ఆర్థిక మంత్రిత్వ శాఖ
ప్రస్తుత నగదు సరఫరా సమస్యలను అధిగమించేందుకు అనుషంగిక షరతులు లేని ద్రవ్యాన్ని సహేతుకమైన వడ్డీ రేట్లతో పౌర వినామనయాన రంగానికి అందించేందుకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ఇసిఎల్‌జిఎస్)ను సవరించిన డిఎఫ్ఎస్
Posted On:
05 OCT 2022 2:06PM by PIB Hyderabad
దేశ ఆర్థికాభివృద్ధిలో బలమైన, సమర్ధవంతమైన పౌర విమానయాన రంగం కీలకమని గుర్తించిన ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన ఆర్థిక సేవల విభాగం (డిఎఫ్ఎస్) ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ఎసిఎల్‌జిఎస్ - అత్యవసర పరపతి శ్రేణి హామీ పథకం)ను మంగళవారం నాడు సవరించింది. దీని ప్రకారం ఇసిఎల్‌జిఎస్ 3.0 కింద వైమానిక సంస్థలకు గరిష్ట రుణ మొత్తం పొందేందుకు వారి అర్హతను వారి నిధుల ఆధారంగా లేదా నిధియేతర ఆధారిత రుణ బకాయిల్లో 100% పెంచింది. ప్రస్తావించిన తేదీలలో ఆ మొత్తం రూ. 1,500 కోట్లు, లేదా పైన పేర్కొన్న బకాయిలు ఏది తక్కువైతే దానిగానూ పరిగణిస్తారు. కాగా, ఫై వాటిలో రూ. 500 కోట్లను యజమానుల ఈక్విటీ సహకారం ఆధారంగా గణిస్తారు.
ఇసిఎల్‌జిఎస్ 30.08.2022 నాటి కార్యాచరణ మార్గదర్శకాలు ప్రకారం నిర్దేశించిన అన్ని ఇతర ప్రమాణాల నిబంధనలు, షరతులు యధాతథంగా వర్తిస్తాయి.
ప్రవేశపెట్టిన సవరణలు వారి ప్రస్తుత నగదు ప్రవాహ సమస్యలను అధిగమించడానికి సహేతుకమైన వడ్డీ రట్లకు అవసరమైన అనుషంగిక షరతులు లేని ద్రవ్యాన్ని అందించేందుకు ఉద్దేశించబడ్డాయి.
ఇంతకు ముందు, కేంద్ర ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2022-23లో చేసిన ప్రకటనను అమలు చేసేందుకు మార్చి 2022లో, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీం (ఇసిఎల్‌జిఎస్)ను మార్చి 2022 నుంచి మార్చి 2023వరకు పొడిగించారు.
పౌర విమానయాన రంగం మొత్తం రుణంలో నిధియేతర ఆధారిత రుణాలు అధిక మొత్తంలో ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని, అర్హులైన రుణగ్రహీతలు వారి మొత్తం నిధి, నిధియేతర ఆధారిత రుణ బకాయిలలో 50%వరకు, ఒక్కొక్క రుణ గ్రహీత గరిష్టంగా రూ. 400 కోట్ల వరకు పొందేందుకు అనుమతించారు.
***
(Release ID: 1865428)
Visitor Counter : 236