇంధన మిశ్రమంలో పునరుత్పాదక ఇంధన వాటాను పెంచడం.

డీజిల్ , ఎలక్ట్రిక్ ట్రాక్షన్ రెండింటికీ రైల్వేలు తన ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరుస్తాయి, తద్వారా దేశానికి జిహెచ్ జి ఉద్గారాలను తగ్గించడానికి వీలు.

రైల్వే రంగంలో పిఎటి పథకం అమలు

ట్రాక్షన్ డీజిల్ ఫ్యూయల్ లో 5% జీవ ఇంధనాల

మిశ్రమం వినియోగం

2030 నాటికి నీటి వినియోగ సామర్ధ్యం లో 20% మెరుగుదల

కార్బన్ సింక్ పెంచడానికి చెట్ల పెంపకం.

వ్యర్థాల నిర్వహణ , కాలుష్య నియంత్రణ.

భారతీయ రైల్వే అభివృద్ధి లో పర్యావరణ సుస్థిరతను సాధించడం కోసం వనరులు , మౌలిక సదుపాయాల నిర్వహణకు గ్రీన్ బిల్డింగ్ లు, ఇండస్ట్రియల్ యూనిట్ లు ఇతర ఎస్టాబ్లిష్ మెంట్ లపై మంచి విధానాలను అవలంబించడం.

"స్వచ్ఛ భారత్ మిషన్"లో సహకారం.

అన్ని రైల్వే ట్రాక్ ల విద్యుదీకరణను పూర్తి చేయడం ద్వారా 2030 నాటికి "నికర జీరో" సంస్థగా మారాలని భారతీయ రైల్వే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.

ఇంధన సామర్ధ్య నిర్వహణ (ఎనర్జీ ఎఫిషియెన్సీ మేనేజ్ మెంట్), పునరుత్పాదక ,ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, నీటి సంరక్షణ, అడవుల పెంపకం, వాటర్ మేనేజ్ మెంట్ ,గ్రీన్ సర్టిఫికేషన్ లతో సహా కొన్ని గుర్తించదగిన కార్యక్రమాలతో పర్యావరణ నిర్వహణకు సంబంధించి తన చొరవలను క్రమబద్ధీకరించడానికి భారతీయ రైల్వే చర్యలు చేపట్టింది.

2014 నుండి భారతీయ రైల్వేలు చేపట్టిన సంస్కరణలను స్థూలంగా ఈ క్రింది రంగాలలో వర్గీకరించవచ్చు:

నికర జీరో కార్బన్ ఎమిషన్:-

భారతీయ రైల్వే (ఐ ఆర్) తన కార్బన్ ఉనికిని క్రమంగా తగ్గించి, 2030 నాటికి నికర జీరో కార్బన్ ఎమిటర్ గా మారాలని యోచిస్తోంది.  ఐఆర్ తన కార్బన్ ఉనికిని ప్రాథమికంగా పునరుత్పాదక ఇంధన వనరుల నుండి దాని ఇంధన అవసరాలను పొందడం ద్వారా తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. 2029-30 నాటికి, పునరుత్పాదక సామర్థ్యాన్ని స్థాపించడానికి 30 గిగావాట్ల అవసరం ఉంటుందని భావిస్తున్నారు. ఐఆర్ 2022 ఆగస్టు వరకు 142 మెగావాట్ల సోలార్ రూఫ్ టాప్ కెపాసిటీ , 103.4 మెగావాట్ల విండ్ ఎనర్జీని ఇన్ స్టాల్ చేసింది.

నికర జీరో ఎమిటర్ దిశగా ఇతర వ్యూహాలలో రైలు మార్గాల విద్యుదీకరణ సంబంధిత బహుళ-అంచెల విధానాన్ని తీసుకోవడం, డీజిల్ నుండి ఎలక్ట్రిక్ ట్రాక్షన్ కు మారడం, ఇంధన సామర్థ్యాన్ని ప్రోత్సహించడం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ల నిర్మాణం, రైల్వే ఎస్టాబ్లిష్ మెంట్ ల గ్రీన్ సర్టిఫికేషన్ మొదలైనవి ఉన్నాయి.

మొత్తం 65,141 ఆర్ కెఎమ్ (80.61%) బిజి నెట్ వర్క్ లో 52,508 ఆర్ కెఎమ్ లను భారతీయ రైల్వే విద్యుదీకరించింది.

100% విద్యుదీకరణతో, విద్యుత్ డిమాండ్ 2019-20 లో 21 బియుల నుండి 2029-30 నాటికి 72 బియులకు పెరుగుతుంది. బిజినెస్ యాజ్ నార్మల్ మోడ్ ప్రకారం 2029-30 నాటికి కార్బన్ ఉద్గారాలు 60 మిలియన్ టన్నులుగా అంచనా వేయబడ్డాయి, ఇది ఐఆర్ రూపొందించిన వివిధ చర్యల ద్వారా ఆఫ్ సెట్ చేయబడుతుంది.

సమర్థవంతమైన నీటి యాజమాన్యం కోసం వాటర్ పాలసీ 2017:-

రైల్వే స్టేషన్లు, రైళ్లు, రైల్వే కాలనీలు మొదలైన వాటిలో అమలు చేయడం కొరకు అన్ని జోనల్ రైల్వేలు ప్రొడక్షన్ యూనిట్ లకు వాటర్ పాలసీ 2017 జారీ చేయబడింది.  జాతీయంగా నిర్ణయించిన కంట్రిబ్యూషన్ లో భాగంగా 2020 నాటికి భారత ప్రభుత్వం ద్వారా నీటి వినియోగంలో 20% తగ్గింపును సాధించే మొత్తం ప్రయత్నాల్లో ఇది ఒక భాగం.  సమర్థవంతమైన డిమాండ్ ,సప్లై మేనేజ్ మెంట్, వాటర్ ఎఫిషియెంట్ సిస్టమ్ లను ఇన్ స్టాల్ చేయడం ,రైల్వే స్థలం లో వాటర్ రీసైక్లింగ్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడం ద్వారా నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశ్యం.

అటవీ అభివృద్ధి ద్వారా అదనపు కార్బన్ సింక్ సృష్టించడం               

ఖాళీగా ఉన్న రైల్వే భూమిలో , సెక్షన్ల మధ్య అటవీ అభివృద్ధిని రైల్వే శాఖాపరంగా నిర్వహిస్తుంది. పర్యావరణ మెరుగుదల ,సుస్థిర అభివృద్ధి దిశగా రైల్వేల నిబద్ధతకు అనుగుణంగా, రాష్ట్రాల అటవీ శాఖలు మొక్కల పెంపకంతో పాటు వాటి నిర్వహణ, పంపిణీ లో చురుకైన పాత్ర పోషిస్తున్నాయి. ఐఆర్ 2017 నుండి సంవత్సరానికి సుమారు కోటి చెట్లను నాటుతోంది. 2021-22 సంవత్సరంలో 72 లక్షల మొక్కలు నాటారు.

వ్యర్థాల నిర్వహణ:-

వ్యర్థాల నిర్వహణ కోసం కొరకు వేస్ట్ టూ ఎనర్జీ/కంపోస్ట్/బయోగ్యాస్ ప్లాంట్ లు/మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ ని 250కి పైగా స్టేషన్ ల్లో ఏర్పాటు చేశారు. మూలం వద్ద వ్యర్థాలను వేరు చేయడం కోసం పొడి , తడి వ్యర్థాల కోసం ప్రత్యేక బిన్ లు ఏర్పాటు చేశారు. 2015 నుంచి స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ద్వారా గ్రీన్ సర్టిఫికేషన్/ ఆమోదం అమలు చేస్తున్నారు.

సుమారు 700 రైల్వే స్టేషన్లు ఐ ఎస్ ఓ: 14001కి పర్యావరణ నిర్వహణ వ్యవస్థను అమలు చేయడానికి సర్టిఫికేట్ పొందాయి.

545 కు పైగా స్టేషన్లు సంబంధిత రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి సిటి ఓ నిర్వహణకు అంగీకారాన్ని సాధించాయి.

31 రైల్వే భవనాలు (కార్యాలయాలు, శిక్షణా సంస్థలు, ఆసుపత్రులు పాఠశాలలతో సహా), 32 స్టేషన్లు 55 వర్క్ షాప్ లు/ పి యు లు గ్రీన్ సర్టిఫికేషన్ సాధించాయి.

పర్యావరణ సంబంధిత పనుల అమలు కోసం

మంజూరు అయిన అన్ని పనుల్లో 1% ఖర్చును కేటాయించే విధానం:-

పర్యావరణంపై కార్యకలాపాల ప్రభావాన్ని నిరోధించడానికి , పర్యావరణ సంరక్షణ కోసం, పర్యావరణ సంబంధిత పనిని అమలు చేయడం కోసం మంజూరు చేసిన అన్ని పనుల్లో 1% ఖర్చును కేటాయించేవిధంగా మే 2016లో ఒక విధానాన్ని తెచ్చారు.

రైళ్ళు ,రైల్వే స్టేషన్ల పరిశుభ్రత:-

రైళ్లు , రైల్వే స్టేషన్ ల పరిశుభ్రత గత 08 సంవత్సరాల్లో ప్రాధాన్యం పెరిగింది. రైల్వే స్టేషన్ లు, రైలు బోగిలలో యాంత్రిక క్లీనింగ్ కాంట్రాక్ట్ ల సంఖ్య పెరగడం, స్టేషన్ ల వద్ద చెత్త తొలగించే కాంట్రాక్టులు ఇవ్వడం, అనేక రైళ్లలో ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ (ఓ బి హెచ్ ఎస్) పెరగడం వంటి చర్యలతో వల్ల రైళ్లు , రైల్వే స్టేషన్ ల పరిశుభ్రత గణనీయంగా మెరుగు పడుతోంది.

ప్యాసింజర్ కోచ్ ల కోసం పర్యావరణ హితమైన బయో టాయిలెట్ లు:-

ప్యాసింజర్ కోచ్ ల కోసం పర్యావరణ హితమైన బయో టాయిలెట్లను డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో)తో కలిసి భారతీయ రైల్వే (ఐఆర్) సంయుక్తంగా అభివృద్ధి చేసింది.

2014 మార్చి నాటికి 3,647 కోచ్ లలో 9,587 బయో టాయిలెట్లను అమర్చారు. 2021 మార్చి నాటికి దాదాపు 73,110 కోచ్ లలో 2,58,990 బయో టాయిలెట్లను ఏర్పాటు చేయడంతో, భారతీయ రైల్వేలో ప్రయాణీకులతో నడిచే అన్ని కోచ్ లలో బయో టాయిలెట్ల ఫిట్ మెంట్ పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. ఆ విధంగా 'స్వచ్ఛ భారత్ మిషన్'కు అనుగుణంగా రైళ్ల నుంచి మానవ వ్యర్థాలను నేరుగా విడుదల చేయడం తొలగించబడింది.

పరిశుభ్రతపై ప్యాసింజర్ ఫీడ్ బ్యాక్ తో సహా తృతీయపక్ష ఆడిట్/సర్వే:-

ప్రధాన స్టేషన్ల పరిశుభ్రతపై తృతీయపక్ష ఆడిట్ కమ్ సర్వే 2016లో ప్రారంభమైంది. 2017, 2018 ,2019 సంవత్సరాల్లో తిరిగి నిర్వహించబడింది.

ముఖ్యమైన రైళ్ల పరిశుభ్రతపై మొట్టమొదటి థర్డ్ పార్టీ ఆడిట్ కమ్ సర్వే 2018 లో నిర్వహించబడింది.

 

అటువంటి సర్వేలు స్వతంత్ర మదింపును అందిస్తాయి. ఇంకా ప్యాసింజర్ ఇంటర్ ఫేస్ ప్రాంతాల్లో పరిశుభ్రతను మెరుగుపరచడంలో ఆరోగ్యకరమైన పోటీ భావనను కూడా పెంపొందిస్తాయి.

స్టేషన్లు , రైళ్ళ హౌస్ కీపింగ్ స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ , సర్వీసుల కాంట్రాక్ట్ కు సాధారణ షరతులు:-

ప్యాసింజర్ ఇంటర్ ఫేస్ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి హౌస్ కీపింగ్/క్లీనింగ్ కాంట్రాక్ట్ ల సమర్థతను మెరుగుపరచడానికి స్టాండర్డ్ బిడ్ డాక్యుమెంట్ (ఎస్ బి డి) (ఆగస్టు 2017) , కాంట్రాక్ట్ ఫర్ సర్వీసెస్ జనరల్ కండిషన్స్ (జి సి సి ఎస్) (ఫిబ్రవరి 2018) లను జారీ చేశారు. 

 

***


(Release ID: 1865919) Visitor Counter : 235