రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థను వృత్తిపరంగా నిర్వహించాలని పిలుపునిచ్చిన కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
15 SEP 2022 3:53PM by PIB Hyderabad
ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న విద్యుత్ ఆధారిత ప్రజా రవాణా వ్యవస్థకు మంచి స్పందన లభిస్తుందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ అన్నారు. ‘ఇన్‌సైట్ 2022’: అనే అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు. సరైన నమూనా ఉంటే అమలు చేయడానికి మూలధన పెట్టుబడి సమస్య కాదని అన్నారు. ప్రజలు వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేలా కృషి చేయాలని అన్నారు. లండన్ రవాణా నమూనాను ప్రశంసించిన మంత్రి, తక్కువ ధరలో ఎక్కువ సౌకర్యాన్ని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. బస్ కార్పొరేషన్లకు నష్టాలను నివారించడానికి మరియు ప్రయాణ సౌలభ్యాన్ని ప్రోత్సహించడానికి బస్సులలో ఫిజికల్ టిక్కెట్ సిస్టమ్ స్థానంలో కార్డ్ లేదా క్యూఆర్ కోడ్ ఆధారిత ఎంట్రీ-ఎగ్జిట్ సిస్టమ్‌ను ఉపయోగించాలని ఆయన ప్రతిపాదించారు.
ఎలక్ట్రిక్ బస్సుల రాకతో కాలుష్యం తగ్గుతుందని, డీజిల్, ముడి చమురు దిగుమతిని తగ్గించుకోగలుగుతామని ఆయన ఉద్ఘాటించారు.
దేశంలో అత్యధికంగా 4 కోట్ల ఉద్యోగాలు కల్పించే అవకాశం ఉన్న పరిశ్రమ ఇదే కాబట్టి 15 లక్షల కోట్ల ఆటోమొబైల్ పరిశ్రమగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, ఈ పరిశ్రమ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు గరిష్ట ఆదాయాన్ని అందించిందని శ్రీ గడ్కరీ చెప్పారు.
5,450 ఈ-బస్సుల టెండర్ కోసం CESL చేసిన కృషిని మంత్రి అభినందించారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్దదని తెలిపారు. 50,000 ఈ-బస్సులకు బదులుగా 5 లక్షల బస్సులను లక్ష్యంగా పెట్టుకోవాలని ఆయన అన్నారు. రవాణాకు భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ అని నితిన్ గడ్కరీ అన్నారు. దిల్లీ నుండి జైపూర్ వరకు ఈ-రోడ్ ఏర్పాటును కూడా మంత్రి ప్రతిపాదించారు. ఆర్థిక సాధ్యత మరియు స్థిరమైన అభివృద్ధికి రవాణా రంగంలో ప్రత్యామ్నాయ ఇంధనాలు, కొత్త సాంకేతికతలు మరియు ఆవిష్కరణలు తప్పనిసరిగా కనుగొనబడాలని ఆయన అన్నారు.
*****
(Release ID: 1859828)
Visitor Counter : 141