హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


దేశ అత్యంత ప్రియతమ నాయకుడు మరియు మనందరికీ స్ఫూర్తిప్రదాత అయిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు

మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయుస్సు లభించాలని ప్రార్థిస్తున్నాను

భారతదేశమే తన మొదటి ప్రాధాన్యతగా భావించే ప్రధాని శ్రీ మోదీ..పేదల సంక్షేమం కోసం కృషి చేయాలనే సంకల్పంతో అసాధ్యాలను సుసాధ్యం చేశారు.

పేదల సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ భద్రత మరియు చారిత్రాత్మక సంస్కరణల కోసం ఏకకాలంలో మరియు నిరంతరాయంగా కృషి చేయడం ద్వారా శ్రీ మోదీ భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలనే తన సంకల్పాన్ని నెరవేర్చారు.

నిర్ణయాత్మక నాయకత్వం, ఆ నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అచంచల విశ్వాసం వల్లే ఇది సాధ్యమైంది

సురక్షితమైన, దృఢమైన మరియు స్వావలంబన కలిగిన నూతన భారతదేశాన్ని సృష్టించిన శ్రీ మోదీ జీవితం..సేవ మరియు అంకితభావానికి ఉదాహరణ

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా కోట్లాది మంది పేదలకు వారి హక్కులను కల్పించడం ద్వారా శ్రీ మోదీ వారిలో ఆశలు, విశ్వాసాన్ని నింపారు. ఈరోజు సమాజంలోని ప్రతి వర్గం శ్రీ మోదీకి అండగా నిలుస్తోంది.

భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు దేశాన్ని అసలు మూలాలకు

Posted On: 17 SEP 2022 9:59AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కేంద్ర హోం మరియు సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు లభించాలని  ప్రార్థిస్తున్నానని అమిత్‌ షా తెలిపారు. రతదేశమే తన మొదటి ప్రాధాన్యతగా భావించే ప్రధాని శ్రీ మోదీ..పేదల సంక్షేమం కోసం కృషి చేయాలనే సంకల్పంతో అసాధ్యాలను సుసాధ్యం చేశారని వెల్లడించారు.

పేదల సంక్షేమం, సుపరిపాలన, అభివృద్ధి, జాతీయ భద్రత మరియు చారిత్రాత్మక సంస్కరణల కోసం ఏకకాలంలో నిరంతరాయంగా కృషి చేయడం ద్వారా భారతదేశాన్ని అగ్రస్థానానికి తీసుకెళ్లాలనే తన సంకల్పాన్ని శ్రీ మోదీ నెరవేర్చారని కేంద్ర హోం, సహకార మంత్రి అన్నారు. ఆయన నాయకత్వంపై ప్రజల్లో ఉన్న అచంచల విశ్వాసం వల్లనే ఇది సాధ్యమైందని వివరించారు.

సురక్షితమైన, దృఢమైన మరియు స్వావలంబన కలిగిన నూతన భారతదేశాన్ని సృష్టించిన శ్రీ మోదీ జీవితం..సేవ మరియు అంకితభావానికి ప్రతీక అని కూడా శ్రీ అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రానంతరం మొట్టమొదటిసారిగా కోట్లాది మంది పేదలకు వారి హక్కులను కల్పించడం ద్వారా శ్రీ మోదీ వారిలో ఆశలు మరియు విశ్వాసాన్ని నింపారని..ఈరోజు సమాజంలోని ప్రతి వర్గం శ్రీ మోదీకి అండగా నిలుస్తోందని చెప్పారు.

భారతీయ సంస్కృతిని ప్రోత్సహించడంతో పాటు దేశాన్ని అసలు మూలాలకు అనుసంధానించడం ద్వారా  శ్రీ మోదీ ప్రతి అభివృద్ధి రంగంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్లారని కేంద్ర హోం మరియు సహకార మంత్రి అన్నారు. శ్రీ మోదీ దార్శనికత మరియు నాయకత్వంలో నేటి నూతన భారతదేశం ప్రపంచ శక్తిగా అవతరించింది. అలాగే ప్రపంచం గౌరవించే గ్లోబల్ లీడర్‌గా ఆయన తన ముద్ర వేశారని శ్రీ అమిత్ షా తెలిపారు.
 

                                           

*****


(Release ID: 1860128) Visitor Counter : 193