భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం
షీ ఈజ్ - ఉమెన్ ఇన్ స్టీమ్ పుస్తకాన్ని ఆవిష్కరించిన భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు, బ్రిటిష్ హైకమిషనర్
Posted On:
22 SEP 2022 10:14AM by PIB Hyderabad
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్, బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ 2022 సెప్టెంబర్ 21న ఎల్సా మేరీ డిసిల్వా, సుప్రీత్ కె సింగ్ రచించిన
‘‘ షీ ఈజ్-ఉమెన్ ఇన్ స్టీమ్‘‘ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.
భారతదేశ 75 ఏళ్ల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకొని స్టీమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, ఆర్ట్స్ ,మ్యాథమెటిక్స్ రంగాలు ) లో మహిళా నాయకత్వం, సుస్థిర అభివృద్ధిని జరుపుకునేలా 75 మంది మహిళల విజయపథ ప్రయాణ ఘట్టాలను
ఈ పుస్తకం వివరించింది,
ధైర్య౦, ఆశ , సంకల్పం వ౦టి వాటి గురి౦చిన వ్యక్తిగత కథలను వివరిస్తూ, ఈ పుస్తక౦, అంత సులభ౦ కాని , మహిళల వ్యక్తిగత, వృత్తిపరమైన పోరాటాల గురించి మాట్లాడుతుంది, అయితే ఈ విభాగాలలో ఏదో ఒకదానిలో పని చేయాలనుకునే ప్రతి అమ్మాయికి ఖచ్చితంగా స్ఫూర్తిదాయకం గా u
ఉంటుంది.
స్టీమ్ లో 75 మంది మహిళల షార్ట్ లిస్టింగ్ గురించి ఇక్కడ మరింత చదవండి.
భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం, ఫిక్కీ ఎఫ్.ఎల్.ఓ, బ్రిటిష్ హైకమిషన్ ఆఫ్ ఇండియా మద్దతుతో కూడిన ఈ పుస్తకం లిఖిత పూర్వక రూపంలోనే కాకుండా, క్యూఆర్ కోడ్ ద్వారా ప్రాప్తి చేయగల సాధకులందరి వీడియోలను కూడా కలిగి ఉంది.
"కార్పొరేట్ , అభివృద్ధి రంగంలో సంవత్సరాలుగా మన కృషిలో, పితృస్వామ్యం వివిధ విషయాలపై అన్ని-పురుష ప్యానెల్స్ లేదా 'మానెల్స్' రూపంలో ప్రదర్శించబడింది, మహిళలను ప్రత్యక్షంగా,పరోక్షంగా ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడం, మహిళల సహకారం ,స్వరాలను నిర్దాక్షిణ్యంగా విస్మరించడం చూశాము. లింగ సమాన ప్రపంచాన్ని సృష్టించడంలో మహిళలు, పురుషులు ఇతర లింగాలతో కలిసి పనిచేస్తున్నప్పుడు, మహిళా సాధకుల కథలను ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. ఈ పుస్తకం స్టీమ్ రంగాలలోని మహిళలను మరింత కనిపించేలా చేయడానికి ప్రయత్నిస్తుంది, వారి గణనీయమైన సహకారాన్ని జరుపుకుంటుంది, ఇంకా తరచుగా జెండర్ తో కూడిన సవాళ్లతో నిండిన వారి ప్రయాణాలను గుర్తించడానికి ప్రయత్నిస్తుంది.
భారతదేశ స్వాతంత్ర్యానికి మహిళల సహకారం, తదనంతర విజయం ,పురోగతి, తక్కువ అంచనా వేయబడ్డాయి. మేము దానిని సరిదిద్దాలనుకుంటున్నాము" అని రచయితలు, ఎల్సా మేరీ డిసిల్వా ,సుప్రీత్ కె సింగ్ చెప్పారు
"ఈ సంవత్సరం ఐఐటి ఢిల్లీ డైమండ్ జూబ్లీ వేడుకలో గౌరవ భారత రాష్ట్రపతి, భారతదేశాన్ని ఆత్మనిర్భర్ ggగా రూపొందించడంలో భారతదేశ యువతుల సహకారం అత్యంత కీలకమైనదిగా ఉండబోతోందని పేర్కొన్నారు. ఈ మార్గాల్లోనే ప్రభుత్వం, తన వివిధ విధానాల ద్వారా, ప్రధాన స్రవంతికి నూతన ప్రేరణను అందిస్తోంది, ఎస్ టి ఐ పర్యావరణ వ్యవస్థలో ఈక్విటీ , చేరికను సంస్థాగతం చేస్తోంది. వీటిలో 5వ సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీ ఒకటి. ఈ విధానాన్ని మన ఇన్స్టిట్యూట్లు ఎలా తగినంతగా అమలు చేయవచ్చో మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది, తద్వారా సైన్స్ లో యువతులు ,మహిళలు మరింత సమానమైన అవకాశాలను ,ప్రదర్శనకు స్వాగతించే ప్రదేశాలను పొందుతారు " అని ఆవిష్కరణ సందర్భంగా భారత ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు ప్రొఫెసర్ అజయ్ సూద్ అన్నారు. దేశ వ్యాప్తంగా ప నిచేస్తున్న వివిధ రంగాలకు చెందిన మహిళల కథలతో షీ ఈజ్ బుక్ ను విడుదల చేసినందుకు బ్రిటీష్ హై కమిషన్ ,రెడ్ డాట్ ఫౌండేషన్ ల ప్రయత్నాలను ఆయన అభినందించారు.
‘‘మహిళలు, యువతులతో సహా ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పించడం వల్ల ప్రతి దేశం మరింత బలంగా, తెలివైనదిగా మారుతుంది. అందుకే బ్రిటీష్ ప్రభుత్వం 300 మందికి పైగా యువ భారతీయ మహిళా శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు వారి సామర్థ్యాన్ని చేరుకోవడానికి మద్దతు ఇచ్చింది. అయితే, in
ఇంకా చాలా దూరం వెళ్ళవలసి ఉంది, ఈ పుస్తకంలోని ఉదాహరణలు తరువాతి తరం మహిళా నాయకులకు ప్రేరణ కలిగిస్తాయని నేను ఆశిస్తున్నాను, అందుకే మేము ఈ పనిలో భారత ప్రభుత్వం ,రెడ్ డాట్ ఫౌండేషన్ తో భాగస్వామ్యం నెరపుతున్నాము." అని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ అన్నారు.
మహిళలకు సమానత్వం అందరికీ పురోభివృద్ధి. ఈ రంగాలలో ప్రవేశించడానికి, ప్రయోజనం పొందడానికి, అభివృద్ధి చేయడానికి ,ప్రభావితం చేయడానికి మహిళల సామర్థ్యం అపారమైనది. మా సహకార ప్రయత్నానికి రెండు లక్ష్యాలు ఉన్నాయి, ఒకటి వేడుకలు జరుపుకోవడం,
రోల్ మోడల్స్ ను సృష్టించడం ,రెండవది దేశం సమ్మిళిత ,స్థిరమైన వృద్ధిని సాధించడానికి ఈ రంగం సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం " అని ఎఫ్ఎల్ఓ అధ్యక్షుడు జయంతి దాల్మియా అన్నారు.
ప్రచురణకర్త, బియాండ్ బ్లాక్, కళ, పుస్తకాలు, కవిత్వం, చలనచిత్రాలు మరియు సంఘటనలను ఉపయోగించి వైవిధ్యం ,సమ్మిళితతను ప్రోత్సహించడానికి పని చేస్తున్న ఒక సామాజిక సంస్థ.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పిఎస్ఎ, బ్రిటిష్ హైకమిషనర్, ప్రెసిడెంట్, ఫిక్కీ ఎఫ్లో, స్ట్రాటజిక్ అలయన్స్ డివిజన్, ఆఫీస్ ఆఫ్ పిఎస్ఎ రచయితలు పాల్గొన్నారు.
***
(Release ID: 1861548)
Visitor Counter : 210