కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
శాఖాపరమైన అధికారులు దేశంలో ప్రతి ఇంటికి అనుసంధాతను నిర్ధారించి, కవరేజ్ నాణ్యతను మెరుగు పరచాలి - శ్రీ అశ్విని వైష్ణవ్
డి.ఓ.టి. క్షేత్ర స్థాయి అధికారుల సమావేశం : టెలికాం వృద్ధి ని ముందుకు తీసుకెళ్లేందుకు విభాగం & పరిశ్రమ చేతులు కలిపాయి.
Posted On:
15 SEP 2022 10:01AM by PIB Hyderabad
దేశంలోని ప్రతి ఇంటికీ అనుసంధానతను నిర్ధారించి, కవరేజ్ నాణ్యతను మెరుగుపరిచే ఉమ్మడి లక్ష్యాల సాధనకు నియంత్రణ నుంచి అభివృద్ధి వరకు శాఖాపరమైన అధికారుల ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందని కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు రైల్వేల మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ అన్నారు.
నిన్న ఇక్కడ నిర్వహించిన క్షేత్ర స్థాయి అధికారులు, శాఖాపరమైన ప్రధాన కార్యాలయ అధికారులు, పరిశ్రమ ప్రతినిధుల రెండు రోజుల సదస్సునుద్దేశించి ఆయన ప్రసంగించారు. కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ ఈ సమావేశాన్ని ప్రారంభించారు. టెలికాం రంగానికి సంబంధించిన వివిధ సమయోచిత సమస్యలపై సంయుక్త భాగస్వాములు, కార్యనిర్వాక బృందాల ఫలితాలు, సిఫార్సులను ఉదయం జరిగిన సదస్సులో కమ్యూనికేషన్ల శాఖ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ కు, మధ్యాహ్నం జరిగిన సదస్సులో కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి కీ సమర్పించారు.
సార్వత్రిక డిజిటల్ చేరిక లో నాణ్యమైన టెలికాం కనెక్టివిటీ యొక్క ప్రాముఖ్యతను ముఖ్యంగా డిజిటల్ ఆర్థిక వ్యవస్థ పరంగా ప్రాముఖ్యతను శ్రీ అశ్విని వైష్ణవ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
క్షేత్ర స్థాయి లోనూ, ప్రధాన కార్యాలయాలలోనూ పనిచేసే శాఖాపరమైన అధికారులు, అదేవిధంగా పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారం మాత్రమే మారుతున్న సాంకేతిక స్వభావంతో టెలికాం రంగాన్ని ముందుకు తీసుకెళ్లగలదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పాతకాలపు టెలికాం చట్టాల స్థానంలో పటిష్టమైన, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఉండే టెలికాం చట్టం అవసరం ఉందని పేర్కొంటూ, దీనికి సంబంధించిన ముసాయిదా చట్టాన్ని, ప్రజల సంప్రదింపులు / సూచనలు, స్పందనల కోసం త్వరలో పబ్లిక్ డొమైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు కూడా ఆయన తెలియజేశారు.
అంతకుముందు, సదస్సును ప్రారంభించిన అనంతరం శ్రీ దేవుసిన్హ్ చౌహాన్ మాట్లాడుతూ, ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ దిశగా దేశం పురోగమించడంలో టెలికాం పాత్ర ను ప్రముఖంగా పేర్కొన్నారు. ఇటీవల విజయవంతంగా నిర్వహించిన 5-జి. వేలం మరియు ఇతర టెలికాం సంస్కరణల విషయంలో టెలికాం విభాగంతో పాటు, ఇతర భాగస్వాములందరినీ, ఆయన అభినందిస్తూ, టెలికాం విభాగాన్ని మరింత వృద్ధి లోకి తీసుకు వెళ్ళడానికి అమలు చేయగల ఆలోచనలు, పరిష్కారాలను ఈ సదస్సు రూపొందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
టెలికాం రంగంలోని సంబంధిత సమస్యలపై ఫోకస్డ్ గ్రూప్ డిస్కషన్ లు మరియు ప్రెజెంటేషన్ల తో ఈ సదస్సు 2022 సెప్టెంబర్, 15వ తేదీన కూడా కొనసాగుతుంది.
*****
(Release ID: 1859827)
Visitor Counter : 129