వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2016 ను ఉపయోగించేందుకు ఎలక్ట్రికల్ ఇన్ స్టలేషన్స్ లో భద్రత పై హ్యాండ్ బుక్ ను, గైడ్ ను విడుదల చేసిన శ్రీ పీయూష్ గోయల్


విద్యుత్ భద్రత , భవంతుల భద్రత, ఆరోగ్యం,సౌకర్యం, ప్రవేశ సౌలభ్యం, సుస్థిరత కొరకు కనీస అవసరమైన స్థాయిపై అవగాహన కల్పించడానికి హ్యాండ్ బుక్ లు

Posted On: 12 SEP 2022 4:31PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య ,పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం ,ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్  ఇటీవల జరిగిన  బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బిఐఎస్) నాల్గవ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో " ఎలక్ట్రికల్ ఇన్ స్టలేషన్స్ లో భద్రత - నేషనల్ ఎలక్ట్రికల్ కోడ్ ఆఫ్ ఇండియా ద్వారా భద్రతకు ఒక మార్గం" " అనే అంశంపై హ్యాండ్‌ బుక్ ను, గైడ్ ఫర్ యూజ్ నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2016 అనే అంశంపై హ్యాండ్ బుక్ ను విడుదల చేశారు. ఈ రెండు ముఖ్యమైన హ్యాండ్ బుక్ లతో పాటు, స్వంత ఇంటిని నిర్మించేటప్పుడు లేదా బిల్డర్ నుండి కొనుగోలు చేసేటప్పుడు సాధారణ ప్రజలకు వారి హక్కులు విధుల గురించి అవగాహన కల్పించడానికి మూడు కరపత్రాలను  కూడా రూపొందించారు.

 

ఎలక్ట్రికల్ ఇన్ స్టలేషన్ ల్లో భద్రతపై హ్యాండ్ బుక్ ని బి ఐ ఎస్ , ఇంటర్నేషనల్ కూపర్ అసోసియేషన్ (ఐ సి ఎ) ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ హ్యాండ్ బుక్ వద్యుత్ భద్రత గురించి అవగాహన కల్పిస్తుంది భవనాల్లో వైరింగ్ ఇన్ స్టలేషన్ ల కోసం సాంకేతిక సహాయాన్ని (టెక్నికల్ గైడెన్స్) అందిస్తుంది. హ్యాండ్ బుక్ లో ఇవ్వబడ్డ డిజైన్, ఇన్ స్టలేషన్ , ఇతర ఫీచర్లు వాటి ఉద్దేశాన్ని, అన్వయింప చేయడాన్ని

సరళమైన రీతిలో అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. సురక్షితమైన , విశ్వసనీయమైన ఎలక్ట్రికల్ లో వోల్టేజ్ ఇన్ స్టలేషన్ ల కోసం ప్రాథమిక అవసరం,  ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఎలక్ట్రికల్ ఇంజినీర్ లు , టెక్నీషియన్ లకు ఇది సాయపడుతుంది.

 

నేషనల్ బిల్డింగ్ కోడ్ ఆఫ్ ఇండియా 2016 (ఎన్ బి సి 2016) అనేది ఒక టెక్నికల్ డాక్యుమెంట్, దీని పరిధి లో  భవనాల ప్లానింగ్, డిజైన్, నిర్మాణం ,ఆపరేషన్ ,మెయింటెనెన్స్ కు సంబంధించిన అన్ని నిబంధనలు ఉంటాయి. ఈ కోడ్ నిబంధనలను అమలు చేయడం వల్ల భవంతుల భద్రత, ఆరోగ్యం, సౌకర్యాలు, ప్రాప్యత , సుస్థిరత కు సంబంధించి కనీస అవసరమైన స్థాయిని ధృవీకరిస్తుంది. ఎన్ బి సి 2016 వినియోగాన్ని ప్రోత్సహించడం కోసం నియమావళిని ఉపయోగించడం కోసం ఈ సరళీకృత గైడ్ ని విద్యావేత్తలు, విద్యార్థులు, బిల్డింగ్ అథారిటీలు, బిల్డర్ లు , మరీ ముఖ్యంగా ఆర్కిటెక్ట్ లు, ఇంజినీర్ లు, ప్లంబర్ లు మొదలైన బిల్డింగ్ ప్రొఫెషనల్స్ వంటి భాగస్వాముులందరు కోడ్ లోని వివిధ పార్టులు/సెక్షన్ ల వివరాలు, వాటి పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి బి ఐ ఎస్ ద్వారా తీసుకు వచ్చారు. 2200 పేజీలకు పైగా ఉన్న బృహత్తర నియమావళిలో అందించబడిన సాంకేతిక సమాచారాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి, ఎన్ బి సి 2016 పదమూడు భాగాలలో ప్రతిదానికి సంబంధించిన కీలక విషయాలు , వివరణ ను ఇన్ఫోగ్రాఫిక్స్ , సరళీకృత భాషను ఉపయోగించి బుక్ లెట్ లో పొందుపరిచారు.

 

ఈ మూడు కరపత్రాలు పురపాలక సంఘాలు, చట్టబద్ధమైన అధికారుల నుండి మాత్రమే కాకుండా, సురక్షితమైన ,స్థిరమైన ఇంటి కోసం భవన నిర్మాణ నిపుణుల (ఇంజనీర్, వాస్తుశిల్పి, మొదలైన వారు ) నుండి కూడా మెరుగైన సేవలను పొందే మార్గాలపై మార్గనిర్దేశం చేస్తాయి. ఈ కరపత్రాలు హిందీ ఇంగ్లిష్ రెండింటిలోనూ ప్రచురించబడ్డాయి వీటి శీర్షికలు: ఇంటి యజమానులకు గైడ్ - సిరీస్ 1 బిల్డింగ్ పర్మిట్ ప్రాసెస్, గైడ్ ఫర్ హోమ్ ఓనర్స్ - సిరీస్ 2 -మీ ఇండిపెండెంట్ హౌస్ నిర్మాణం, గైడ్ ఫర్ హోమ్ ఓనర్స్ - సిరీస్ 3 -డెవలపర్ / బిల్డర్ నుండి ఒక అపార్ట్ మెంట్ కొనుగోలు చేయడం.

 

ఫ్లో ఛార్ట్ , చెక్ లిస్ట్ ల సాయంతో, ఈ కరపత్రాలు అభివృద్ధి లేదా భవన నిర్మాణం కొరకు అథారిటీ నుంచి పర్మిట్ లను పొందే ప్రక్రియను వివరిస్తాయి, ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు లేదా నిర్మించేటప్పుడు వారు ధృవీకరించాల్సిన వివిధ అంశాల గురించి ఇంటి యజమానులు , గృహ కొనుగోలుదారులకు మార్గనిర్దేశం చేస్తాయి.

 

బిఐఎస్ రూపొందించిన ప్రమాణాల సాంకేతిక కంటెంట్ ,వినియోగాన్ని సామాన్య ప్రజానీకం సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఈ మాన్యువల్స్ లోని కంటెంట్ లు స్పష్టంగా ఉండేలా చూడటం కోసం ప్రత్యేక శ్రద్ధ శ్రద్ధ తీసుకున్నారు.

***



(Release ID: 1858832) Visitor Counter : 127