రైల్వే మంత్రిత్వ శాఖ
ఆర్ఆర్‌బీ పరీక్షల కోసం తగిన రక్షణలు (లెవల్ 1)
ఎవరైనా సందేహాస్పద మార్గాల ద్వారా రైల్వేలో అభ్యర్థి ఎంపిక అవ్వడం అసాధ్యం
అభ్యర్థులు ఎలాంటి అసాంఘిక అంశాలు చేసే తప్పుడు వాదనలకు గురికావద్దని సూచన
प्रविष्टि तिथि:
21 SEP 2022 4:21PM by PIB Hyderabad
లెవెల్-1 పోస్టుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుల (RRB) నాలుగో దశ పరీక్షలు 19.9.22న ప్రారంభమయ్యాయి. 12 జోనల్ రైల్వేలతో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష మూడు దశలు ఇప్పటికే పూర్తయ్యాయి. లెవెల్-1లోని 1,03,769 ఖాళీల కోసం, ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో 1,11,57,986 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఐదు దశల్లో నిర్వహించనున్నారు. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్‌లు CEN RRC 01/2019- లెవెల్ I (పూర్వపు గ్రూప్ D) రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించడానికి అత్యంత ప్రసిద్ధ సంస్థని ఎంపిక చేసింది. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఆర్ఆర్‌బీలు పకడ్బందీగా ఏర్పాట్లను చేశారు. ఏ విధమైన అవకతవకలను జరగకుండా వ్యవస్థలో పలు రక్షణ చర్యలను ఏర్పాటు చేశారు.
⦁ అభ్యర్థులకు పరీక్ష కేంద్రం కేటాయింపు కంప్యూటర్ లాజిక్ ద్వారా ర్యాండమైజ్ చేయబడింది.
⦁ అభ్యర్థులు పరీక్షా కేంద్రంలో రిపోర్టు చేసి తమను తాము నమోదు చేసుకున్న తర్వాత, ల్యాబ్ మరియు సీట్ల కేటాయింపు కూడా ర్యాండమైజ్ చేయబడుతుంది.
⦁ ప్రశ్నపత్రం అత్యంత ఎన్‌క్రిప్టెడ్ రూపంలో ఉంది (256-బిట్ ఎన్‌క్రిప్షన్), మరియు అభ్యర్థి తప్ప మరెవ్వరూ ప్రశ్న పత్రాన్ని యాక్సెస్ చేయలేరు. అది కూడా పరీక్ష ప్రారంభమైన తర్వాత అభ్యర్థి కంప్యూటర్‌లోకి రెండవ & చివరి లాగిన్ అయిన తర్వాత మాత్రమే చూడగలరు. ఈ దశలో ప్రశ్నపత్రం డిక్రిప్షన్ జరుగుతుంది.
⦁ అభ్యర్థులకు అందుబాటులో ఉంచబడిన ప్రశ్నపత్రంలోని ప్రశ్నల క్రమం కూడా ప్రశ్నకు అందుబాటులో ఉన్న నాలుగు ఎంపికల ర్యాండమైజేషన్/షఫుల్‌తో పాటు ర్యాండమైజ్ చేయబడింది/షఫుల్ చేయబడింది.
⦁ పరీక్షా కేంద్రంలోని ప్రతి అభ్యర్థికి ప్రత్యేకమైన ప్రశ్నాపత్రం ఉంటుంది. ఇద్దరు అభ్యర్థులు ఒకే ప్రశ్న పత్రాలను వరుస ప్రశ్నలు & ఎంపికలు కలిగి ఉండరు.
⦁ మాస్టర్ ప్రశ్నపత్రంలోని ప్రశ్నల శ్రేణికి సీక్వెన్స్ పూర్తిగా భిన్నంగా ఉంటుంది.
⦁ అభ్యర్థికి కేటాయించబడే సీటు, అలాగే నిర్దిష్ట అభ్యర్థికి ప్రత్యేకంగా ఉండే ప్రశ్నలు మరియు ఎంపికల శ్రేణిని తెలుసుకోవడానికి ఏ వ్యక్తికి ప్రాప్యత లేనందున, ఇచ్చిన అభ్యర్థి కోసం సమాధాన కీని సిద్ధం చేయలేరు. ఇది ఎలాంటి మానవ జోక్యం లేకుండా కంప్యూటర్ లాజిక్ ద్వారా రూపొందించబడిన వ్యవస్థ.
⦁ పరీక్షలు ప్రతి అభ్యర్థి యొక్క పూర్తి రికార్డింగ్‌తో సీసీటీవీ కెమెరాల నిఘాలో నిర్వహించబడతాయి.
⦁ పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు అభ్యర్థుల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు అలాగే పరీక్ష నిర్వహణ ఏజెన్సీ సిబ్బందిని ప్రతి కేంద్రంలో రైల్వే వారి స్వంత సిబ్బందిని మోహరిస్తుంది.
⦁ ఏవైనా అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచేందుకు రైల్వేలు సర్వర్ రూమ్‌లో ఒక ఆర్‌పీఎఫ్ సిబ్బందితో సహా ఇద్దరు వ్యక్తులను మోహరించింది.
⦁ అభ్యర్థుల ఆధార్ ప్రమాణీకరణ మొదటిసారి లెవెల్-1 పరీక్షలో ప్రవేశపెట్టబడింది. ఈ ఆధార్ అథెంటికేషన్ తో పాటు ప్రతి సెంటర్ లో నియామక ప్రక్రియ యొక్క ప్రతి దశలో బయోమెట్రిక్‌లను తీసుకుని తనిఖీ చేయడం వంటి చర్యలను ఆర్ఆర్‌బీ నిర్వహిస్తోంది. విజయవంతంగా ఆధార్ ధృవీకరించబడిన అభ్యర్థుల రేటు 99.00 % కంటే ఎక్కువ.
⦁ రైల్వే సిబ్బందితో పాటు ఈసీఏ పరీక్షల ముందు/సమయంలో/తర్వాత కఠినంగా అప్రమత్తంగా ఉంటారు. ఫలితంగా, కొన్ని రకాల దుర్వినియోగం/అన్యాయమైన మార్గాలలో పాల్గొన్న అనేక మంది అభ్యర్థులు క్రమం తప్పకుండా పట్టుబడుతున్నారు.
మెరుగైన ఇన్విజిలేషన్, అదనపు పర్యవేక్షణ కారణంగా, 19.09.2022 నాటికి, మొత్తం 108 దుర్వినియోగం/అన్యాయమైన కేసులు నమోదయ్యాయి. పోలీస్ స్టేషన్‌లలో 81 కేసులపై ఎఫ్‌ఐఆర్/జీడీ దాఖలు చేశారు. మూడు ఎఫ్ఐఆర్ దాఖలు చేసే ప్రక్రియపై కేసులు నడుస్తున్నాయి.
చిట్స్ కేసులను అభ్యర్థుల ప్రశ్నపత్రాలు మరియు వారి సమాధానాలతో అందులో పేర్కొన్న ఎంపికలను సరిపోల్చడం ద్వారా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తారు. మొత్తం 19 చిట్స్ కేసులు నమోదయ్యాయి. వివరణాత్మక విశ్లేషణ తర్వాత 18 కేసులకు అభ్యర్థుల సమాధానాల కీలు సరిపోలడం లేదని కనుగొనబడింది. ఒక కేసు విశ్లేషణ దశలో ఉంది.
ఈసీఏ ఇన్విజిలేటర్లు కూడా అభ్యర్థులతో ఏ విధమైన అనుబంధాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధించడానికి నివారణ చర్యగా క్రమం తప్పకుండా ర్యాండమైజ్ చేయబడుతున్నారు.
పైన పేర్కొన్న అన్ని దశలు ఎవరైనా సందేహాస్పద మార్గాల ద్వారా రైల్వేలో ఎంపికైన అభ్యర్థిని పొందడం అసాధ్యం అని నిర్ధారిస్తుంది. అభ్యర్థులు అక్రమాలకు పాల్పడే వ్యక్తులపై పోలీసు ఫిర్యాదులను దాఖలు చేయడంతో పాటు, అటువంటి అభ్యర్థులు భవిష్యత్తులో ఆర్ఆర్‌బీ పరీక్షలకు హాజరుకాకుండా జీవితాంతం నిషేధించబడతారు.
అభ్యర్థులు ఎలాంటి అసాంఘిక అంశాలు చేసిన తప్పుడు వార్తలు విని తమ ఉద్యోగ అవకాశాలను కోల్పొవద్దని సూచించారు. అభ్యర్థులను తప్పుదారి పట్టించే టౌట్‌లు/మధ్యస్థ వ్యక్తులకు సంబంధించిన ఏదైనా కేసు/సమాచారం అందించాల్సిన ఫోన్ నంబర్: 0755-2746660 లేదా ఇమెయిల్ చిరునామా: msrrbbpl[at]gmail[dot]com లో నివేదించవచ్చు.
***
(रिलीज़ आईडी: 1861411)
आगंतुक पटल : 143