రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

సైనిక నర్సింగ్ సర్వీస్ దళాలు & వారి కుటుంబాలకు ఆదర్శప్రాయమైన సేవను అందిస్తుంది

प्रविष्टि तिथि: 22 SEP 2022 3:21PM by PIB Hyderabad

మిలిటరీ నర్సింగ్ సర్వీస్ భారతదేశంలోని శాంతి  ఫీల్డ్ స్టేషన్లలో ఉన్న ఆసుపత్రులతో పాటు విదేశాలలో ఉన్న ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ మిషన్లలో సైనికులకు  వారి కుటుంబాలకు ఆదర్శప్రాయమైన సేవలను అందజేస్తోందని ఆర్మీ హాస్పిటల్ (ఆర్ఆర్కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ అశోక్ జిందాల్ ఈరోజు అన్నారు.  ఢిల్లీలో జరిగిన కమీషనింగ్ వేడుకలో కాలేజ్ ఆఫ్ నర్సింగ్, ఆర్మీ హాస్పిటల్ (ఆర్&ఆర్)  ఐదవ బ్యాచ్ నర్సింగ్ గ్రాడ్యుయేట్లు పాల్గొన్నారు. ఈ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ లెఫ్టినెంట్లను నర్సింగ్ విద్య  గౌరవం  నైతికతలను నిలబెట్టాలని  అభివృద్ధి చెందుతున్న వైద్య సాంకేతికతలకు అనుగుణంగా ఉండాలని ఉద్బోధించారు. మిలటరీ నర్సింగ్ సర్వీస్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ మేజర్ జనరల్ స్మితా దేవ్రాణి కొత్తగా నియమితులైన నర్సింగ్ అధికారులతో ప్రమాణం చేయించారు. ప్రతిభ కనబర్చిన నర్సింగ్‌ గ్రాడ్యుయేట్‌లను ముఖ్యఅతిథి సత్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ ప్రముఖులు, నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నర్సింగ్‌ అధికారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 1861533) आगंतुक पटल : 185
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Tamil