గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2022 సెప్టెంబర్ 29 -30, 2022 తేదీల్లో స్వచ్ఛ్ షెహర్ సంవాద్ & టెక్ ఎగ్జిబిషన్‌ను నిర్వహించనునున్న కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ


సంవాద్ లో భాగంగా 16 రాష్ట్రాలు వారి అనుభవాలను, ఉత్తమ నిర్వహణ పద్దతులను, పంచుకోనున్నాయి.

దేశవ్యాప్తంగా వ్యర్థ పదార్థాల నిర్వహణలో అత్యుత్తమ నమూనాలను ప్రదర్శించడానికి ఉపయోగపడనున్న టెక్ ఎగ్జిబిషన్

Posted On: 28 SEP 2022 1:10PM by PIB Hyderabad

స్వచ్ఛ్ అమృత్ మహోత్సవ్, 17 సెప్టెంబర్ 2022 (సేవా దివస్) నుండి 2 అక్టోబర్ 2022 (స్వచ్ఛత దివస్) వరకు పక్షం రోజుల పాటు జరుగుతున్న వివిధ అంశాలపై కార్యకలాపాలను స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ ఎనిమిదేళ్లను పురస్కరించుకుని కేంద్ర గృహ నిర్మాణంపట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీనికి సంబంధించిగృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్వచ్ఛ భారత్ మిషన్ కింద స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ -2022 కింద సెప్టెంబర్ 29 నుండి 30వ తేదీ వరకు స్వచ్ఛ్ షెహర్ సంవాద్’, ‘టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తోంది.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0010Q0J.jpg

సంవాద్‌కు దేశంలోని వివిధ రాష్ట్రాలు, పట్టణాల నుండి ఉన్నతాధికారులుసంబంధిత రంగాల భాగస్వాములుపరిశ్రమల ప్రతినిధులుఎన్‌జీఓలువిద్యాసంస్థలు మొదలైన వారితో సహా 800 మంది ప్రతినిధులు హాజరకానున్నారు. కేంద్ర గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి ఈ సంవాద్ టెక్‌ ఎగ్జిబిషన్ ను ఎగ్జిబిషన్ సెప్టెంబర్ 29, 2022 ప్రారంభిచనున్నారు.

ఈ కార్యక్రమం స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ 2.0 యొక్క సామర్థ్య నిర్మాణ చొరవరాష్ట్రాలు నగరాలను వ్యర్థ పదార్థాల నిర్వహణలో ఇటీవలి పరిణామాలన్నింటిపై అవగాహన కలిగిస్తుంది. మునిసిపాలిటీలు ఘన వ్యర్థాలు మరియు ద్రవ వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా నిర్వహించబడిన అధిక నాణ్యత గల సాంకేతిక, పరిపాలనాపరమైన చర్చలను ఇది వీలు కల్పిస్తుంది. తద్వారా రాష్ట్రాలు, నగరాలు వ్యర్థ రహిత స్థితి వైపు వారి ప్రయాణంలో వ్యూహాలుఉత్తమ పద్ధతులు, సవాళ్లపై  చర్చించడానికి వీలు కల్పిస్తుంది. సంవాద్ వారి అనుభవాలుఉత్తమ నిర్వహణలను పంచుకోవడానికి దాదాపు 16 రాష్ట్రాల నుండి అధికారులు రానున్నారు. వీరితో పాటు యూఎన్‌డీపిజీఐజెడ్ ఇండియాయూఎస్ఎయిడ్ఐఎఫ్‌సీ నుండి భాగస్వాములు మరియు ఐఐటీ రూర్కీబార్క్సీఎస్ఈ, టీఈఆర్ఐ మొదలైన విద్యా మరియు పరిశోధనా సంస్థల నిపుణులు కూడా వారి నైపుణ్యాలను, ఆలోచనలను పంచుకుంటారు.

దేశవ్యాప్తంగా వ్యర్థాల నిర్వహణలో అత్యుత్తమ పనితీరు నమూనాలను ప్రదర్శించే టెక్ ఎగ్జిబిషన్ కూడా సంవాద్‌లో భాగంగా ఉంటుంది. దాదాపు 35 టెక్నాలజీ ఆధారిత సంస్థలు వ్యర్థాల నిర్వహణలో అత్యాధునిక సాంకేతికతను ప్రదర్శిస్తారు. ఐటీ మరియు జీఐఎస్ ఆధారిత అప్లికేషన్లువ్యర్థ నీటి నిర్వహణప్యాకేజింగ్ ఆప్షన్లు, 3R లు (రెడ్యూస్-రీసైకిల్- రీయూజ్)మునిసిపల్ ఘన వ్యర్థాల ప్రాసెసింగ్మొబైల్, పోర్టబుల్ యూనిట్లు వంటి ఘన వ్యర్థాల నిర్వహణ, నిర్మాణం మరియు కూల్చివేత వ్యర్థాలు మరియు నివారణ చర్యలు వంటి అంశాలపై వర్కింగ్ మోడల్‌లు ప్రదర్శించబడతాయి. వ్యర్థ రహిత నగరాలుఆకాంక్షాభరిత మరుగుదొడ్లువ్యర్థ నీటి నిర్వహణ మొదలైన వాటితో సహా మిషన్ కార్యక్రమాలపై నేపథ్య ప్రయోగాత్మక ప్రదర్శనలు కూడా ఇందులో ఉండనున్నాయి.

 

కేంద్ర సహాయమంత్రిశ్రీ కౌశల్ కిషోర్, 30 సెప్టెంబర్ 2022న ముగింపు సమావేశంలో ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా, 17 సెప్టెంబర్ 2022న ప్రారంభించబడిన ఇండియన్ స్వచ్ఛతా లీగ్ (ISL) నగరాంతర పరిశుభ్రత ప్రచార పోటీలో విజేతలు ప్రకటించి సత్కరించారు.

 

అక్టోబర్ 2022న ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆజాదీ@75 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు ప్రకటించబడే గ్రాండ్ ఫినాలేకి సంవాద్ ఒక నాందిగా ఉంటుంది. గౌరవనీయులైన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల యొక్క వివిధ విభాగాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన నగరాలను, రాష్ట్రాలను సత్కరిస్తారు. వ్యర్థ రహిత నగరాల సామూహిక దృక్పథాన్ని ఇతర నగరాలు అనుసరించడానికి, సాకారం చేసుకోవడానికి ఈ అవార్డులు నగరాలను మరింత ప్రేరేపించడానికి ఉపయోగపడతాయని భావించారు.

 

*****


(Release ID: 1862993) Visitor Counter : 159