ఆర్థిక మంత్రిత్వ శాఖ
సీనియర్ సిటిజన్ల పొదుపు పథకం నిర్వహణలో స్పష్టీకరణ
Posted On:
29 SEP 2022 4:32PM by PIB Hyderabad
సీనియర్ సిటిజెన్ల పొదుపు పథకం (ఎస్‌సిఎస్ఎస్) నిర్వహణలో, కొన్ని సందర్భాలలో ఖాతాదారుని మరణం కారణంగా నిర్వహణా ఏజెన్సీలు ఎస్‌సిఎస్ఎస్ ఖాతాను అకాల మూసివేతగా పరగణించి మూసివేస్తున్నాయని గుర్తించడం జరిగింది.
ఈ నేపథ్యంలో ఎస్‌సిఎస్ఎస్ నిబంధన 7(2) పట్ల దృష్టిని ఆకర్షిస్తూ, దిగువ స్పష్టీకరణ చేయడం జరుగుతోందిః
ఎస్‌సిఎస్ఎస్ ఖాతాదారు ఒకవేళ మరణించిన సందర్భంలో నామినీ/ చట్టపరమైన వారసుడి/ రాలు విజ్ఞప్తి మేరకు ఖాతాను మూసివేస్తున్న సందర్భంలో చెల్లించే వడ్డీ ధర ఖాతాదారు మరణించిన తేదీ వరకు ఎస్‌సిఎస్ఎస్ పథకానికి అనుగుణంగా వడ్డీ రేటును చెల్లించాలి. తర్వాత, ఖాతాదారుని మరణించిన తేదీ నుంచి ఖాతాను పూర్తిగా మూసివేసే రోజువరకూ పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్స్‌కు వర్తించే వడ్డీ రేటును చెల్లించాలి.
ఎస్‌సిఎస్ఎస్ ఖాతాదారు మరణం కారణంగా అకాల మూసివేత షరతు వర్తించదు. తన ఖాతాను మెచ్యూరిటీ వ్యవధికి ముందుగా మూసివేయమని ఎస్‌సిఎస్ఎస్ ఖాతాదారు విజ్ఞప్తి చేసినప్పుడు మాత్రమే అకాల ఖాతా మూసివేత అన్నది వర్తిస్తుంది. అలా ఖాతాను అకాలంగా మూసివేస్తున్నప్పుడు మాత్రమే ఎస్‌సిఎస్ఎస్ నిబంధన 6 లో పేర్కొన్నట్టుగా పెనాల్టీ వర్తిస్తుంది.
***
(Release ID: 1863524)
Visitor Counter : 185