ఆర్థిక మంత్రిత్వ శాఖ

బంగారం అక్రమ రవాణా ప్రయత్నాలు భగ్నం చేసిన డీఆర్ఐ


ముంబై, పాట్నా మరియు ఢిల్లీలో ఇటీవల కాలంలో అక్రమంగా రవాణా అవుతున్న 65.46 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్న డీఆర్ఐ

Posted On: 21 SEP 2022 2:07PM by PIB Hyderabad

బంగారం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) పొరుగున ఉన్న ఈశాన్య దేశాల దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్న దాదాపు 33.40 కోట్ల రూపాయల విలువ చేసే 65.46 కేజీల బంగారం కడ్డీలు స్వాధీనం చేసుకుంది. దేశానికి చెందిన ఒక రవాణా సంస్థ(ఇకపై లాజిస్టిక్స్ సంస్థగా పిలవబడుతుంది ) ద్వారా విదేశాలకు చెందిన బంగారాన్ని మిజోరాం నుంచి సరుకుల రూపంలో కొరియర్ ద్వారా తరలించేందుకు స్మగ్గ్లింగ్ సిండికేటే ప్రయత్నిస్తోందని  డీఆర్ఐ కి విశ్వసనీయ సమాచారం అందింది. 

సమాచారం ఆధారంగా బంగారం అక్రమ రవాణా నిరోధించేందుకు డీఆర్ఐ “ Op గోల్డ్ రష్ ” పేరుతో ఒక రహస్య కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా  ముంబైకి ' వ్యక్తిగత వస్తువులు 'గా ప్రకటించి రవాణా అవుతున్న సరుకులను అడ్డుకున్నారు. 19.09.2022న భివాండి (మహారాష్ట్ర)లో సరుకును పరిశీలించిన అధికారులు దాదాపు  10.18 కోట్ల రూపాయల విలువ చేసే  సుమారు 19.93 కిలోల బరువున్న 120 విదేశీ మూలం బంగారు బిస్కెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. 

అధికారుల దర్యాప్తు లో ఇదే సరుకు రవాణా సంస్థ ద్వారా మరో రెండు సరుకులను సదరు వ్యక్తి ముంబైకి  సరుకుల రూపంలో బంగారం అక్రమ రవాణా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు. దీనిని గుర్తించిన అధికారులు సరుకును బీహార్ లో స్వాధీనం చేసుకున్నారు. సరకు రవాణా సంస్థ గిడ్డంగిని డీఆర్ఐ అధికారులు తనిఖీ చేశారు. గిడ్డంగిలో 14.60 కోట్ల రూపాయల విలువ చేసే 28.57 కేజీల  120 విదేశీ మూలం బంగారు కడ్డీలను   స్వాధీనం చేసుకున్నారు. రవాణా సంస్థకు చెందిన ఢిల్లీ కేంద్రంలో మూడవ అక్రమ సరుకు రవాణా ను అడ్డగించి తనిఖీ చేసిన అధికారులు 8.69 కోట్ల రూపాయల విలువ చేసే 102 విదేశీ మూలం బంగారు కడ్డీలను   స్వాధీనం చేసుకున్నారు.

డీఆర్ఐ అధికారులు వరుసగా సాగించిన దాడుల్లో   దేశ ఈశాన్య భాగం నుంచి రవాణా సంస్థ నిర్వహిస్తున్న  దేశీయ కొరియర్ మార్గం ద్వారా భారతదేశంలోకి విదేశీ మూలం బంగారాన్ని అక్రమంగా రవాణా చేసేందుకు సాగుతున్న అక్రమ కార్యకలాపాలు  వెలుగులోకి వచ్చాయి. ఇటువంటి కార్యకలాపాల ద్వారా వినూత్న   అధునాతన పద్ధతులు అనుసరించి బంగారాన్ని అక్రమంగా రావన్న చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు గుర్తించి అక్రమ రవాణా అరికట్టేందుకు డీఆర్ఐ చేస్తున్న ప్రయత్నాలు మరింత వేగంగా జరుగుతాయి.వివిధ నగరాల్లో డీఆర్ఐ చేపట్టిన సోదాలు, తనిఖీల్లో దాదాపు 33.40 కోట్ల రూపాయలు విలువ చేసే సుమారు 65.46 కిలోల బరువు హల   మొత్తం 394 విదేశీ మూలం బంగారు కడ్డీలు బయటపడ్డాయి. వీటిని  స్వాధీనం చేసుకున్న అధికారులు కేసును విచారిస్తున్నారు. 

***



(Release ID: 1861154) Visitor Counter : 157