ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
రక్తదాన అమృత మహోత్సవ్ లో భాగంగా ఏర్పాటైన రక్షదాన శిబిరాన్ని ప్రారంభించిన డాక్టర్ మన్సుఖ్ మాండవీయ రక్తదానం చేసిన డాక్టర్ మాండవీయ
సంప్రదాయాన్ని అనుసరించి సేవ సహయోగ్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం, చేయాలి.. డాక్టర్ మాండవీయ
' సాంకేతికంగా అభివృద్ధి సాధించినా రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. ఒక యూనిట్ రక్తం మూడు ప్రాణాలను రక్షిస్తుంది'. డాక్టర్ మాండవీయ
భారతదేశంలో ప్రతి రెండు సెకన్లలో ఒక వ్యక్తికి రక్తం అవసరం పడుతుంది. జీవితకాలం ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తం అవసరం ఉంటుంది...డాక్టర్ మాండవీయ
Posted On:
17 SEP 2022 12:18PM by PIB Hyderabad
మానవతా దృక్పధంతో సంప్రదాయాన్ని అనుసరించి సేవ సహయోగ్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు స్వచ్చందంగా ముందుకు రావాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ పిలుపు ఇచ్చారు. న్యూఢిల్లీ సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఏర్పాటైన మెగా రక్తదాన శిబిరాన్ని డాక్టర్ మాండవీయ ఈరోజు ప్రారంభించారు. శిబిరంలో డాక్టర్ మాండవీయ రక్తాన్ని దానం చేశారు. అనంతరం ఏర్పాటైన కార్యక్రమంలో మాట్లాడిన డాక్టర్ మాండవీయ రక్త దానం అనేది మానవతా విలువలతో కూడిన గొప్ప పని అని అన్నారు. సంప్రదాయాన్ని అనుసరించి సేవ సహయోగ్ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న రక్తదాన శిబిరాల్లో పాల్గొని రక్తదానం చేయాలని ఆయన కోరారు. ప్రజలు చేసే రక్త దానం వల్ల దేశ రక్త అవసరాలు తీరుతాయని అన్నారు. రక్త దానం చేసేవారు సమాజంతో పాటు ప్రజలకు సేవ చేయగలుగుతారని డాక్టర్ మాండవీయ అన్నారు.
రక్త దానం ప్రాధాన్యత అవసరాన్ని వివరించిన డాక్టర్ మాండవీయ “ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పెద్ద వేడుకలలో ప్రధాన భాగంగా రక్తదాన్ అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ప్రతిఫలం ఆశించకుండా తరచు రక్త దానం చేసే అంశంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అవసరాలకు సరిపడా సురక్షిత రక్తం లేదా దాని భాగాలు (మొత్తం రక్తం/ ప్యాక్ చేసిన ఎర్ర రక్త కణాలు/ప్లాస్మా/ప్లేట్‌లెట్‌లు) సరసమైన ధరలో అవసరమైన వారికి అందుబాటులో ఉండేలా చూసుకోవడం ఈ కార్యక్రమం లక్ష్యం.' అని డాక్టర్ మాండవీయ అన్నారు. '2021 గణాంకాల ప్రకారం భారతదేశ వార్షిక అవసరాలు దాదాపు 1.5 కోట్ల యూనిట్లు వరకు ఉంది . ప్రతి రెండు సెకన్లలో భారతదేశంలో ఒకరికి రక్తం అవసరమవుతుంది. జీవిత కాలంలో ప్రతి ముగ్గురిలో ఒకరికి రక్తం అవసరమవుతుంది' అని డాక్టర్ మాండవీయ వివరించారు. "సాంకేతిక పురోగతి సాధించినప్పటికీ రక్తానికి ప్రత్యామ్నాయం లేదు. 1 యూనిట్ రక్తం ముగ్గురి ప్రాణాలు కాపాడుతుంది" అని డాక్టర్ మాండవీయ పేర్కొన్నారు.
రక్తదాన శిబిరంలో దాతలను డాక్టర్ మాండవీయ కలుసుకుని నిస్వార్థంగా రక్తదానం చేసిన వారిని అభినందించారు. రక్తదానం పై ఉన్న అపోహలు విడనాడాలని మంత్రి కోరారు. "ఒక వ్యక్తి శరీరంలో 5 - 6 లీటర్ల రక్తం ఉంటుంది. ప్రతి 90 రోజులకు (3 నెలలు) ఒకసారి రక్తం దానం చేయవచ్చు" అని డాక్టర్ మాండవ్య పేర్కొన్నారు. చాలా త్వరగా శరీరంలో రక్తం వృద్ధి చెందుతుందని, రక్త ప్లాస్మా పరిమాణం 24 - 48 గంటల్లో, ఎర్ర రక్త కణాలు సుమారు 3 వారాల్లో మరియు ప్లేట్‌లెట్స్ & తెల్ల రక్త కణాలు నిమిషాల్లో వృద్ధి చెందుతాయని డాక్టర్ మాండవీయ వివరించారు.
దేశవ్యాప్తంగా జరుగుతున్న రక్త సేకరణ కార్యక్రమానికి ఇ-రక్త్ కోష్ పోర్టల్ ద్వారా సెంట్రలైజ్డ్ బ్లడ్ బ్యాంక్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సహకారం అందిస్తోంది. ఇది రక్తదాతల జాతీయ రిపోజిటరీ గా పనిచేస్తుంది. రక్త దాతల వివరాలు ఇ-రక్త్ కోష్ పోర్టల్ లో పొందుపరచడం జరుగుతుంది. అవసరమైనప్పుడు రక్త లభ్యతను ఇ-రక్త్ కోష్ పోర్టల్ వేగవంతం చేస్తుంది.
ఇ-రక్త్ కోష్ పోర్టల్ లింక్ :
https://www.eraktkosh.in/BLDAHIMS/bloodbank/transactions/bbpublicindex.html
భారతదేశ ఆరోగ్య సంరక్షణకు సఫ్దర్‌జంగ్ హాస్పిటల్ చేసిన కృషిని వివరిస్తూ ముద్రించిన "ఫుట్‌ప్రింట్స్ ఆన్ ది సాండ్స్ ఆఫ్ టైమ్" పుస్తకాన్ని డాక్టర్ మాండవియా విడుదల చేశారు.
***
(Release ID: 1860127)
Visitor Counter : 502