ఆర్థిక మంత్రిత్వ శాఖ
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛనుదార్లకు 01.07.2022 నుంచి బాకీ ఉన్న కరువు భత్యం, అధిక ధరల పరిహారాల అదనపు వాయిదాను విడుదల చసేందుకు కేబినెట్ ఆమోదం
Posted On:
28 SEP 2022 4:06PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశం జూన్ 2022 కాలాంతానికి భారత వినియోగదారు ధరల సూచీకి అనుగుణంగా 12 నెలలకు పెరిగిన ధరల శాతం ఆధారంగా తీసుకుని 01.07.2022 నుంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు 4% అదనపు వాయిదాలో కరువు భత్యం (డియర్‌నెస్ అలవెన్స్), అధిక ధరల పరిహారం (డియర్‌నెస్ రిలీఫ్) విడుదలకు ఆమోదం తెలిపింది.
దీనిని 01.07.2022 కాలం నుంచి పరిగణనలోకి తీసుకుంటున్నందున కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఫించనర్లకు అధికమొత్తంలో కరువు భత్యం, అధిక ధరల పరిహారం పొందేందుకు అర్హులు అవుతారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యాన్ని పెంచినందున 2022-23 ఆర్థిక సంవత్సరంలో (అంటే, జులై 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు 8 నెలల కాలానికి) పడనున్న అదనపు ఆర్థిక భారం రూ. 6,591.36; రూ. 4,394.24 కోట్లుగా అంచనావేశారు.
పింఛనుదారులకు అధిక ధరలపరిహారాన్ని పెంచినందున 2022-23 ఆర్థిక సంవత్సరంలో (అంటే, జులై 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు 8 నెలల కాలానికి) పడనున్న అదనపు ఆర్థిక భారం రూ. 6,261.20; రూ. 4,174.12 కోట్లుగా అంచనావేశారు.
అటు కరువు భత్యం, ఇటు అధికర ధరల పరిహారం పెంపు కారణంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో (అంటే, జులై 2022 నుంచి ఫిబ్రవరి 2023 వరకు 8 నెలల కాలానికి) ఖజానాపై ఉమ్మడిగా పడనున్న భారం ఏడాదికి రూ. 12.852.56 కోట్లు; రూ.8,568.36 కోట్లుగా ఉండనుంది.
***
(Release ID: 1863063)
Visitor Counter : 155