సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

ఐఏఎస్ మరియు ఇతర అఖిల భారత సర్వీసుల అధికారుల సెంట్రల్ డిప్యుటేషన్‌ను సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


సాధారణ పరిపాలన మరియు పరిపాలనా సంస్కరణలపై రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీల వార్షిక సదస్సులో ప్రసంగించిన మంత్రి

పెండింగ్‌లో ఉన్న సర్వీస్ సభ్యుల సర్వీస్ రికార్డ్‌ల సమీక్షలను త్వరితగతిన పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని డాక్టర్ జితేంద్ర సింగ్ డిఓపి&టికి తెలియజేసారు.

Posted On: 28 SEP 2022 3:24PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ; ఎర్త్ సైన్సెస్ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత) ; పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ఐఏఎస్ మరియు ఇతర ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సెంట్రల్ డిప్యుటేషన్‌ను సులభతరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఈ రోజు కోరారు.

సిబ్బంది, సాధారణ పరిపాలన మరియు పరిపాలనా సంస్కరణలను చూసే రాష్ట్రాలు/యూటీల ప్రిన్సిపల్ సెక్రటరీల వార్షిక సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ..మన దేశంలోని సమాఖ్య నిర్మాణంలో కేంద్ర డిప్యుటేషన్ భాగమని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో సహకరించాలని కోరారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఆల్ ఇండియా సర్వీస్ అధికారి ప్రభుత్వానికి ముఖ్యమైన ఇంటర్‌ఫేస్ అని ఆయన అన్నారు.



image.png

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ఆల్ ఇండియా సర్వీసెస్ క్యాడర్ మేనేజ్‌మెంట్ కోసం ఇప్పటికే నిర్దేశించిన నిర్మాణం ఉందని దాన్ని అదే స్ఫూర్తితో అనుసరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయంలో ప్రత్యేక అంశం ఏమిటంటే కేంద్రంలో అఖిల భారత సర్వీసు అధికారులను నియమించడం అని మంత్రి తెలిపారు.


ఏఐఎస్ (డిసిఆర్‌బి) రూల్స్ 1958లోని రూల్ 16(3) కింద రాష్ట్రం/కేంద్రంలో ఉన్నత స్థాయి సామర్థ్యం మరియు చొరవను కొనసాగించడానికి డెడ్‌వుడ్‌ను తొలగించాలనే ఏకైక లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సర్వీసెస్‌లోని అధికారుల రికార్డులను  సమీక్షిస్తుందని డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని సమీక్షలను త్వరితగతిన పూర్తి చేయడంలో సహాయాన్ని అందించాలని మంత్రి కోరారు.

ప్రస్తుత సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 180 మంది ఐఏఎస్ అధికారులను విజయవంతంగా నియమించిందని త్వరలో భర్తీ చేయనున్న రాష్ట్ర సర్వీసుల నుండి ఇండక్షన్ ద్వారా దాదాపు 434 ఖాళీలను భర్తీ చేయడానికి నిర్ణయించామని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సర్క్యులేట్ చేసే ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల సమర్థవంతమైన సర్వీస్ మరియు విజిలెన్స్ నిర్వహణకు సంబంధించిన మార్గదర్శకాలను అనుసరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. కోవిడ్ మహమ్మారి తర్వాత జరుగుతున్న ఈ సమావేశం పరస్పర ఆందోళన మరియు ఆసక్తి ఉన్న విషయాలపై చర్చించడానికి మరియు పాల్గొనడానికి సిబ్బంది విషయాలకు బాధ్యత వహించే రాష్ట్ర కార్యదర్శులతో వార్షిక సమావేశాల సంప్రదాయానికి పునరుజ్జీవనం అని అన్నారు.

 

image.png


శిక్షణ అంశానికి సంబంధించి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..ప్రభుత్వ అధికారి నుండి ఉత్తమమైన పనిని పొందడానికి అతను లేదా ఆమె తగిన శిక్షణ పొందాలని ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం తన అధికారులకు శిక్షణ ఇవ్వడానికి సమర్థవంతమైన శిక్షణా మాడ్యూళ్లను సిద్ధం చేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కోసం ముఖ్యంగా కీలక స్థానాల్లో పనిచేస్తున్న వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక మాడ్యూల్‌ను కూడా రూపొందించిందని దీనిని రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులు దేశ పరిపాలనకు వెన్నెముకగా నిలుస్తారని ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా సుపరిపాలన లక్ష్యాలను సాధించేందుకు మరియు కార్యక్రమాలను అమలు చేసేందుకు భారత ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సమిష్టిగా కృషి చేయడం చాలా ముఖ్యమని మంత్రి అన్నారు. ఈ డిపార్ట్‌మెంట్ మరియు ఇతర భాగస్వామ్యదారుల మధ్య క్రమమైన వ్యవధిలో పరస్పర చర్య కొనసాగే వేదిక అవసరం అని ఆయన అన్నారు.

కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలోనే అతిపెద్ద  ఉద్యోగ నియామక సంస్థలు. ప్రభుత్వ ఉద్యోగం అనేది సమాజంలోని అన్ని వర్గాల్లోని పౌరులకు కలల ఉద్యోగం. ఉత్తమ సౌకర్యాలు, మంచి జీతం మరియు ఉద్యోగ భద్రతను అందించడం వల్ల మాత్రమే కాకుండా..ఈ  ఎంపిక ప్రక్రియ అందరికీ తెరిచి ఉంటుంది. ఇది మెరిట్ ఆధారితమైనది కాబట్టి ప్రజలు ప్రభుత్వ ఉద్యోగం వైపు చూస్తారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ “కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఖాళీలను మిషన్‌ మోడ్‌లో భర్తీ చేయడానికి చొరవ తీసుకున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే విధమైన కసరత్తును చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడం అనేది ప్రతి ఉద్యోగార్థికి ఒక కలగా మిగిలిపోయినప్పటికీ ఉద్యోగాన్ని చిత్తశుద్ధితో మరియు భక్తితో చేయడం మరియు ప్రజల అంచనాలకు అనుగుణంగా జీవించడం అనే అంశం సమాన ప్రాముఖ్యతను పొందుతుంది" అని మంత్రి చెప్పారు.

ఈ ఇంటరాక్టివ్ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేసిన డిఓపి&టి కార్యదర్శితో పాటు ఆమె బృందాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులతో ఇటువంటి నిరంతర పరస్పర చర్యలకు డిఓపిటీ ద్వారా తాను మద్దతు ఇస్తానని తెలిపారు.


 

<><><><>



(Release ID: 1863213) Visitor Counter : 148