రైల్వే మంత్రిత్వ శాఖ
పండుగల సీజన్‌లో ప్రయాణాలు సాఫీగా, సౌకర్యవంతంగా జరిగేలా చూసేందుకు 179 ప్రత్యేక సర్వీసులు (జతలు) నడపనున్న రైల్వే
2269 ట్రిప్పులు నడవనున్న 179 ప్రత్యేక సర్వీసులు
ప్రధాన రైల్వేస్టేషన్లలో రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు
దేశం వివిధ ప్రాంతాల్లో ప్రధాన కేంద్రాలను కలుపుతూ ప్రత్యేక సర్వీసులు
Posted On:
04 OCT 2022 4:32PM by PIB Hyderabad
పండుగల సీజన్‌లో అదనపు రద్దీ ని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం ఛత్ పూజ వరకు 179 ప్రత్యేక (జతలు) రైళ్లను భారతీయ రైల్వే నడుపుతుంది. దేశంలో ఢిల్లీ-పాట్నా,ఢిల్లీ-భాగల్పూర్, ఢిల్లీ-ముజఫర్‌పూర్, ఢిల్లీ-సహర్సా మొదలైన రైల్వే మార్గాల్లో ఈ ప్రత్యేక రైళ్లు 2269 ట్రిప్పులు నడుస్తాయి.
ప్రకటించిన ఛత్, దీపావళి, పూజ స్పెషల్-2022 (03.10.22 నాటికి) రైళ్లు
|
క్ర.స |
రైల్వే |
ప్రత్యేక రైళ్లు . (జతగా)
|
మొత్తం ట్రిప్పులు
|
1
|
మధ్య రైల్వే |
7
|
100
|
2
|
తూర్పు మధ్య రైల్వే జోన్ |
9
|
128
|
3
|
తూర్పు కోస్తా |
6
|
94
|
4
|
తూర్పు రైల్వే జోన్ |
14
|
108
|
5
|
ఉత్తర రైల్వే |
35
|
368
|
6
|
ఉత్తర మధ్య రైల్వే |
8
|
223
|
7
|
ఈశాన్య రాయిల్వే |
2
|
34
|
8
|
ఎన్ఎఫ్ఆర్ |
4
|
64
|
9
|
ఎన్ డబ్ల్యు ఆర్ |
5
|
134
|
10
|
దక్షిణ రైల్వే |
22
|
56
|
11
|
ఆగ్నేయ రైల్వే |
2
|
14
|
12
|
దక్షిణ మధ్య రైల్వే |
19
|
191
|
13
|
ఎస్ డబ్ల్యు ఆర్ |
22
|
433
|
14
|
డబ్ల్యు సీ ఆర్ |
6
|
16
|
15
|
డబ్ల్యు ఆర్ |
18
|
306
|
|
మొత్తం
|
179
|
2269
|
అన్‌రిజర్వ్‌డ్ కోచ్‌లలో ప్రయాణికులు క్రమబద్ధంగా ప్రవేశించేందుకు ఆర్‌పిఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో టెర్మినస్ స్టేషన్‌ల వద్ద క్యూ ఏర్పాటు చేయడం ద్వారా రద్దీ నివారణకు రైల్వే ప్రత్యేక చర్యలు అమలు చేస్తుంది.
ప్రయాణికుల భద్రత కోసం ప్రధాన స్టేషన్లలో అదనపు ఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు. . రైళ్లు సజావుగా సకాలంలో నడిచేలా చూడడానికి ప్రధాన స్టేషన్లలో ఎమర్జెన్సీ డ్యూటీలో అధికారులను నియమించారు. రైళ్ల సర్వీసులో ఎలాంటి అంతరాయం ఏర్పడిన సమయంలో ప్రాధాన్యతపై హాజరు కావడానికి వివిధ విభాగాల్లో సిబ్బంది పనిచేస్తారు.
ప్లాట్‌ఫారమ్ నంబర్‌లతో రైళ్ల రాక/బయలు దేరు వేళలను తరచుగా మరియు సకాలంలో ప్రకటించడానికి చర్యలు తీసుకోబడతాయి.
ప్రయాణీకులకు సహాయం మరియు మార్గదర్శకత్వం అందించేందుకు ఆర్పీఎఫ్ సిబ్బంది మరియు టీటీఈ అందుబాటులో ఉండే విధంగా ముఖ్యమైన స్టేషన్లలో "మే ఐ హెల్ప్ యు" కేంద్రాలు పనిచేస్తాయి. ప్రధాన స్టేషన్లలో వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయి. పారామెడికల్ బృందంతో అంబులెన్స్ కూడా అందుబాటులో ఉంది.
సీట్లు ఆక్రమించడం ,ఎక్కువ చార్జీలు వసూలు చేయడం, దళారీల పాల్పడే అక్రమాలు, అవకతవకలు నివారించడానికి రైల్వే భద్రతా, నిఘా విభాగాల సిబ్బంది ప్రత్యేకంగా నిఘా ఉంచి పర్యవేక్షిస్తారు. వెయిటింగ్ హాల్స్, రిటైరింగ్ రూమ్‌లు, ప్లాట్‌ఫారమ్‌లు మరియు సాధారణంగా స్టేషన్ల వద్ద పరిశుభ్రతను నిర్వహించడానికి చర్యలు అమలు చేయాలని జోనల్ హెడ్‌క్వార్టర్స్ ద్వారా ఆదేశాలు, సూచనలు జారీఅయ్యాయి.
***
(Release ID: 1865219)
Visitor Counter : 165