మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ దృక్పథాన్ని సృష్టించి, మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దే దేవాలయాలు ఐఐటీలు- శ్రీ ధర్మేంద్ర ప్రధాన్


ఐఐటి మద్రాస్ స్ట్రాటజిక్ ప్లాన్ 2021-27తో పాటు అకడమిక్ ఎక్సలెన్స్ మరియు దేశ నిర్మాణానికి సంబంధించిన కార్యక్రమాలను ప్రారంభించిన
శ్రీ ధర్మేంద్ర ప్రధాన్

Posted On: 19 SEP 2022 4:39PM by PIB Hyderabad

కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ ఈరోజు ఐఐటీ మద్రాస్ వ్యూహాత్మక ప్రణాళిక 2021-27ను విడుదల చేశారు. ఇది ఇన్స్టిట్యూట్‌తో పాటు క్వాంటమ్ సైన్సెస్ అండ్ కోటక్-ఐఐటీ (ఎం) సేవ్ ఎనర్జీ మిషన్‌కు కోసం అంకితమైన ఎంఫాసిస్ సెంటర్ కోసం ప్రతిష్టాత్మక వృద్ధి దశను ప్రతిపాదించింది.ఎంఎస్‌ఎంఈలు ఎనర్జీ వినియోగాన్ని తగ్గించడంలో సహాయపడటానికి కోటక్ నుండి సీఎస్‌ఆర్‌ నిధులతో ఏర్పాటు చేయబడిన ‘కోటక్ ఐఐటీఎం సేవ్ ఎనర్జీ’ మిషన్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.  సెంటర్ ఫర్ క్వాంటం ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్ మరియు కంప్యూటింగ్ (సిక్యూయూఐసీసీ) వృద్ధికి మద్దతు ఇచ్చినందుకు ఎంఫాసిస్ బృందాన్ని సత్కరించారు. అలాగే డేటా సైన్స్‌లో బిఎస్సీ ప్రోగ్రామ్‌లో ఎంపికైన విద్యార్థులకు డిప్లొమా సర్టిఫికేట్‌లను కూడా మంత్రి ప్రదానం చేశారు.

 


ఐఐటీ మద్రాస్ అభివృద్ధి చేసిన స్వదేశీ జీడీఐ ఇంజిన్‌ను కూడా మంత్రి ప్రారంభించారు. టీవీఎస్‌ మోటార్ కంపెనీ మద్దతుతో ఐఐటీ (ఎం) రూపొందించిన తక్కువ ధర కూరగాయల బండిని ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వీ కామకోటి, ప్రొఫెసర్ మహేశ్ పంచాగ్నుల, ప్రొఫెసర్ ఏ రమేష్, ప్రొఫెసర్ అభిజిత్ దేశ్ పాండే, మద్రాస్ ఐఐటీ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

5జీ టెస్ట్ బెడ్‌ ప్రదర్శనతో పాటు అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్ డెవలప్‌మెంట్ సెంటర్,ఐఐటీ మద్రాస్ ఆధారిత స్టార్టప్ అగ్నికుల్ కాస్మోస్  రాకెట్ ఫ్యాక్టరీ, హెల్త్‌కేర్ టెక్నాలజీ ఇన్నోవేషన్ సెంటర్, సుధా గోపాలకృష్ణ వంటి ఇతర పరిశోధనా సదుపాయాలతో పాటు ఐఐటీ మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్‌, బ్రెయిన్ సెంటర్,  క్యాంపస్‌లోని 1వ 3డి-ప్రింటెడ్ హౌస్‌ను మంత్రి సందర్శించారు.

ఈ సందర్భంగా శ్రీ ప్రధాన్ మాట్లాడుతూ..అకడమిక్ ఎక్సలెన్స్‌తో పాటు దేశ నిర్మాణానికి సంబంధించిన ఈ కార్యక్రమాలను ప్రారంభించినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. ఐఐటీలు కేవలం విద్యాసంస్థలు మాత్రమే కాదని..శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు, మానవాళి భవిష్యత్తును తీర్చిదిద్దేకు ఎర్పాటు చేసిన దేవాలయాలని అన్నారు. ఐఐటీలపై మన సమాజానికి మంచి అంచనాలు ఉన్నాయని అన్నారు. మన ఐఐటియన్లు  అభివృద్ధికి టార్చ్ బేరర్లుగా ఉండాలని..బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్‌ను సద్వినియోగం చేసుకునేందుకు ప్రపంచం మొత్తం మద్రాస్ ఐఐటీకి వచ్చే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు. 3డి-ప్రింటింగ్ టెక్నాలజీ వంటి ఆలోచనలు నిర్మాణాన్ని విప్లవాత్మకంగా మార్చగలవని  సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయని అన్నారు.

సమాజానికి తిరిగి ఇచ్చే సంస్కృతి భారతదేశంలో ఉందని భారతదేశం సమాజం మంచిని మాత్రమే ఆవిష్కరిస్తుందని శ్రీ ప్రధాన్ అన్నారు.ఐఐటీ మద్రాస్ అందించిన సాంకేతిక మద్దతుతో భారతదేశం 2023 చివరి నాటికి స్వదేశీ 5జీని విడుదల చేయనుందని మంత్రి అన్నారు.

ఐఐటీల్లో ఉన్న టాలెంట్ తనకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని మంత్రి అన్నారు. మన విద్యార్థులు తమ  బలాన్ని పునరుజ్జీవింపజేయాలని వారి 'చేతన' మళ్లీ పుంజుకోవాలని చెప్పారు. ఐఐటీయన్లు సామాజిక మార్పును తీసుకురావాలని అలాగే ఉద్యోగార్ధులుగా కాకుండా ఉద్యోగ ప్రదాతలుగా మారాలని అన్నారాయన.

2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు 'పంచప్రాణ్'ను స్వీకరించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మనందరికీ విజ్ఞప్తి చేశారని మంత్రి తెలియజేశారు. భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మరియు విక్షిత్ భారత్ లక్ష్యాన్ని నెరవేర్చడంలో ఐఐటీ మద్రాస్ వంటి సంస్థలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. రాబోయే 25 ఏళ్లు మనందరికీ చాలా ముఖ్యమైనవి. అమృత్ కాల్‌లోకి ప్రవేశిస్తున్న క్రమంలో మనల్ని వలసరాజ్యం చేసిన దేశం కంటే మనం ముందుకు దూసుకుపోయాము. భారతదేశం అపూర్వమైన వేగంతో అభివృద్ధి చెందుతోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌కు భారీ దేశీయ అవసరాలు ఉంటాయని వీటిని మన ఐఐటీలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ఎంట్రప్రెన్యూర్‌షిప్‌లో విద్యార్థులు సాధించిన విజయాలను జరుపుకోవడానికి, ప్రజా ప్రయోజనాలకు పేటెంట్‌లను ఫైల్ చేయడానికి మరియు పేదలు నాణ్యమైన జీవనాన్ని సాగించేందుకు అవసరమైన ఆవిష్కరణలు చేయాలని ఐఐటి మద్రాస్‌కు మంత్రి పిలుపునిచ్చారు.


 

*****



(Release ID: 1860763) Visitor Counter : 105