సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్వచ్ఛతా ప్రచారాన్ని ప్రారంభించిన కెవిఐసి
Posted On:
29 SEP 2022 2:52PM by PIB Hyderabad
అనేక సందర్భాలలో దేశ పౌరులందరికీ స్వచ్ఛతకు, పారిశుద్ధ్యానికి సంబంధించిన సందేశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌ను న్యూఢిల్లీలోని రాజ్‌పథ్‌లో ప్రారంభిస్తూ, కేవలం స్వచ్ఛత కలిగిన భారతదేశం మాత్రమే మహాత్మా గాంధీ జయంతి రోజున ఉత్తమ నివాళులను అర్పించగదని ప్రధానమంత్రి అన్నారు.

దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ మిషన్‌ను జాతీయ ఉద్యమంగా అక్టోబర్ 2, 2014న ప్రారంభించారు.
ప్రధానమంత్రి ఈ స్వప్నాన్ని సాకారం చేసేందుకు ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) తన పూర్తి సామర్ధ్యంతో, పరిపూర్ణ సంకల్పంతో పని చేస్తోంది. ఈ విషయమై, కమిషన్ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ స్వచ్ఛత ప్రచారాన్ని ప్రారంభించి, న్యూఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద పరిశుద్ధమైన, స్వచ్ఛమైన పరిసరాలను కల్పించాలన్న తన సంకల్పాన్ని పునరుద్ఘాటించారు.

ఇంతకు ముందు, ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ 17, 2022న ప్రజలకు పారిశుద్ధ్యం పట్ల అవగాహనను కల్పించేందుకు కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మంత్రి శ్రీ నారాయణ్ రాణె నాయకత్వంలో కమిషన్ కేంద్ర కార్యాలయంలోని అధికారులు, సిబ్బందితో కలిసి కెవిసి చైర్మన్ జుహూ బీచ్ వద్ద స్వచ్ఛతా కార్యక్రమాన్ని నిర్వహించారు.
***
(Release ID: 1863418)