రక్షణ మంత్రిత్వ శాఖ
ప్రపంచ భాగస్వామిని పొందిన ‘పునీత్ సాగర్ అభియాన్’ : స్వచ్ఛమైన నీటి వనరుల లక్ష్యాన్ని సాధించేందుకు రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో ఎన్‌సీసీ&యూఎన్‌ఈపీ మధ్య అవగాహన ఒప్పందం.
Posted On:
22 SEP 2022 1:13PM by PIB Hyderabad
ప్లాస్టిక్ కాలుష్య సమస్యను పరిష్కరించడానికి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సిసి) మరియు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రామ్ (యూఎన్‌ఈపీ) మధ్య సెప్టెంబర్ 22, 2022న న్యూ ఢిల్లీలో రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ సమక్షంలో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. 'పునీత్ సాగర్ అభియాన్' మరియు 'టైడ్ టర్నర్స్ ప్లాస్టిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్' ద్వారా స్వచ్ఛమైన నీటి వనరుల లక్ష్యం. డిజి ఎన్‌సిసి లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్‌తో పాటు యుఎన్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రాం రెసిడెంట్ రిప్రజెంటేటివ్ మిస్టర్ బిషో పరాజులి ఎంఓయుపై సంతకం చేశారు. రక్షణశాఖ సహాయమంత్రి శ్రీ అజయ్ భట్, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్‌తో పాటు రక్షణ మంత్రిత్వ శాఖలోని ఇతర సీనియర్ అధికారులు మరియు యూఎన్‌ఈపీ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
‘పునీత్ సాగర్ అభియాన్’ను ఒక ఉదాత్తమైన కార్యక్రమాలలో ఒకటిగా రక్షణ కార్యదర్శి అభివర్ణించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఎన్‌సీసీ ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు. 1.5 మిలియన్ల ఎన్‌సిసి క్యాడెట్‌లు ప్రపంచవ్యాప్తంగా యువత ఆలోచనలను ప్రభావితం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నారని..ఈ కార్యక్రమాన్ని సామూహిక ఉద్యమంగా మార్చడంలో వారు కీలక పాత్ర పోషిస్తారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. "భవిష్యత్తు తరాలు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి పర్యావరణాన్ని రక్షించడం మన సమిష్టి బాధ్యత" అని పేర్కొన్నారు. ఎన్‌సీసీకి తన మద్దతును అందించినందుకు యూఎన్‌ఈపీకి డాక్టర్ అజయ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
భారత దేశ వాతావరణ మార్పు పరిష్కారానికి మూలస్తంభం
అక్టోబర్ 31 నుండి నవంబర్ 13, 2021 మధ్య స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగిన 26వ ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పు సదస్సు-కాప్26లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 'పంచామృతం'గా పేర్కొన్న కార్యక్రమాలలో 'పునీత్ సాగర్ అభియాన్' ఒకటి. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతదేశ సహకారంగా ప్రధాన మంత్రి ఐదు అమృత అంశాలను అందించారు. ఇవి
- 2030 నాటికి భారతదేశ నాన్-ఫాసిల్ ఎనర్జీ సామర్థ్యం 500 గిగావాట్లకు పెరుగుతుంది.
- 2030 నాటికి భారతదేశ ఇంధన అవసరాలలో 50 శాతం పునరుత్పాదక ఇంధనతో తీరుతుంది.
- 2030 వరకూ మొత్తం కార్బన్ ఉద్గారాలను భారతదేశం ఒక బిలియన్ టన్నుల మేర తగ్గిస్తుంది.
- 2030 నాటికి భారత్ తన ఆర్థిక వ్యవస్థలో కార్బన్ తీవ్రతను 45 శాతానికి పైగా తగ్గిస్తుంది.
- 2070 నాటికి భారత్ నికర జీరో లక్ష్యాన్ని సాధిస్తుంది.
స్పైలింగ్ డ్రైవ్
డిసెంబర్ 01, 2021న పరిశుభ్రత ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడంతో పాటు తీరప్రాంతాల్లో ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను తొలగించేందుకు ఎన్‌సీసీ ఒక నెలపాటు దేశవ్యాప్తంగా ‘పునీత్ సాగర్ అభియాన్’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అనంతరం నదులు మరియు ఇతర నీటి వనరులను కూడా కవర్ చేయడానికి దేశవ్యాప్తంగా ఏడాదిపాటు కార్యక్రమాన్ని విస్తరించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద యూనిఫాం యువజన సంస్థ అయిన ఎన్‌సీసీ..ప్లాస్టిక్ మరియు ఇతర వ్యర్థ పదార్థాలను సేకరించేందుకు సంస్థ క్యాడెట్లను సమీకరించింది. కార్యక్రమం ప్రారంభించిన తర్వాత ప్రజల ఆమోదం అలాగే భాగస్వామ్యాన్ని పొందింది. ఈ కార్యక్రమంలో ఎన్‌సీసీకి పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ, సైన్స్ & టెక్నాలజీ శాఖ, ఇండియన్ నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, సైనిక్ స్కూల్ సొసైటీ, ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సహా వివిధ మంత్రిత్వ శాఖలు మరియు సంస్థలు తమ సహాయాన్ని అందించాయి.
'పునీత్ సాగర్ అభియాన్' ప్రారంభించినప్పటి నుండి దాదాపు 1,900 ప్రాంతాల నుండి 100 టన్నులకు పైగా ప్లాస్టిక్ వ్యర్థాలను 12 లక్షలకు పైగా ఎన్‌సీసీ క్యాడెట్లు, పూర్వ విద్యార్థులు మరియు వాలంటీర్లు సేకరించారు. ఇది 1.5 కోట్ల మంది ప్రజలను ప్రభావితం చేసింది. దాదాపు 100 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించగా అందులో 60 టన్నులకు పైగా రీసైక్లింగ్ కోసం అప్పగించారు.
'పునీత్ సాగర్ అభియాన్' - ఒక టైడ్ టర్నర్
కార్యక్రమానికి లభించిన విజయాన్ని చూసి యూఎన్‌ఈపీ 'టైడ్ టర్నర్ ఛాలెంజ్ ప్రోగ్రామ్' ద్వారా ఇందులో పాల్గొంది. యువజన సంస్థ బలాన్ని పెంచే లక్ష్యంతో ఎన్‌సీసీతో చేతులు కలపాలని నిర్ణయించుకుంది.యూఎన్ బాడీ ప్లాస్టిక్ కాలుష్యంతో పాటు పర్యావరణానికి సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించడానికి సాంకేతికతను, యువతను నిమగ్నం చేసే కార్యక్రమాన్ని కలిగి ఉంది.
స్వచ్ఛమైన నీటి వనరులను ప్రోత్సహించడానికి యువతను నిమగ్నం చేసే దిశగా ప్రయత్నాలను సమన్వయం చేయడం ఎన్‌సీసీ, యూఎన్‌ఈపీ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం లక్ష్యం. సమాచార భాగస్వామ్యం మరియు శిక్షణ కార్యక్రమాల ద్వారా పర్యావరణ సుస్థిరతపై సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు అవగాహన కల్పించడం లక్ష్యం; పర్యావరణం మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన తగిన జాతీయ & అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లలో పాల్గొనడానికి ఎన్‌సీసీ క్యాడెట్‌లకు అవకాశాలను ప్రోత్సహించడం మరియు పర్యావరణం మరియు వాతావరణ మార్పులకు సంబంధించిన పరస్పర ఉద్దేశం యొక్క ఉమ్మడి కార్యక్రమాలలో పాల్గొనడం మరియు అభివృద్ధి చేయడం కూడా వీటిలో ఒకటి. పర్యావరణ రంగంలో ఉమ్మడి లక్ష్యాలను సాధించడానికి వారి సహకారం మరియు ప్రభావాన్ని ఏకీకృతం చేయడం, అభివృద్ధి చేయడం మరియు వివరించడం అనే ఎమ్ఒయు మూడు సంవత్సరాల పాటు అమలులో ఉంటుంది.
***
(Release ID: 1861529)
Visitor Counter : 266