భారత ఎన్నికల సంఘం

నమోదై గుర్తింపు పొందని 253 రాజకీయ పార్టీలను నిష్క్రియ పార్టీలుగా ప్రకటించిన ఎన్నికల కమిషన్.. సింబల్ ఆర్డర్ 1968 కింద ఎటువంటి ప్రయోజనాలు పొందకుండా పార్టీలపై నిషేధం అదనంగా ఉనికిలో లేని 86 పార్టీల పేర్లు జాబితా నుంచి తొలగింపు, సింబల్ ఆర్డర్ 1968 కింద పొందుతున్న ప్రయోజనాలు ఉపసంహరణ


2022 మే 25 నుంచి ఇంతవరకు నిబంధనలు పాటించని 339 ( 86+253) పార్టీలపై ఎన్నికల కమిషన్ చర్యలు

Posted On: 13 SEP 2022 6:03PM by PIB Hyderabad
ఎన్నికల కమిషన్ లో నమోదు అయి  గుర్తింపు పొంది   నిబంధనల మేరకు పని చేయకుండా నిష్క్రియ పార్టీలుగా మిగిలిపోయిన రాజకీయ పార్టీలపై భారత ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధాన ఎన్నికల  కమిషనర్   శ్రీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ శ్రీ అనూప్ చంద్ర పని చేయకుండా ఉన్న మరో 83 పార్టీలను జాబితా నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరో 253 పార్టీలను  నిష్క్రియ పార్టీలుగా ప్రకటించారు. దీంతో, 2022 మే 25 నుంచి ఎన్నికల సంఘం చర్యలు తీసుకున్న పార్టీల సంఖ్య 339 కి పెరిగింది. 
ప్రజా ప్రాతినిధ్య చట్టం లోని సెక్షన్ 29 ఎ నిబంధన ప్రకారం ఎటువంటి జాప్యం లేకుండా పేరు, ప్రధాన కార్యాలయం, కార్యవర్గ సభ్యులు, చిరునామా, పాన్ మార్పులను ఎన్నికల కమిషన్ కు తెలియజేయాల్సి ఉంటుంది. సంబంధిత రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులు నిర్వహించిన సర్వే లో ఎన్నికల కమిషన్ లో నమోదు అయి  గుర్తింపు పొందిన 86 పార్టీలు ఉనికిలో లేవని గుర్తించారు. బౌతికంగా లేదా పార్టీల చిరునామాలకు పోస్ట్ ద్వారా  పంపిన లేఖలు/నోటీసులు చేరకపోవడం లాంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఎన్నికల సంఘం ఈ నిర్ణయానికి వచ్చింది. 2022 మే 25న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం  87, 2022 జూన్ 20 న జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 111 పార్టీలను ఎన్నికల సంఘం జాబితా నుంచి తొలగించింది. దీంతో జాబితా నుండి తొలగించబడిన పార్టీల సంఖ్య 284 కి చేరింది.   
బీహార్,ఢిల్లీ,కర్ణాటక,మహారాష్ట్ర,తమిళనాడు,తెలంగాణ,ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారుల నుంచి అందిన నివేదికల మేరకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు ఉపక్రమిచింది. కేంద్ర ఎన్నికల సంఘం చర్యలకు గురైన 253 పార్టీలు తమకు అందిన లేఖలు/నోటీసులకు స్పందించలేదు. 2014మరియు 2019లో జరిగిన  శాసనసభ, పార్లమెంట్ సాధారణ ఎన్నికల్లో  ఏ ఒక్క స్థానానికి ఈ పార్టీలు పోటీ చేయలేదు. చట్టప్రకారం పాటించాల్సిన నిబంధనలలో  కనీసం 16 నిబంధనలను పార్టీలు 2015 నుంచి గౌరవించి పాటించడం లేదు. 
పైన పేర్కొన్న 253 పార్టీలలో వాస్తవానికి 66 పార్టీలు ఉమ్మడి గుర్తు కోసం సింబల్ ఆర్డర్ 1968 లోని పేరా 10బి ప్రకారం దరఖాస్తు చేశాయి. అయితే, ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదని ఎన్నికల సంఘం గుర్తించింది. ఒక రాష్ట్ర శాసనసభకు నిర్వహించే ఎన్నికల్లో పోటీ చేసే మొత్తం అభ్యర్థులలో కనీసం శాతం మందిని పోటీలో దించేందుకు అంగీకరించే పార్టీలకు మాత్రమే ఉమ్మడి గుర్తు కేటాయించడం జరుగుతుంది. ఉమ్మడి గుర్తు పొందిన  పార్టీలు ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆమోదయోగ్యమైన అర్హతల ప్రయోజనాలను పొందడం ద్వారా అందుబాటులో ఉన్న ఎన్నికల ముందు రాజకీయ స్థలాన్ని ఆక్రమించుకునే అవకాశాన్ని తోసిపుచ్చలేము. ఇది వాస్తవానికి ఎన్నికల్లో పోటీ చేస్తున్న రాజకీయ పార్టీల సంఖ్య ఎక్కువగా ఉండేలా చూడడమే  కాకుండా  ఓటర్లకు గందరగోళ పరిస్థితి కల్పిస్తుంది. 
తమ వద్ద నమోదు చేసుకున్న పార్టీలకు ఎన్నికల సంఘం అందించే ప్రయోజనాలు, అధికారాలు సెక్షన్ 29 ఎ లో పొందుపరచబడ్డాయి. ఎన్నికలలో పోటీ చేసే పార్టీలకు మాత్రమే ప్రయోజనాలు, లాభాలు ప్రత్యక్షంగా  అందాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం గుర్తించింది. నమోదు కోసం రాజకీయ పార్టీలు అనుసరించాల్సిన విధివిధానాలను ఎన్నికల సంఘం 13(ii)(ఈ) ద్వారా జారీ చేసింది.  ఇవి ఈ విధంగా ఉన్నాయి :

"రిజిస్టర్ అయిన ఐదేళ్లలోపు ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికల్లో  పార్టీ తప్పనిసరిగా పోటీ చేయాలి.  ఆ తర్వాత పోటీ చేయాల్సి ఉంటుంది.  (పార్టీ ఆరేళ్లపాటు నిరంతరం ఎన్నికల్లో పోటీ చేయని పక్షంలో  రిజిస్టర్ పార్టీల జాబితా నుంచి పార్టీ పేరు తీసివేయబడుతుంది). 

ఆర్థిక క్రమశిక్షణసముచితప్రజా జవాబుదారీతనంపారదర్శకత వంటి వాటిని నిర్వహించడం కోసం పార్టీ ఆవిర్భావం నాటి పరిస్థితులు, నిబంధనలు పాటించడం, స్వీయ-అంగీకారం తప్పనిసరి అని ఎన్నికల సంఘం స్పష్ట వైఖరిగా ఉంది. పార్టీలకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శక విధానంలో ఓటర్లకు తెలియజేసేందుకు పార్టీలు నిబంధనలు ఏ మేరకు పాటిస్తున్నాయి అన్న అంశం ప్రధాన అంశంగా ఉంటుంది. నిబంధనలు పాటించని పార్టీల వల్ల ఓటర్లు, ఎన్నికల సంఘం సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.   అంతేకాకుండాఈ పేర్కొన్న అన్ని నియంత్రణ అవసరాలు రాజ్యాంగపరంగా స్వేచ్ఛగానిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలని అన్న ఎన్నికల సంఘం చేస్తున్న ప్రయత్నాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తాయి. 

పైన పేర్కొన్న అంశాలను  దృష్టిలో ఉంచుకునిఎన్నికల ప్రజాస్వామ్యం విలువలు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తక్షణ దిద్దుబాటు చర్యలు అవసరం. కాబట్టిన్యాయమైనస్వేచ్ఛానిష్పక్షపాతమైన మరియు పారదర్శకంగా ఎన్నికల ప్రక్రియను నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఈ కింది చర్యలు తీసుకుంది. 

          i.  ఉనికిలో లేని  86  పార్టీలు  రిజిస్టర్ జాబితా నుండి తొలగించబడతాయి. సింబల్ ఆర్డర్  1968 ప్రకారం ఎటువంటి ప్రయోజనాలు పొందేందుకు అర్హులు కాదు.

 

         ii.   ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని సెక్షన్ 29A కింద కమిషన్ నిర్వహించే పార్టీల  రిజిస్టర్‌లో 253 పార్టీలు లు 'క్రియారహితపార్టీలు 'గా గుర్తించబడ్డాయి.

 

        iii.   ఈ 253 పార్టీలు  ఎన్నికల చిహ్నాల (రిజర్వేషన్ మరియు కేటాయింపు) ఆర్డర్, 1968 ప్రకారం ఎలాంటి ప్రయోజనాలు పొందేందుకు అర్హత కలిగి ఉండవు.

       iv.   సంఘం తీసుకున్న నిర్ణయం వల్ల తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని భావించే   ఏ పార్టీ అయినాఈ ఉత్తర్వులు జారీ  చేసిన 30 రోజుల్లో సంబంధిత ప్రధాన ఎన్నికల అధికారి/ఎన్నికల కమీషన్‌ ను కార్యవర్గ సభ్యుల తాజా వివరాలు  నవీకరణ. సహా సంవత్సరం వారీగా (డిఫాల్ట్‌లో ఉన్న అన్ని సంవత్సరాలకు) వార్షిక ఆడిట్ చేయబడిన ఖాతాలతో పాటు ఉనికికి సంబంధించిన అన్ని ఆధారాలుఇతర చట్టపరమైన మరియు నియంత్రణ సమ్మతులు  అందిన నిధుల నివేదికవ్యయ నివేదికఆర్థిక లావాదేవీల (బ్యాంక్ ఖాతా తోసహా) కోసం అధీకృత సంతకందారు తో    సంప్రదించవచ్చు.

 

        v.   ఈ 253 పార్టీలలో  వివిధ ఎన్నికలలో పారా 10B కింద ఉమ్మడి గుర్తును కోరిన 66 పార్టీలు  సంబంధిత సాధారణ ఎన్నికల్లో ఒక్క అభ్యర్థిని కూడా పోటీకి దింపలేదు. ఈ 66 పార్టీలు  అభ్యర్థులనుఎందుకు పోటీకి దింపలేదు అన్న అంశంపై (పైన ఉన్న పాయింట్ iii)కి అదనంగా వివరాలు అందించాల్సి ఉంటుంది. "సింబల్స్ ఆర్డర్‌లోని పారా 10 బిలో కమీషన్ సముచితంగా భావించే  శిక్షాత్మక చర్యకు వారిని బాధ్యులుగా చేసే" చర్య తీసుకోరాదు అన్న అంశానికి కూడా సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. .

 

***

 



(Release ID: 1859162) Visitor Counter : 515