ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పిఎమ్ కేర్స్ ఫండ్ యొక్కధర్మకర్తల మండలి  సమావేశాని కి అధ్యక్షతవహించిన ప్రధాన మంత్రి


పిఎమ్కేర్స్ కు హృద‌యపూర్వకం గా సహాయపడుతున్నందుకు గాను భారతదేశ ప్రజల ను ప్రశంసించినప్రధాన మంత్రి 

అత్యవసరస్థితిలోను, ఆపద మరియు విపత్తుల లోను ఉపశమనకారి సహాయాన్ని అందించడం ఒక్కటే కాకుండాదీర్ఘ కాలిక దృక్పథం తో పనిచేయడం తో పాటు గా, కష్టనష్టాల ను తగ్గించే చర్యల కుతోడు సామర్థ్య నిర్మాణం కోసం కూడా కృషి చేయనున్న పిఎమ్ కేర్స్

పిఎమ్కేర్స్ ఫండ్ లో ధర్మకర్తలు గా చేరిన సర్వోన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి గౌరవనీయజస్టిస్ శ్రీ కె.టి. థామస్, పూర్వ డిప్యూటీ స్పీకర్ శ్రీ కరియా ముండా మరియు శ్రీరతన్ టాటా లు

Posted On: 21 SEP 2022 11:44AM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 2022 సెప్టెంబర్ 22వ తేదీ న జరిగిన పిఎమ్ కేర్స్ ఫండ్ ధర్మకర్తల మండలి సమావేశాని కి అధ్యక్షత వహించారు.

పిఎమ్ కేర్స్ ఫండ్ సాయం తో చేపట్టిన వివిధ కార్యక్రమాల పైన, మరియు 4345 మంది బాలల కు సమర్థన ను అందిస్తున్నటువంటి పిఎమ్ కేర్స్ ఫార్ చిల్డ్రన్ స్కీము పైన ఒక ప్రజంటేశను ను ఇవ్వడం జరిగింది. దేశానికి కీలకమైన తరుణం లో ఫండ్ నిర్వహించిన పాత్ర ను ధర్మకర్త లు ప్రశంసించారు. పిఎమ్ కేర్స్ ఫండు కు హృద‌య‌పూర్వకం గా చందాల ను ఇస్తున్నందుకు దేశ ప్రజల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

అత్యవసర స్థితి లో మరియు ఆపద లు, విపత్కర పరిస్థితుల లోను ప్రభావశీలమైన రీతి న స్పందించడం పట్ల పిఎమ్ కేర్స్ కు ఒక విశాలమైన దృక్పథం ఉందని, ఉపశమనకారి సహాయాన్ని అందించడం ఒక్కటే కాకుండా కష్టనష్టాల ను తగ్గించే దిశ లోను, సామర్థ్యం నిర్మాణానికి కూడాను చర్యలు తీసుకొంటుండడం గురించి చర్చ జరిగింది.

పిఎమ్ కేర్స్ ఫండ్ లో ఒక అంతర్భాగం గా మారినందుకు గాను ధర్మకర్తల ను ప్రధాన మంత్రి కొనియాడారు.

పిఎమ్ కేర్స్ ఫండ్ లో ధర్మకర్తలు అంటే కేంద్ర హోం శాఖ మంత్రి మరియు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి , అలాగే ఫండు కు కొత్త గా నామనిర్దేశం జరిగిన ట్రస్టీ లు సమావేశానికి హాజరు అయ్యారు. కొత్త గా ఫండు కు నామనిర్దేశం జరిగిన ట్రస్టీల లో-

· సర్వోన్నత న్యాయస్థానం పూర్వ న్యాయమూర్తి జస్టిస్ శ్రీ కె.టి. థామస్,

· పూర్వ డిప్యూటీ స్పీకరు శ్రీ కరియా ముండా,

· టాటా సన్స్ చైర్మన్ ఇమెరిటస్ శ్రీ రతన్ టాటా లు ఉన్నారు.

పిఎమ్ కేర్స్ ఫండు కు సలహా మండలి ని నిర్మించడం కోసం ఈ కింద పేర్కొన్న ప్రముఖ వ్యక్తుల ను నామినేట్ చేయాలని కూడా ట్రస్టు నిర్ణయించింది:

· పూర్వ కంప్ట్రోలర్ ఎండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీ రాజీవ్ మెహర్షి,

· ఇన్ఫోసిస్ ఫౌండేశన్ పూర్వ చైర్ పర్సన్ శ్రీమతి సుధ మూర్తి,

· టీచ్ ఫార్ ఇండియా సహ వ్యవస్థాపకుడు మరియు ఇండికార్ప్ స్, పీరామల్ ఫౌండేశన్ ల పూర్వ సిఇఒ శ్రీ ఆనంద్ శాహ్.

నూతన ధర్మకర్త లు మరియు సలహాదారుల ప్రాతినిధ్యం పిఎమ్ కేర్స్ ఫండు యొక్క పనితీరు కు విశాలమైన దృష్టికోణాల ను అందించగలదని ప్రధాన మంత్రి అన్నారు. సార్వజనిక జీవనం లో వారి కి ఉన్న విస్తారమైన అనుభవం ఈ ఫండు ప్రజల యొక్క వివిధ అవసరాల పట్ల ప్రతిస్పందించడం లో మరింత ఉత్సాహాన్ని జోడించగలదు.

 

***


(Release ID: 1861115) Visitor Counter : 176