విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

"మేకింగ్ ది జీరో కార్బన్ ట్రాన్సిషన్ ఇన్ బిల్డింగ్స్"పై మూడు రోజుల 'అంగన్ 2.0' అంతర్జాతీయ సమావేశం


15 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చిన అంతర్జాతీయ నిపుణులు శక్తి సామర్థ్య భవనాల సాంకేతికతలపై చర్చిస్తారు

సదస్సులో తక్కువ కార్బన్ ఉత్పత్తులు, సాంకేతికతలు మరియు నిర్మాణ రంగానికి సంబంధించిన ఆవిష్కరణల ప్రదర్శన

प्रविष्टि तिथि: 15 SEP 2022 4:30PM by PIB Hyderabad

"మేకింగ్ ది జీరో కార్బన్ ట్రాన్సిషన్ ఇన్ బిల్డింగ్స్" పేరుతో మూడు రోజుల అంతర్జాతీయ సమావేశం అంగన్ 2.0. (ఆగ్మెంటింగ్ నేచర్ బై గ్రీన్ అఫర్డబుల్ న్యూ-హాబిటాట్) రెండవ ఎడిషన్ 14 సెప్టెంబర్ 2022న ప్రారంభమైంది. విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అలోక్ కుమార్ సదస్సును ప్రారంభించారు. విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అజయ్ తివారీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇండో స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బీఈపీ) కింద స్విస్ ఏజెన్సీ ఫర్ డెవలప్‌మెంట్ & కోఆపరేషన్ (ఎస్‌డిసి) సహకారంతో విద్యుత్ మంత్రిత్వ శాఖ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఈ అంగన్ 2.0.ను నిర్వహిస్తోంది.

ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఎనర్జీ ఎఫిషియెన్సీ హెడ్ డాక్టర్ బ్రియాన్ మదర్‌వే, డాక్టర్ రిచర్డ్ డి డియర్, యూనివర్శిటీ ఆఫ్ సిడ్నీ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, డిజైన్ అండ్ ప్లానింగ్ ప్రొఫెసర్‌తో సహా 75 మంది ప్రముఖ వక్తలు సదస్సులో పాల్గొంటున్నారు. 15 కంటే ఎక్కువ దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలు, 8 ప్లీనరీ మరియు 8 థీమాటిక్ సెషన్‌లలో ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం,  భవనాల నుండి కార్బన్ ఉద్గారాలను తగ్గించడం వంటి సమస్యలపై చర్చించడానికి సమావేశమయ్యాయి.

స్విస్‌ ఏజెన్సీ ఫర్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ కోఆపరేషన్‌  హెడ్‌ జోనాథన్‌ డెమెంగే, ఇంటర్నేషనల్‌ ఎనర్జీ ఏజెన్సీ ఎనర్జీ ఎఫిషియెన్సీ హెడ్‌ డాక్టర్‌ బ్రియాన్‌ మదర్‌వే, భారత్, భూటన్‌లో స్విట్జర్లాండ్‌ రాయబారి డాక్టర్‌ రాల్ఫ్‌ హెక్‌నర్‌ వంటి ప్రముఖులు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు సదస్సుకు హాజరయ్యారు.

బీఈఈ  మొదటి నేషనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రోడ్‌మ్యాప్ ఫర్ మూవ్‌మెంట్ టూ అఫర్డబుల్ అండ్ నేచురల్ హాబిట్ (నిర్మన్) అవార్డుల విజేతలను ఈరోజు సత్కరించారు.బీఈఈ ఎకో నివాస్ సంహిత (ఈఎన్‌ఎస్) మరియు ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసిబీసి)కి అనుగుణంగా ఉన్న ఆదర్శప్రాయమైన బిల్డింగ్ డిజైన్‌లను గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ఈ అవార్డులు  ఏర్పాటు చేయబడ్డాయి. జమ్మూ & కాశ్మీర్ నుండి అండమాన్ & నికోబార్ దీవుల వరకు దేశవ్యాప్తంగా నిర్మాణ ప్రాజెక్టులలో భాగస్వామ్యం నిర్మాన్ అవార్డులో కనిపించింది. ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, బిల్డర్లు, బిల్డింగ్ మెటీరియల్ పరిశ్రమలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పరిశోధకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో కూడిన 500 మందికి పైగా ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు.

2070 నాటికి భారతదేశాన్ని నికర జీరోగా మార్చాలనే సంకల్పంతో గ్లాస్గోలోని కాప్-26లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన లైఫ్ (జీవనశైలి,పర్యావరణం) మరియు పంచామృతం గురించి ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడం ఈ సదస్సు లక్ష్యం. నిర్మాణ రంగంలో వర్తించే వివిధ తక్కువ కార్బన్ ఉత్పత్తులు, సాంకేతికతలు మరియు ఆవిష్కరణల ప్రదర్శన ఇందులో ఉంది.

ఇంధన సమర్థవంతమైన మరియు తక్కువ కార్బన్ భవనాల కోసం వినూత్న సాంకేతికతలు మరియు పరిష్కారాలను అందించే అనేక కంపెనీల సిఈఓలు ఈ సమావేశంలో ప్రసంగించారు. అలాగే దాదాపు 20 కంపెనీలు తమ ఉత్పత్తులు మరియు సేవలను ప్రదర్శించాయి. వీటిలో తక్కువ కార్బన్ నిర్మాణ వస్తువులు, కదిలే షేడింగ్ సిస్టమ్‌లు, శక్తి సమర్థవంతమైన స్పేస్ కూలింగ్ టెక్నాలజీలు వీటిలో ఉన్నాయి. ఈ కాన్ఫరెన్స్ కమ్ ఎగ్జిబిషన్ జాతీయ మరియు అంతర్జాతీయ వ్యూహాత్మక సహకారం, భాగస్వామ్యం, నెట్‌వర్క్ మరియు సమాచార మార్పిడిని ప్రోత్సహిస్తుంది.

"తక్కువ కార్బన్ భవనాలకు అన్‌లాకింగ్ ఫైనాన్స్" నివాస భవనాలలో థర్మల్ కంఫర్ట్ మరియు క్లైమేట్ రెసిలెన్స్" వంటి క్లిష్టమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. అలాగే "రిసోర్స్ ఎఫిషియన్సీలో మహిళలు" అనే అంశంపై ప్రత్యేక సెషన్లు ఉన్నాయి.

నేపథ్యం:
ఇండో స్విస్ బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ (బిఈఈపి) అనేది భారత్, స్విట్జర్లాండ్ ప్రభుత్వాల మధ్య ఒక సహకార ప్రాజెక్ట్. పర్యావరణ-నివాస్ సంహిత (నివాస భవనాలకు ఇంధన సంరక్షణ )తో పాటు సుమారు 50 భవనాల రూపకల్పన మరియు 5000 మందికి పైగా భవన నిర్మాణ రంగ నిపుణులకు శిక్షణ ఇవ్వడంలో బిఈఈకి బీఈఈపి సాంకేతిక సహాయాన్ని అందించింది.

***


(रिलीज़ आईडी: 1859825) आगंतुक पटल : 201
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Marathi , हिन्दी , Kannada , English , Urdu , Punjabi , Tamil