ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన మెగా రక్తదాన శిబిరంతో స్వచ్ఛంద రక్తదానంలో భారతదేశం కొత్త మైలురాయిని అందుకుంది.


"87,000 మందికి పైగా స్వచ్ఛంద రక్తదాతలతో భారతదేశం నేడు కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది"- డాక్టర్ మన్సుఖ్ మాండవియా

ఈ-రక్త్ కోష్ పోర్టల్‌లో ఇప్పటివరకు నమోదు చేసుకున్న 1.97 లక్షల మందికి పైగా రక్తదాతలతో పాటు మెగా డ్రైవ్‌కు 6,000 కంటే ఎక్కువ శిబిరాలు నమోదు చేయబడ్డాయి.

గౌరవనీయ రాష్ట్రపతి ప్రారంభించిన "ప్రధాన్ మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్"..15,000 మందికి పైగా మిత్రలతో 9.5 లక్షల మందికి పైగా టిబి రోగులకు మద్దతు ఇవ్వడానికి కట్టుబడి ఉంది.

Posted On: 17 SEP 2022 8:49PM by PIB Hyderabad

ఒక్క రోజులో 87,000 (87,137) కంటే ఎక్కువ మంది వ్యక్తులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ద్వారా (తాత్కాలిక నివేదికల ప్రకారం ఈరోజు సాయంత్రం 7:40 వరకు) దేశం మునుపటి అత్యుత్తమ 87,059 (2014) రికార్డుని అధిగమించి ఈరోజు సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఈ రోజు రక్తదాన శిబిరంలో రక్తదానం చేయడం ద్వారా కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈ దేశవ్యాప్త మెగా స్వచ్ఛంద రక్తదాన డ్రైవ్‌ను ప్రారంభించారు. రక్తదాన్ అమృత్ మహోత్సవ్‌లో ఇది ఒక ముఖ్యమైన విజయం అంటూ డాక్టర్ మాండవ్య తన ట్వీట్‌లో ప్రశంసించారు:

ఈ దేశవ్యాప్త డ్రైవ్‌లో మరొక విశేషమైన అంశం ఈ  డ్రైవ్ కోసం 6,136 శిబిరాలు నమోదు చేయబడ్డాయి. అలాగే 1.95 లక్షల కంటే ఎక్కువ మంది రక్తదాతలు ఇప్పటివరకు ఈ-రక్త్ కోష్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు.

(link:.https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html
 

image.png

 

అందరికీ ఆరోగ్య భరోసా దిశగా 2025 నాటికి టిబిని నిర్మూలించే లక్ష్యంతో 'ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్'ని 9 సెప్టెంబర్ 2022న గౌరవనీయ రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు. ప్రధాన మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్ అనేది గౌరవనీయ ప్రధాన మంత్రి చేపట్టిన పౌర కేంద్రీకృత విధానాల కొనసాగింపు. టిబి ఒక నయం చేయగల వ్యాధి. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఈ చికిత్స ఉచితంగా లభిస్తుంది.

ఈ కార్యక్రమం రోజురోజుకు ఊపందుకుంటోంది. ఇప్పటివరకు దాదాపు 13.5 లక్షల మంది టిబి రోగులు నిక్షయ్‌ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. వీరిలో 9.5 లక్షల మంది క్రియాశీల టిబి రోగులు దత్తత తీసుకోవడానికి తమ సమ్మతిని ఇచ్చారు.

టిబి రోగుల చికిత్స ఫలితాలను మెరుగుపరచడంతో పాటు  రోగులకు అదనపు సహాయాన్ని అందించడానికి అలాగే 2025 నాటికి టిబిని అంతం చేయాలనే భారతదేశ లక్ష్యానికి అనుగుణంగా సమాజ ప్రమేయాన్ని పెంపొందించడంలో మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యతను(సిఎస్‌ఆర్‌) సద్వినియోగం చేసుకోవడంలో ని-క్షయ్ 2.0 పోర్టల్ ( https://communitysupport.nikshay.in/ ) సులభతరం చేస్తుంది.

నిక్షయ్ మిత్రులు వెబ్‌సైట్‌లో కూడా నమోదు చేసుకోవచ్చు. 15,000 కంటే ఎక్కువ మంది మిత్రలు ఇప్పటివరకు నమోదు చేసుకున్నారు మరియు 9.5 లక్షల మంది టిబి రోగులకు సహాయాన్ని అందించడానికి తమ నిబద్ధతను చూపించారు.

 

image.png

***


(Release ID: 1860332) Visitor Counter : 147


Read this release in: English , Urdu , Hindi , Marathi