పౌర విమానయాన మంత్రిత్వ శాఖ
కొల్హాపూర్-ముంబై మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను ప్రారంభించిన పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా
కొల్హాపూర్ విమానాశ్రయం ఆప్రాన్ విస్తరణ వచ్చే నెలలో ప్రారంభం, దేశీయ టెర్మినల్ భవనం మార్చి 2023లో అందుబాటులోకి: శ్రీ సింధియా
433 కొత్త రూట్లు ప్రారంభం, ఇప్పటి వరకు ఉడాన్ కింద కోటి మందికి పైగా ప్రయాణీకులు ప్రయాణం
Posted On:
04 OCT 2022 4:30PM by PIB Hyderabad
కొల్హాపూర్ నుండి ముంబైకి నేరుగా ప్రయాణం చేసే విమానాన్ని పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) విజయ్ కుమార్ సింగ్ తో కలిసి ఈరోజు ప్రారంభించారు.
పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రతిష్టాత్మక ఆర్సిఎస్ ఉడాన్ పథకం కింద ఈ విమానాన్ని టైర్-2, టైర్ -3 నగరాలకు విమాన కనెక్టివిటీని అందించడానికి, అందరికీ సరసమైన విమాన ప్రయాణాన్ని అందించడానికి ప్రారంభమైంది. .
కొల్హాపూర్-ముంబై మధ్య వారానికి మూడు సార్లు మంగళవారం, గురువారం, శనివారంలో ఈ విమానం నడుస్తుంది-
Flt No.
|
From
|
To
|
Freq
|
Dep. Time
|
|
Arr. Time
|
Eff. from
|
S5 161
|
BOM
|
KLH
|
2,4,6
|
1030 hrs
|
|
1125hrs
|
4th October 2022
|
S5 162
|
KLH
|
BOM
|
2,4,6
|
1150 hrs
|
|
1245hrs
|
4th October 2022
|
ఉడాన్ పథకం దేశంలోని సామాన్య పౌరులకు విమాన ప్రయాణాన్ని సరసమైనదిగా చేయాలనే ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేస్తోందని శ్రీ జ్యోతిరాదిత్య సింధియా తన ప్రారంభోపన్యాసంలో అన్నారు. ఇప్పటివరకు 433 కొత్త రూట్లు ప్రారంభం అయ్యాయని, ఈ పథకం కింద కోటి మందికి పైగా ప్రయాణికులు ప్రయోజనం పొందారని తెలిపారు. కొల్హాపూర్ విమానాశ్రయం ఆప్రాన్ విస్తరణ నవంబర్‌లో ప్రారంభం అవుతుందని, దేశీయ టెర్మినల్ భవనాన్ని 2023 మార్చిలో ప్రారంభిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
కేంద్ర సహాయ మంత్రి జనరల్ విజయ్ కుమార్ సింగ్ కొల్హాపూర్, ముంబై ప్రజలను అభినందించారు. ఈ విమానం ప్రయాణ సౌలభ్యాన్ని సృష్టించడమే కాకుండా ప్రాంతాలలో వాణిజ్య కార్యకలాపాలను గణనీయంగా పెంచుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రారంభోత్సవంలో పార్లమెంట్ సభ్యులు శ్రీ సంజయ్ మాండ్లిక్, శ్రీ ధైర్యషీల్ మానే, శ్రీ ధనంజయ్ మహాదిక్,
మహారాష్ట్ర మంత్రి శ్రీ చంద్రకాంత్ పాటిల్ పౌర విమానయాన శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి ఉషాపాధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
*****
(Release ID: 1865224)
Visitor Counter : 149