ఆర్థిక మంత్రిత్వ శాఖ

హిమాచల్‌ప్రదేశ్‌లో 1,032 హెక్టార్లలో అక్రమ గంజాయి (గంజాయి) సాగును నాశనం చేసిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్

Posted On: 20 SEP 2022 3:25PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్‌లో 2 వారాల పాటు నిర్వహించిన అతిపెద్ద ధ్వంస చర్యల్లో భాగంగా, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (సీబీఎన్) అధికారులు 1032 హెక్టార్ల అక్రమ గంజాయి సాగును ధ్వంసం చేశారు.

 

image.png

హిమాచల్ ప్రదేశ్‌లో అక్రమ గంజాయి సాగు గురించి నిర్దిష్ట సమాచారం అందడంతో, సీబీఎన్ అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో దాడులు చేసింది. సీబీఎన్ అధికారులు తమకు అందిన సమాచారంతో, సర్వేలను కొనసాగించారు. ఫలితంగా అక్రమ సాగు ప్రాంతాలను మరిన్ని గుర్తించారు. అనంతరం జిల్లా యంత్రాంగం, అటవీశాఖ, పోలీసుల సహకారంతో గంజాయిని ధ్వంసం చేశారు.

image.png

ఈ ఆపరేషన్‌ని, సీబీఎన్ అధికారులు కేవలం గంజాయి మొక్కల ధ్వంసమే కాకుండా ఆయా గ్రామాల గ్రామస్థులకు అవగాహన కల్పించే ద్విముఖ విధానాన్ని అవలంబించారు.

image.png

మాదకద్రవ్యాల భారీన పడటం వలన కలిగే దుష్ప్రభావాలను, శరీరం, మనస్సుపై అవి కలుగజేసే హాని గురించి గ్రామస్తులకు అధికారులు అవగాహన కల్పించారు. డ్రగ్స్ వల్ల యువత, పిల్లల భవిష్యత్తుకు ముప్పు వాటిల్లుతుందని వివరించారు. ఎన్‌డీపీఎస్ చట్టంలోని సంబంధిత శిక్షా నిబంధనలను కూడా గ్రామ పెద్దలకు, సభ్యులకు వివరించడం జరిగింది. దీని ఫలితంగా గ్రామాల చుట్టూ ఉన్న అక్రమ గంజాయి తోటలను నాశనం చేయాలని గ్రామస్థులు తీర్మానాలు చేశారు. సీబీఎన్ అధికారుల గంజాయి మొక్కల పరిశీలనలో గ్రామస్తులు చురుకుగా పాల్గొనడం ద్వారా అక్రమ సాగును నాశనం చేయడానికి అధికారులకు గ్రామస్తులు సహకరించారు.

సీబీఎన్ అధికారులు ఏకకాలంలో 4 బృందాలు వివిధ ప్రాంతాలలో దాడులు నిర్వహించాయి. దీని ద్వారా గంజాయిని పెద్ద ఎత్తున అక్రమంగా సాగు చేస్తున్న కొన్ని ప్రాంతాలలో సంయుక్తంగా పని చేసే వెసులుబాటు దొరికింది. అటవీ శాఖ, రెవెన్యూ & పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో, ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. ఇది యాపిల్ & దానిమ్మ పండ్లను పండించే కాలం కాబట్టి, కూలీల లభ్యత సమస్యగా మారింది. అయితే ఏటవాలు ప్రాంతాలు మరియు వర్షాభావ పరిస్థితుల్లో శత్రు భూభాగంలో విధ్వంసక ఆపరేషన్‌ను నిర్వహించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో గంజాయి పెంపకాన్ని అరికట్టడం గమనార్హం అని అధికారులు తెలిపారు. గంజాయి అక్రమ సాగును నాశనం చేయడానికి అధికారులు ప్రతిరోజూ సముద్ర మట్టానికి 11,000 అడుగుల ఎత్తు ప్రాంతాలకు వెళ్లి, సున్నిత ప్రాంతాలలో కూడా గంజాయి పంటలను ధ్వంసం చేశారు. అనంతరం, డీఆర్ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు కూడా ఈ ఆపరేషన్‌లో చేరారు.

 

image.png

సున్నితమైన ప్రాంతాలను ట్యాగ్ చేయడానికి / గుర్తించడానికి జీపీఎస్ వ్యవస్థను అధికారులు ఉపయోగించారు. అక్రమ గంజాయి సాగు ప్రాంతాలను గుర్తించడం, నిఘా కోసం డ్రోన్‌లు ఉపయోగించారు. దీని ఫలితంగా మొత్తం ఆపరేషన్‌ విజయం సాధించింది.

"ఈ విధ్వంసం చేసే ఆపరేషన్ ఇదే విధంగా దేశంలోని అన్ని ప్రాంతాలలో కొనసాగుతుంది సీబీఎన్ డ్రగ్స్ నిర్మూలనకు పూర్తిగా కట్టుబడి ఉంది" అని సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ నార్కోటిక్స్ కమిషనర్ శ్రీ రాజేష్ ఎఫ్ ధబ్రే అన్నారు.

జిల్లా కార్యాలయం నుంచి కలెక్టర్, సీసీఎఫ్, ఎస్పీ, డీఆర్ఐ అధికారులు లాజిస్టిక్స్, మానవ శక్తి వనరులను ఈ ఆపరేషన్ అంతటా అందించారు.

సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్, గంజాయి నల్లమందు యొక్క అక్రమ సాగును గుర్తించడం, నాశనం చేయడంతోపాటు దాని ఇతర బాధ్యతలను నిర్వహించే భారత ప్రభుత్వం యొక్క రెవెన్యూ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని అత్యున్నత డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీ.

పశ్చిమ బెంగాల్, జమ్మూ & కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, ఉత్తరాఖండ్ మొదలైన అనేక రాష్ట్రాల్లో సీబీఎన్ విధ్వంస ఆపరేషన్ నిర్వహించింది. దీని ఫలితంగా 25,000 హెక్టార్లకు పైగా నల్లమందు, గంజాయి యొక్క అక్రమ సాగును నాశనం చేసింది. సీబీఎన్ ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో అరుణాచల్ ప్రదేశ్‌లో దాదాపు 3,600 హెక్టార్లలో అక్రమ నల్లమందును నాశనం చేసింది. భవిష్యత్తులో కూడా భారతదేశం అంతటా అక్రమ సాగు యొక్క ఇటువంటి విధ్వంసక కార్యకలాపాలను కొనసాగించాలని భావిస్తోంది.

 

****

 



(Release ID: 1860903) Visitor Counter : 158