ప్రధాన మంత్రి కార్యాలయం

ఉజ్బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుని తో సమావేశమైన ప్రధానమంత్రి

Posted On: 16 SEP 2022 8:31PM by PIB Hyderabad

శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ (ఎస్ సిఒ) యొక్క 22వ సమావేశం ఉజ్ బెకిస్తాన్ లోని సమర్ కంద్ లో ఈ రోజు న జరిగిన సందర్భం లో, రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమావేశమయ్యారు.
నేత లు ద్వైపాక్షిక సంబంధాల లో నిరంతర పురోగతి ని నేత లు ప్రశంసించారు. ఈ నెల ఆరంభం లో వ్లాదివోస్తోక్ లో ఏర్పాటైన ఈస్టర్న్ ఇకానామిక్ ఫోరమ్ లో ప్రధాన మంత్రి యొక్క వీడియో సందేశాన్ని అధ్యక్షుడు శ్రీ పుతిన్ కొనియాడారు.

నేత లు ఇద్దరు ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల తో పాటు గా పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాల ను మరియు ప్రపంచ అంశాల ను గురించి కూడా చర్చించారు. వర్తమాన భౌగోళిక, రాజకీయ స్థితి నుండి తలెత్తిన సవాళ్ల సందర్భం లో ప్రపంచ ఆహార భద్రత, శక్తి భద్రత మరియు ఎరువుల లభ్యత పట్ల కూడా చర్చ జరిగింది.

యూక్రేన్ లో సంఘర్షణ కొనసాగుతూ ఉన్న సందర్భం లో, శత్రుత్వాన్ని శీఘ్రం గా సమాప్తం చేయాలని, సంభాషణ మరియు దౌత్యం మార్గాల ను అనుసరించవలసిన అవసరాన్ని గురించిన తన పిలుపు ను ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ సంవత్సరం లో, ద్వైపాక్షిక రాజకీయ సంబంధాలు ఏర్పడిన అనంతరం 75వ వార్షికోత్సవం తాలూకు సంవత్సరం గా ఉన్న కారణం గా, నేత లు ఇరువురు సమావేశం కావడం ఇది మొదటి సారి. ఉభయ నేత లు ఒకరి తో మరొకరు సంపర్కం కొనసాగిస్తూ ఉండాలనే అంశం లో సమ్మతి ని వ్యక్తం చేశారు.

 

 

***



(Release ID: 1860562) Visitor Counter : 108