హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని కలోల్‌లో ఉమియా మాతా K.P ఎడ్యుకేషనల్ ట్రస్ట్ యొక్క 150 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రిని ప్రారంభించిన కేంద్ర హోం మరియు సహకార మంత్రి, శ్రీ అమిత్ షా. 750 పడకల ఆదర్శ్ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్‌కు శంకుస్థాపన.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి పౌరునికి, ముఖ్యంగా పేదలకు ఆరోగ్య హక్కును కల్పించారు.ప్రధాన మంత్రి ఆయుష్మాన్ యోజన పథకం కింద, ప్రధాని నరేంద్ర మోదీ 60 కోట్ల మంది పేదలకు రూ.5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలను అందించారు.

దేశవ్యాప్తంగా ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకాన్ని పునరుద్ధరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులకు దాని ప్రయోజనాలను అందించారు.ఆయుష్మాన్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 600 కంటే ఎక్కువ జిల్లాల్లో 35,000 రూ. 64,000 కోట్లతో కొత్త క్రిటికల్ కేర్ పడకలను కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 730 జిల్లాల్లో, రూ. 1,600 కోట్లతో వివిధ ప్రధాన వ్యాధులకు ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు, పరిశోధనా కేంద్రాల ఏర్పాటు2013-14లో కేవలం 387 వైద్య కళాశాలలు ఉండగా, 2021-22లో వాటి సంఖ్యను 596కు పెంచిన ప్రధాని నరేంద్ర మోదీప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్లను 51,000 నుంచి 89,000కు, పీజీ సీట్లను 31,000 నుంచి 60,000కు పెంచింది.ప్రసూతి మరణాల రేటు

Posted On: 27 SEP 2022 4:57PM by PIB Hyderabad

కేంద్ర హోం మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా నేడు 150 పడకల ఈఎస్ఐసీ హాస్పిటల్‌ను ప్రారంభించారు. అనంతరం గుజరాత్‌లోని కలోల్‌లో ఉమియా మాతా K.P ఎడ్యుకేషనల్ ట్రస్ట్‌కి చెందిన 750 పడకల ఆదర్శ్ మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవ్యకేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ మరియు కార్మిక మరియు ఉపాధి శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తేలీ కూడా పాల్గొన్నారు.

కేంద్రమంత్రి అమిత్ షా మాట్లాడుతూనేడు కలోల్‌లోని రెండు పెద్ద ఆసుపత్రులకు భూమిపూజ జరుగుతుందన్నారు. ఈ ఆసుపత్రుల నుండి కలోల్ తహసీల్ మరియు నగరంలోని పౌరులందరికీ మంచి చికిత్స సౌకర్యాలు లభిస్తాయని ఆయన అన్నారు. ఉమియా మాతాజీ కద్వా పాటిదార్ ట్రస్ట్ నిర్మిస్తున్న ఆసుపత్రిలో 35 శాతం మంది పేద రోగులకు ఉచిత వైద్యం అందుతుందని అమిత్ షా చెప్పారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో మరియు కేంద్ర కార్మిక మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ మార్గదర్శకత్వంలో ఉద్యోగుల రాష్ట్ర బీమా పథకం పునరుద్ధరించబడిందనిదేశవ్యాప్తంగా ఉన్న కార్మికులు దాని ప్రయోజనాలను పొందుతున్నారన్నారు. దేశంలోని ప్రతి వ్యక్తికిముఖ్యంగా పేదలకు ఆరోగ్య హక్కును ప్రధాని నరేంద్ర మోదీ కల్పించారని అన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ యోజన కింద ప్రధానమంత్రి నరేంద్రమోదీ 60 కోట్ల మంది పేదలకు రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య సౌకర్యాలు కల్పించారన్నారుల. 

 

 పేదల కోసం రూ. 64,000 కోట్లతో కేటాయించిన అతి పెద్ద పథకం ఆయుష్మాన్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్‌ అని కేంద్ర హోంమంత్రి అన్నారు. ఈ పథకం కింద, 600 కంటే ఎక్కువ జిల్లాల్లో క్రిటికల్ కేర్ కోసం 35,000 కొత్త పడకలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అందించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వివిధ ప్రధాన వ్యాధులకు 1,600 కోట్లతో 730 జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలు మరియు పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు.

 

2013-14లో దేశంలో కేవలం 387 మెడికల్ కాలేజీలు ఉన్నాయని, 2021-22లో ప్రధాని నరేంద్ర మోదీ వాటి సంఖ్యను 596కు పెంచారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్యను 51,000 నుంచి 89,000కు పెంచింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను కూడా 31,000 నుండి 60,000 కు పెంచారు. ఇది కాకుండాదేశవ్యాప్తంగా 10 కొత్త ఎయిమ్స్ ప్రారంభించబడ్డాయి. 75 కొత్త వైద్య కళాశాలలకు అనుమతి లభించిందిమరో 22 ఎయిమ్స్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు ఉన్నట్లు తెలిపారు.

 

 2018 గణాంకాలతో పోలిస్తే మాతాశిశు మరణాలుశిశు మరణాలు, సంస్థాగత డెలివరీ పారామితులలో గుజరాత్ గొప్ప పురోగతిని సాధించిందని శ్రీ అమిత్ షా అన్నారు. మాతా మరణాల రేటు(ఎంఎంఆర్) మరియు శిశు మరణాల రేటు మరియు సంస్థాగత డెలివరీని మెరుగుపరచడం చాలా కష్టమని ఆయన అన్నారు. నేడు ఆసుపత్రిలో 100 ప్రసవాలకు గాను 96 జరుగుతున్నాయి. లింగ నిష్పత్తిలో గుజరాత్ కూడా అద్భుతమైన పురోగతిని సాధించిందని అన్నారు. క్షయక్యాన్సర్‌పై ప్రత్యేక ప్రచారం నిర్వహిస్తున్నామనిదీని కింద ఈ వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చని చెప్పారు. గాంధీనగర్ జిల్లాలోని రెండు తహసీల్‌లుగాంధీనగర్ మరియు కలోల్‌లలోదాదాపు 80 శాతం గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పూర్తయిందని మంత్రి తెలిపారు.

 

 

****(Release ID: 1862822) Visitor Counter : 159