గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
సి పి హెచ్ ఈ ఈ ఓ - గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లు (CPHEEO- MoHUA) నిరంతర (24X7) నీటి సరఫరా వ్యవస్థలపై మొట్టమొదటిసారిగా ప్రాంతీయ వర్క్‌షాప్‌ను నిర్వహించాయి.
Posted On:
29 SEP 2022 5:00PM by PIB Hyderabad
సెంట్రల్ పబ్లిక్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ఆర్గనైజేషన్ (CPHEEO), గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ డ్యూయిష్ గెసెల్స్‌చాఫ్ట్ ఫర్ ఇంటర్నేషనల్ జుసమ్మెనార్‌బీట్ (GIZ) మరియు ఒడిషా ప్రభుత్వం యొక్క సాంకేతిక సహకారంతో నిరంతర (24x7) నీటి సరఫరా వ్యవస్థపై మొట్టమొదటి ప్రాంతీయ వర్క్‌షాప్‌ను 29 మరియు 30 సెప్టెంబర్, 2022 తేదీలలో ఒడిశా రాష్ట్రానికి చెందిన పూరిలో నిర్వహిస్తోంది.
2 రోజుల వర్క్‌షాప్‌ను ఈరోజు ప్రారంభించారు. గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రటరీ & నేషనల్ మిషన్ డైరెక్టర్ (అమృత్) శ్రీమతి డి. తారా ప్రారంభ సమావేశానికి అధ్యక్షత వహించి కీలకోపన్యాసం చేశారు.
గౌరవనీయులైన ప్రధాన మంత్రి 2021 అక్టోబర్ 15 న అన్ని నగరాలకు మరియు దేశంలోని అన్ని పట్టణ ప్రాంతాలలో నీటి సరఫరా సేవల యొక్క సార్వత్రిక కవరేజీ తో సురక్షితమైన మంచి నీరు అందించాలనే లక్ష్యంతో అమృత్ 2.0ని ప్రారంభించారు. మొత్తం 500 అమృత్ నగరాల్లో కనీసం ఒక వార్డు లేదా ఒక డీ ఏం ఏ (DMA) లో కుళాయి సౌకర్యంతో నిరంతర (24x7) నీటి సరఫరాను అందించడం అమృత్ 2.0 యొక్క ఫలితాలలో ఒకటి.
పట్టణ జనాభా యొక్క జీవనోపాధిని మెరుగుపరచడం సేవా పంపిణీని మెరుగుపరచడానికి మరియు ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి నిరంతర (24×7) నీటి సరఫరా అవసరం. అందువల్ల, ఈ పరిజ్ఞానం వ్యాప్తి చేయడం మరియు 24×7 నీటి సరఫరా వ్యవస్థలపై రాష్ట్రాలు మరియు నగరాలలో చైతన్యం తీసుకు రావడం ప్రస్తుత అవసరం.
అడపాదడపా నీటి సరఫరా నుండి 24X7 నిరంతర నీటి సరఫరా వ్యవస్థలకు మార్చడానికి రాష్ట్రాలు మరియు నగరాలకు పరిజ్ఞానం వ్యాప్తి చేయడానికి మరియు చేయూత మద్దతును అందించడానికి, మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో సరఫరా వ్యవస్థలపై నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF)ని మరియు రాష్ట్ర స్థాయి లో 24x7 నీటి టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. రాష్ట్ర స్థాయిలో 24x7 నీటి సరఫరా వ్యవస్థల కోసం రాష్ట్ర స్థాయి టాస్క్‌ఫోర్స్ (STF) వరుసగా ఏర్పాటు చేస్తున్నాయి. ఇప్పటివరకు పది (10) రాష్ట్రాలు మరియు యూ టీ లు 24x7 నీటి సరఫరా వ్యవస్థలపై రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ (STF)ని ఏర్పాటు చేశాయి.
కార్యశాల సందర్భంగా ఒడిషా ప్రభుత్వం ఒడిషాలోని అనేక నగరాల్లో అమలు చేస్తున్న “డ్రింక్ ఫ్రమ్ ట్యాప్” మిషన్ పై శ్రీ.జి. మతి వతనన్, ప్రిన్సిపల్ సెక్రటరీ, హౌసింగ్ & అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ ప్రసంగించారు.
24x7 నీటి సరఫరా వ్యవస్థలపై టెక్నికల్ సెషన్‌లను సి పి హెచ్ ఈ ఈ ఓ గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (CPHEEO, MoHUA) అడ్వైజర్ (PHEE), డాక్టర్ ఎం ధీనాధయలన్ నేతృత్వంలోని నేషనల్ టాస్క్ ఫోర్స్ (NTF) నిర్వహించింది. అమృత్ 2.0 కింద 24x7 నీటి సరఫరాపై రాష్ట్రాలు తమ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికను సమర్పించాయి. పూరి, పూణే, కోయంబత్తూరులో 24x7 నీటి సరఫరా కేసు-అధ్యయనాలు మరియు షోలాపూర్ యొక్క నీటి ఆడిట్ కూడా సమర్పించబడ్డాయి.
ఎన్ టి ఎఫ్ (NTF) మంత్రిత్వ శాఖ ప్రచురించిన 24x7 నీటి సరఫరాపై సాంకేతిక మార్గదర్శకాలను సమర్పించింది. ఎన్ టి ఎఫ్ (NTF) 24x7 నీటి సరఫరా మరియు నిర్వహణ విధానం ముసాయిదా మరియు 24×7 నీటి సరఫరా వ్యవస్థపై ముసాయిదా పి పి పి (PPP) మార్గదర్శకాలను కూడా అందజేస్తుంది మరియు రాష్ట్రాల నుంచి పాల్గొనే వారి నుండి అభిప్రాయాన్ని స్వీకరిస్తుంది.
టెక్నికల్ హెడ్‌లు, చీఫ్ ఇంజనీర్లు, సిటీ ఇంజనీర్లు సీనియర్ ఇంజనీర్‌లతో కూడిన 9 రాష్ట్రాల రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ (STF) చైర్మన్‌లు మరియు సభ్యులతో సహా దాదాపు 100 మంది ఈ కాన్ఫరెన్స్‌కు హాజరవుతున్నారు.
*****
(Release ID: 1863530)
Visitor Counter : 126