హోం మంత్రిత్వ శాఖ

గుజరాత్‌లోని సనంద్‌లో ఇ.ఎస్.ఐ.సి. ఆసుపత్రి!


350 పడకల అధునాతన హాస్పిటల్ నిర్మాణానికి
కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా భూమిపూజ

ఎ.యు.డి.ఎ. నిర్మించిన ఓవర్ బ్రిడ్జికి,
పి.హెచ్.సి.కి, మిలన్ కేంద్ర సమాజ్‌వాడీకి
కేంద్రమంత్రి ప్రారంభోత్సవం..
మెల్డీ మాతాజీ ఆలయ సందర్శన, పూజలు..

నవరాత్రి పర్వదినం సందర్భంగా
ప్రజలందరికీ అమిత్ షా శుభాకాంక్షలు

ఇ.ఎస్.ఐ.సి.ని మరింత ప్రయోజకరంగా మార్చేందుకు
ప్రధాని మోదీ ఎంతో కృషి చేశారన్న కేంద్రమంత్రి
ఆరోగ్య మౌలిక సదపాయాల అభివృద్ధికి
మోదీ 3విధానాలు పాటించారన్న అమిత్ షా..

అన్ని రకాల మౌలిక సదుపాయాలను,
మానవ వనరులను విస్తరించడం,..
ఆయుష్ వంటి ప్రధాన భారతీయ వైద్య విధానాలను
ప్రాముఖ్యంతో పాటించడం....
సాంకేతికతతో గ్రామాలకు వైద్య నిపుణుల
సౌకర్యాలను అందించడం....
మోదీ 3 విధానాలని కేంద్రమంత్రి వెల్లడి

ఒ.పి.డి., ఎక్స్‌రే, రేడియాలజీ, ఆపరేషన్
థియేటర్, ఆబ్‌స్టెట్రిక్స్, ఐ.సి.యు.,
అల్ట్రా సౌండ్ వంటి అధునాతన
సదుపాయాలతో సనంద్‌లో రూపొందనున్న
350 పడకల అధునాతన ఆసుపత్రి...


9.5 ఎకరాల్లో 350 పడకలతో ఆసుపత్రి నిర్మాణానికి
తొలుత రూ. 500కోట్ల వ్యయం...
అవసరమైతే. 500 పడకల స్థాయికి
ఆసుపత

Posted On: 26 SEP 2022 4:06PM by PIB Hyderabad

   కార్మిక రాజ్య బీమా సంస్థ (ఇ.ఎస్.ఐ.సి.) ఆధ్వర్యంలో గుజరాత్‌లోని సనంద్‌లో నిర్మించే 350 పడకల ఆసుపత్రికి కేంద్ర హోమ్, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఈ రోజు భూమి పూజ చేశారు.

https://ci4.googleusercontent.com/proxy/XboUJM-rlwT4k8O7GJs6lIaUGBGIrK9djC_PXQHbUQLge1I2loTD6KsmNpFWJ8t_fXa6d9xJJFdwgqsFV_tymKZHfrlOM1-4Exo-4YWuD_WlFiofZ1KlE1YmiQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001RRF8.jpg

  అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ (ఎ.యు.డి.ఎ.) నిర్మించిన బందాయ్ ఓవర్‌బ్రిడ్జికి, విరోచ్నా నగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పి.హెచ్.సి.కి), సైన్స్ సిటీ సమీపంలో ఎ.యు.డి.ఎ. నిర్మించిన మిలన్ కేంద్ర సమాజ్ వాడీకి అమిత్ షా లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.

.

https://ci3.googleusercontent.com/proxy/kt-8PHMexL9xrQEut0wNDugvPoyostWk6JhwBzKoA7EynByv5j9mMmwJK2yp2eWv-_S7ClS5Zetv4TnNkYcGnlxDI4z7zFHoBU-0E54rxC6Y0saFTy5kRwSmog=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002XC6V.jpg

మెల్డీ మాతాజీ దేవాలయాన్ని సందర్శించిన కేంద్ర మంత్రి అమిత్ షా పూజలు చేశారు.

https://ci4.googleusercontent.com/proxy/byhD-fCWujsPzcSAEevIKR57LnS2p8pDf0hqWM4vN0m_BkA8iMSHj9Rjz2CgycWGBP6BlN_UNtbxTTmgdwUj4KuHSek_fB_LDcp-KZjou7Vicob9YvfJB08fFw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003P6FD.jpg

  అమిత్ షా పర్యటనలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలీతో పాటుగా, పలుపురు ప్రముఖులు హాజరయ్యారు.

  ఈ సందర్భంగా, ప్రజలందరికీ అమిత్ షా నవరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఇ.ఎస్.ఐ.సి. ఆధ్వర్యంలో నిర్మించే 350 పడకల ఆసుపత్రిలో అనేక అధునాతన సదుపాయాలు ఉంటాయని అన్నారు.. ఔట్ పేషెంట్ విభాగం (ఒ.పి.డి.), ఇన్‌డోర్ సదుపాయాలు, ఎక్స్‌రే రేడియాలజీ లేబరేటరీ, ఆపరేషన్ థియేటర్, అబ్‌స్టెట్రిక్స్, ఐ.సి.యు., అల్ట్రా సౌండ్ తదితర సదుపాయాలతో పరిపూర్ణమైన వైద్యశాలగా ఈ ఆసుపత్రి రూపొందుతోందన్నారు. తొమ్మిదిన్నర ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న ఈ అధునాతన ఆసుపత్రికోసం రూ. 500కోట్ల వెచ్చిస్తున్నారని తెలిపారు. కేంద్ర కార్మికమంత్రిత్వ శాఖ ఎంతో ముందుచూపుతో ఈ ఆసుపత్రి నిర్మాణానికి ఏర్పాట్లు చేసిందని తెలిపారు. అవసరమైతే ఈ ఆసుపత్రిని 350 పడకల స్థాయినుంచి 500 పడకలకు విస్తరిస్తారని చెప్పారు. గుజరాత్‌లోని సనంద్, పరిసర ప్రాంతాల్లో ఉంటున్న 12లక్షల కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, సనంద్ తహసిల్ పరిధిలోని అన్ని గ్రామాల వారికి ఈ ఆసుపత్రివల్ల ప్రయోజనం చేకూరుతుందని అమిత్ షా చెప్పారు.

https://ci3.googleusercontent.com/proxy/rtIMJgmKeudT_XTMuxVrOR5CTs8XK4blVyJ2f1u60Z4zB4y4Nhxnt7F3iiPchjiWRMPlRdjrRs-6_oa-qs_qWpVq-NTkIrJjXaSNNUPl7DJrIX6mvMZhyEAv8g=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0045JT7.jpg

   2014 వ సంవత్సరంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా, భూపేంద్ర యాదవ్ కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇ.ఎస్.ఐ.సి. పథకం మరింత అర్థవంతంగా రూపొందిందని, మరింత ముందుకు పురోగమించిందని మంత్రి అమిత్ షా తెలిపారు. ఆసుపత్రి నిర్మాణం తర్వాత వైద్య కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణానికి అవసరమైన భూమిని గుజరాత్ ప్రభుత్వం కూడా సమకూరుస్తుందని ఆయన చెప్పారు. మూడు విభాగాలతో కూడిన ఆరోగ్య మౌలిక సదుపాయాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పరిపూర్ణ విధానాన్ని అవలంబించారని ఆయన అన్నారు. వైద్య శాస్త్రానికి సంబంధించిన అన్ని రకాల మౌలిక సదుపాయాలను, మానవ వనరులను విస్తరించడం.... ప్రధాన స్రవంతిలోని ఆయుష్ సంప్రదాయ భారతీయ వైద్య విధానాలకు ప్రాధాన్యం ఇవ్వడం,.. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అన్ని గ్రామాలకు నిపుణులతో కూడిన సౌకర్యాలను అందించడం... ఇలా 3 విభాగాలతో కూడిన మౌలిక సదుపాయాలను మోదీ ప్రభుత్వం కల్పిస్తున్నట్టు ఆయన చెప్పారు.

https://ci6.googleusercontent.com/proxy/CwCblrulBUkkF4xiA_-31sljyMKZJTVF-I1k7_4eDvlFaqdQXi7ixQc00n2kKuROm0TdALVzyL4DK8U_kVwqs6xQoUMLoy0rhXX82jVAhFxcpHpwyj6pL0hueQ=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0059D9S.jpg

    2013-14వ సంవత్సరానికల్లా మనదేశంలో కేవలం 387 వైద్య కళాశాలలు ఉన్నాయని, 2021-22సంవత్సరానికల్లా వైద్య కళాశాలల సంఖ్యను 596కి పెంచేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కృషి చేశారని అమిత్ షా అన్నారు. వైద్యకళాశాలల్లో ఎం.పి.బి.ఎస్. సీట్ల సంఖ్యను 51,000 నుంచి 89,000కి కేంద్ర ప్రభుత్వం పెంచిందని, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంలో ఇది సాధ్యమైందని అన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లను 31,000 నుండి 60,000కు పెంచినట్టు చెప్పారు. ఇది కాకుండా ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద 60 కోట్ల మందికి రూ. 5 లక్షల రూపాయల చొప్పున విలువైన వైద్య సౌకర్యాలను ఉచితంగా అందించారని అన్నారు. ప్రసూతి మరణాల రేటు, శిశు మరణాల రేటు, సంస్థాగత వైద్య సదుపాయాల తదితర ఆరోగ్య ప్రమాణాల విషయంలో గుజరాత్ ప్రభుత్వం కూడా ఎంతో మెరుగుదల సాధించిందన్నారు. సనంద్ ప్రాంతంలోని సుమారు 3 లక్షల మంది కార్మికులకు ఈ ఆసుపత్రి అద్భుతమైన ఆరోగ్య సదుపాయాలను కల్పిస్తుందని అమిత్ షా అన్నారు.

****



(Release ID: 1862462) Visitor Counter : 140