ప్రధాన మంత్రి కార్యాలయం

అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని సెప్టెంబర్ 23 న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి


ఎల్ఐఎఫ్ఇ,జలవాయు పరివర్తన, ప్లాస్టిక్ వ్యర్థాల సమస్య కు ఎదురొడ్డడం, వన్యజీవుల మరియు అడవులనిర్వహణ లకు సంబంధించిన అంశాల పై కేంద్రాని కి మరియు రాష్ట్రాల కు మధ్య మరింతసమన్వయాన్ని ఏర్పరచనున్న సమావేశమిది

Posted On: 21 SEP 2022 4:29PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పర్యావరణ మంత్రుల జాతీయ సమావేశాన్ని గుజరాత్ లోని ఏక్ తా నగర్ లో సెప్టెంబర్ 23వ తేదీ న ఉదయం పదిన్నర గంటల కు వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ సందర్భం లో సభికులను ఉద్దేశించి ఆయన ప్రసంగించనున్నారు కూడా.

సహకారాత్మక సమాఖ్యవాదం యొక్క భావన ను ముందుకు తీసుకుపోయే క్రమం లో బహుముఖ విధానం ద్వారా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తొలగించడం, జలవాయు పరివర్తన కు వ్యతిరేకం గా సమర్థవంతంగా పోరాడడానికి లైఫ్ స్టయిల్ ఫార్ ఇన్ వైరన్ మెంట్ (LiFE - ‘లైఫ్’) పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూ రాష్ట్ర కార్యాచరణ ప్రణాళికల ను రూపొందించడం వంటి అంశాల ను పరిశీలించి ఉత్తమమైన విధానాల ను రూపొందించడం లో ఈ సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య మరింత సమన్వయాన్ని ఏర్పరచడం కోసం నిర్వహించడం జరుగుతున్నది.

సారం కోల్పోయిన భూముల ను తిరిగి వినియోగం లోకి తీసుకురావడం మరియు వన్యజీవుల సంరక్షణ అనే అంశాల పై ప్రత్యేక శ్రద్ధ ను తీసుకొంటూ అటవీప్రాంతాల రక్షక కవచాన్ని పెంచడం పైన కూడా ఈ సమావేశం దృష్టి ని సారించనుంది.

సెప్టెంబర్ 23వ మరియు 24వ తేదీ లలో ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశం లో ఆరు ఇతివృత్తాలు ప్రధానం గా సాగే సదస్సులు ఉంటాయి. వాటి లో ప్రధానం గా ఎల్ఐఎఫ్ఇ; జలవాయు పరివర్తన తో పోరాటం (అప్ డేటింగ్ స్టేట్ ఏక్శన్ ప్లాన్స్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఫార్ మిటిగేశన్ ఆఫ్ ఎమిశన్స్ ఎండ్ ఆడాప్టేశన్ టు క్లైమేట్ ఇంపాక్ట్ స్); పరివేశ్ (సింగిల్ విండో సిస్టమ్ ఫార్ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ క్లియరెన్సెస్); ఫారెస్టరి మేనిజ్ మెంట్; కాలుష్యం నివారణ మరియు నియంత్రణ; వన్యజీవుల నిర్వహణ; ప్లాస్టిక్స్ మరియు వ్యర్థపదార్థాల నిర్వహణ లపై దృష్టి ని సారించడం జరుగుతుంది.

 

***



(Release ID: 1861247) Visitor Counter : 173