హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బిహార్‌లోని ఇండో- నేపాల్ సరిహద్దులోని ఫతేపూర్ బీఓపిని సందర్శించిన కేంద్ర హోం మరియు సహకార మంత్రి, శ్రీ అమిత్ షా. పిల్లర్ నం. 151 మరియు 152ని పరిశీలన, సశస్త్ర సీమా బల్ (SSB)తో సరిహద్దు ప్రాంతంలోని వివిధ కార్యకలాపాలపై సమీక్ష

Posted On: 24 SEP 2022 4:40PM by PIB Hyderabad

శ్రీ అమిత్ షా ఫతేపూర్ బీఓపీ వద్ద ఫతేపూర్పెక్టోలాబెరియాఅమ్గాచి, రాణిగంజ్ బీఓపీ భవనాలను ప్రారంభించారు. సిబ్బందితో సంభాషించి ఫలహారాలు చేశారుబుధి కాళీ మాత మందిర్‌ను సందర్శించి ప్రార్థనలు చేశారు.

దేశ భద్రత కోసం సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో జీవితంలో అత్యుత్తమ సమయాన్ని వెచ్చించే మన భద్రతా సిబ్బంది సౌకర్యాలు, సంక్షేమాన్ని చూసుకోవడం మన బాధ్యత అని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.

గత ఎనిమిదేళ్లలోప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సరిహద్దుల్లో నియమించబడిన భద్రతా దళాల సిబ్బందికి, వారి కుటుంబాలకు నివాస సౌకర్యాలను కల్పించడానికి సమయానుకూలంగా మరియు దశలవారీగా కృషి చేసింది. ఇందులో భాగంగాఐదు భవనాలు రూ.25 కోట్ల వ్యయంతో నేడు ప్రారంభించబడింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదవి భాద్యతలు చేపట్టిన నుంచిఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మించడం ద్వారా మన సరిహద్దులను రక్షించడానికి తన సంకల్పాన్ని కనబరిచారు.

2008-14 మధ్య కాలంలో సరిహద్దు మౌలిక సదుపాయాల కోసం బడ్జెట్ రూ. 23,700 కోట్లు మాత్రమే ఉంటే2014-20 నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దానిని రూ.44,600 కోట్లకు పెంచారు.

దేశంలో శాంతిభద్రతల పరిరక్షణలోవిపత్తుల సమయంలో సహాయసహాయక చర్యలలో, న్యాయమైన ఎన్నికలను నిర్వహించడంలో మన భద్రతా దళాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి.

తూర్పు ప్రాంతాల నుండి వామపక్ష తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి సశస్త్ర సీమ బల్ యొక్క ధైర్యవంతులు సాటిలేని సహకారం అందించారు.

సాయుధ బలగాల త్యాగంఅంకితభావం, త్యాగాన్ని మన కృతజ్ఞత గల దేశం ఎప్పటికీ మరచిపోదు

 బహిర్గతంగా ఉన్న సరిహద్దుల భద్రతకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా ముఖ్యంఅన్ని సీఆర్‌పీఎప్‌లు ఒకదానికొకటి మంచి పద్ధతులను అవలంబించాలి. ఇలాంటి మరిన్ని సాంకేతికతలను ఉపయోగించి ముందుకు సాగాలి.

హోం మంత్రిత్వ శాఖ చేపట్టిన మొక్కలు నాటే కార్యక్రమమైనా... లేదా సరిహద్దు ప్రాంతాల్లోని 10 లక్షల త్రివర్ణ పతాకాలను ఇంటింటికి పంపిణీ చేయడం ద్వారా దేశభక్తిని బలోపేతం చేయడం ద్వారా లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఎస్ఎస్‌బీ ముందంజలో ఉంది. వారికి శుభాకాంక్షలు 

 

కేంద్ర హోం, సహకార మంత్రిశ్రీ అమిత్ షా బిహార్‌లోని ఇండో-నేపాల్ సరిహద్దులోని ఫతేపూర్ బీఎపీని సందర్శించారు పిల్లర్ నం. 151 మరియు 152ని పరిశీలించి, సశాస్త్ర సీమా బల్ (SSB)తో సరిహద్దు ప్రాంతంలోని వివిధ కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. శ్రీ అమిత్ షా ఫతేపూర్ బీఓపీ వద్ద ఫతేపూర్పెక్టోలాబెరియాఅమ్గాచి మరియు రాణిగంజ్ యొక్క బీఓపి భవనాలను ప్రారంభించారు. అక్కడి సిబ్బందితో సంభాషించారు.  అనంతరం కేంద్రమంత్రి  బుద్ధి కాళీ మాత ఆలయాన్ని సందర్శించి ప్రార్థనలు చేశారు.

 

బిహార్‌లోని వివిధ ప్రాంతాలలో ఐదు సరిహద్దు అవుట్‌పోస్టుల నూతన భవనాలను ప్రారంభించిన సందర్భంగాకేంద్ర హోంమంత్రి మాట్లాడుతూక్లిష్ట పరిస్థితుల్లోనూ దేశ భద్రతా దళాల సైనికులు దేశ సరిహద్దుల భద్రతకు భరోసా ఇస్తున్నారని అన్నారు. దేశంలోని భద్రతా బలగాలకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేక సౌకర్యాలు కల్పించారనివాటిలో కొన్నింటిని నేడు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణవిపత్తుల సమయంలో సహాయసహాయక చర్యలునిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో దేశంలోని భద్రతా బలగాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని శ్రీ అమిత్ షా అన్నారు.

 

గత ఎనిమిదేళ్లలో సరిహద్దుల్లో మోహరించిన భద్రతా బలగాల సిబ్బందికి వారి కుటుంబాలకు నివాస సౌకర్యాలు కల్పించేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమయానుకూలంగా మరియు దశలవారీగా కృషి చేస్తోందని శ్రీ అమిత్ షా అన్నారు. ఈ జాతీయ కార్యక్రమం కింద నేడు రూ.25 కోట్లతో ఐదు భవనాలను ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోమన భద్రతా దళాల సిబ్బంది తమ జీవితంలోని బంగారు సంవత్సరాలను దేశ భద్రత కోసం సరిహద్దుల్లో క్లిష్ట పరిస్థితుల్లో గడిపారని ప్రభుత్వం విశ్వసిస్తోందనిఇది ప్రభుత్వ కర్తవ్యమని ఆయన అన్నారు. భారతదేశం వారి శ్రేయస్సు సౌకర్యాన్ని చూసుకోవాలి. ఇందులో భాగంగా జవాన్ల నివాసంఎన్‌సిఓ బ్యారక్‌లుఔట్‌పోస్ట్ ఇన్‌చార్జి నివాసంమెస్ఆర్మరీస్టోరేజీసుమారు 10 కిలోవాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌లను ఈరోజు ప్రారంభిస్తున్నట్లు శ్రీ అమిత్ షా తెలిపారు. దీంతో పాటు పెకటోలాలో రూ.7.50 కోట్లతో 5 ఎకరాల స్థలంలోబెరియాలో రూ.4.5 కోట్లతోఅరారియారాణిగంజ్‌లో సుమారు రూ.3.5 కోట్లతో భవనాలు నిర్మించారు.

 

సశస్త్ర సీమా బల్ కు ఒక చరిత్ర ఉందనిమాజీ ప్రధాని దివంగత శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి కాలం నుంచి భారత ప్రభుత్వం ఒకే దేశంఒకే సరిహద్దు భద్రతా దళం అనే విధానాన్ని అవలంబించిందన్నారు. అప్పటి నుంచి సరిహద్దుల ముఖ్యమైన బాధ్యతను, ఇండో-నేపాల్ మరియు ఇండో-భూటాన్ యొక్క బహిరంగ సరిహద్దుల భద్రతను సశస్త్ర సీమా బలానికి ఇవ్వబడిందని కేంద్ర హోంమంత్రి తెలిపారు. ఈ దళం తన బాధ్యతను చాలా చక్కగా నిర్వర్తించిందని తెలిపారు. బహిరంగ సరిహద్దులను మరింత చాకచక్యంగాజాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందనిఈ పనిని సమర్ధవంతంగా చేయడం ద్వారా చట్టవ్యతిరేక కార్యకలాపాలను నిరోధించడంలో ఎస్ఎస్‌బీ విజయవంతమైందని ఆయన అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గ్రామాలతో మన కమ్యూనికేషన్సమాచార నెట్‌వర్క్ మరియు సేవ ద్వారా గ్రామస్థులతో మన ప్రవర్తన సరిహద్దులను భద్రపరచడంలో ముఖ్యమైనదని ఆయన అన్నారు. అందుకే సేవాభద్రతసౌభ్రాతృత్వం అనే నినాదాన్ని సశస్త్ర సీమా బల్ ఎంతో జాగ్రత్తగా అందించారు.

 

బిహార్, జార్ఖండ్‌లలో వామపక్ష తీవ్రవాదం ఉధృతంగా ఉన్నప్పుడుదానిపై పోరాటంలో ఎస్ఎస్‌బీ జవాన్లు అపారమైన కృషి చేశారనిఇది దేశం ఎన్నటికీ మరచిపోలేనిదని శ్రీ అమిత్ షా అన్నారు. ఎస్‌ఎస్‌బి జవాన్లు నక్సలిజానికి వ్యతిరేకంగా కఠినమైన పోరాటం చేసి దేశంలోని తూర్పు ప్రాంతంలో అత్యున్నత త్యాగాలు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. దీని ఫలితంగానేడు బిహార్, జార్ఖండ్‌లలో నక్సలిజం దాదాపు ముగింపు అంచుకు చేరుకుందన్నారు. బహిర్గత సరిహద్దు ఉన్నప్పుడుసాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం చాలా అవసరం అని ఆయన అన్నారు. సీసీటీవీలైనాడ్రోన్లైనా సరేసరిహద్దుల భద్రతను వివిధ సాంకేతిక పరిజ్ఞానాన్ని అవలంబించాలని అన్నారు. సరిహద్దుల భద్రతకు సాంకేతికత గొప్ప మాధ్యమంగా మారుతుందనిఅన్ని రంగాలు పరస్పరం సత్ప్రవర్తనను అలవర్చుకుని సాంకేతికతను అందిపుచ్చుకోవాలని అన్నారు.

 

2019లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చెట్ల పెంపకం కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడుతమ లక్ష్యాన్ని సాధించిన భద్రతా దళాలలో ఎస్‌ఎస్‌బి మొదటి స్థానంలో ఉందని కేంద్ర హోం మంత్రి కితాబు ఇచ్చారు. ఇటీవలప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోదేశం అమృత మహోత్సవాలో భాగంగా హర్ ఘర్ తిరంగా ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. ప్రభుత్వం దేశభక్తి స్ఫూర్తిని మరింత రగిలించే లక్ష్యంతో ఉందనిముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని గ్రామాలలో అని ఆయన అన్నారు. దీని కింద ఎస్‌ఎస్‌బి సిబ్బంది 10 లక్షల త్రివర్ణ పతాకాలను ఇంటింటికీ పంపిణీ చేయడంతోపాటు వాటిని ఎగురవేసేలా మార్గనిర్దేశం చేశారని అన్నారు. ఎస్ఎస్‌బీ జవాన్లందరూ భక్తి, దేశభక్తితో రెండు దేశాలను కలుపుతూ ఇంత పెద్ద అంతర్జాతీయ సరిహద్దును కాపాడుతున్నారని అన్నారు. మన దేశానికి అత్యంత సున్నిత ప్రాంతమైన సిలిగురి కారిడార్‌కు సమీపంలోనే ఎస్‌ఎస్‌బీ పరిధిలోని ప్రాంతం ఉందన్నారు. మనకు ఒకవైపు పశ్చిమ బెంగాల్సిక్కిం మరియు అస్సాం మరియు మరోవైపు నేపాల్భూటాన్ మరియు బంగ్లాదేశ్ ఉన్నాయి. ఈ సరిహద్దు ప్రాంతం మొత్తం చాలా సున్నితమైనది ముఖ్యంగా సిలిగురి వంటి సున్నితమైన కారిడార్‌ ప్రాంతంలో  విధులను నిర్వహించేటప్పుడు మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని మంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

 

2014లో శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను కల్పించడంలో ఎలాంటి నిష్పక్షపాతం వహించలేదని శ్రీ అమిత్ షా అన్నారు. 2008 నుంచి 2014 మధ్య కాలంలో దాదాపు రూ.23,700 కోట్లు ఖర్చు చేయగా... ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రూ. 23,700 కోట్లను రూ.44,600 కోట్లకు పెంచారన్నారు. గతంలో ఏడాదికి రూ.4,000 కోట్లుగా ఉన్న ఖర్చు ఇప్పుడు రూ.6,000 కోట్లు అయినట్లు తెలిపారు. రోడ్ల నిర్మాణం దాదాపు మూడున్నర రెట్లు పెరిగింది. ఇది సరిహద్దులను రక్షించడానికి భారత ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది. భద్రతా బలగాల అలుపెరగని కృషిత్యాగం లేకుండా దేశ సరిహద్దుల భద్రతకు భరోసా ఉండదని కేంద్రమంత్రి ఈ సందర్భంగా తెలిపారు.

 

****


(Release ID: 1862085) Visitor Counter : 188