జల శక్తి మంత్రిత్వ శాఖ

'వాటర్ హీరోస్: షేర్ యువర్ స్టోరీస్" పోటీ 2022 ఆగస్టు నెల విజేతలను ప్రకటించిన జల్ శక్తి మంత్రిత్వ శాఖ


జల పరిరక్షణ, జల వనరుల సుస్థిర అభివృద్ధికి సహకరించిన ఆరుగురు విజేతలకు ఒక్కొక్కరికి 10000 రూపాయల నగదు,, సర్టిఫికెట్ ప్రధానం

Posted On: 12 SEP 2022 10:15AM by PIB Hyderabad

జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన  జలవనరులు, నది అభివృద్ధి మరియు గంగా పునరుజ్జీవన శాఖ లు  'వాటర్ హీరోస్: షేర్ యువర్ స్టోరీస్' పోటీని నిర్వహిస్తున్నాయి. 01.12.2021న ప్రారంభమైన పోటీ . 3వ ఎడిషన్  30.11.2022న  మరియు MyGov పోర్టల్‌లో ముగుస్తుంది. 1వ ఎడిషన్ 01.09.2019 నుంచి  30.08.2020 వరకు,  2వ ఎడిషన్ 19.09.2020 నుండి 31.08.2021 వరకు నిర్వహించడం జరిగింది. 

నీటి విలువను గుర్తించి  ప్రోత్సహించడం మరియు జల  సంరక్షణ, జల  వనరుల స్థిరమైన అభివృద్ధి కోసం దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు మద్దతు సమీకరించాలన్న లక్ష్యంతో పోటీలు జరుగుతున్నాయి.దేశంలో జలవనరుల సంరక్షణ కోసం జరుగుతున్న కార్యక్రమాల్లో ఎక్కువ మంది ప్రజలు పాల్గొనేలా చేయాలన్న  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా జల శక్తి మంత్రిత్వ శాఖ పోటీలను ప్రారంభించింది. జల  సంరక్షణ కోసం కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలు అనుసరిస్తున్న విధానాలు, కార్యక్రమాలపై ప్రజలకు  అవగాహన కల్పించడం ద్వారా  జల సంరక్షణ కార్యక్రమాలు అమలు జరిగేలా చూసేందుకు దోహదపడే విధంగా అన్ని వర్గాల ప్రవర్తనలో మార్పు తేవాలన్న లక్ష్యంతో 'వాటర్ హీరోస్: షేర్ యువర్ స్టోరీస్" పోటీని ప్రారంభించారు. 

2022 ఆగస్టు నెలలో నిర్వహించిన పోటీలో ఆరుగురు విజేతలుగా నిలిచారు. ప్రతి ఒక్క విజేతకు 10,000 నగదు పురస్కారం, సర్టిఫికెట్ అందిస్తారు. విజేతల వివరాలు.. 

1. దివ్యాన్ష్ టాండన్:


  మీరట్‌కు చెందిన  దివ్యాన్ష్ టాండన్   "పాని పంచాయితీ" పేరుతో నిర్వహించబడుతున్న ప్రచారంలో పాల్గొంటున్నారు. ప్రచారంలో భాగంగా  వివిధ గ్రామాలు, వీధులు, పట్టణాలు, పాఠశాలలు, ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సారథి సాంఘిక సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు (మీరట్ కంటోన్మెంట్ ) గా  దివ్యాన్ష్ టాండన్ పనిచేస్తున్నారు. 

2.  వినయ్ విశ్వనాథ్ గవాస్

  గోవా కి చెందిన ఒక సంస్థ   ప్రాజెక్టు డైరెక్టర్ గా వినయ్ విశ్వనాథ్ గవాస్ వ్యవహరిస్తున్నారు.  గోవాలోని కేరి సత్తారిలోని కెలవాడే గ్రామంలో వర్షం నీటిని సంరక్షించేందుకు ఇళ్ల  పైకప్పుపై రెయిన్వాటర్ హార్వెస్టింగ్ విధానాలు,  గొట్టపు బావుల రీఛార్జ్ అంశాలపై సంస్థ గురించి ప్రచారంనిర్వహిస్తోంది.  ప్రాజెక్ట్ TERI సహకారంతో అమలు జరుగుతున్నది. 

3.  అమిత్

 ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లోని మలక్‌పురా, జలోన్‌ గ్రామ ప్రధాన్ అయిన అమిత్  ఢిల్లీలో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడం, మొక్కలు నాటడం , పర్యావరణ పరిరక్షణ మరియు అవక్షేపణ కార్యక్రమాల ద్వారా నీటి శుద్ధి వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఆయన చేపట్టి అమలు చేస్తున్నారు. 

4.  బబితా రాజ్‌పూత్ ఘువారా

  మధ్యప్రదేశ్‌లోని చత్తర్‌పూర్‌ కి చెందిన  బబితా రాజ్‌పూత్ ఘువారా నాలుగు చెక్ డ్యామ్‌లు మరియు రెండు అవుట్‌లెట్ల నిర్మాణంలో పాలుపంచుకున్నారు.  బోరి బంధం కార్యక్రమాన్ని  బబితా రాజ్‌పూత్ ఘువారా  రూపొందించారు. 

5. అనురాగ్ పటేల్

  బండా జిల్లా మేజిస్ట్రేట్ గా పనిచేస్తున్న అనురాగ్ పటేల్ నీటి సంరక్షణ కోసం  రెండు ముఖ్యమైన ప్రచారాలను నిర్వహించారు.  'జల్ సంచయ్, జీవన్ సంచయ్' మరియు 'జల్ కుంభీ హటావో-తలాబ్ బచావో అభియాన్' పేరిట ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. 126 చెరువుల్లో పూడికతీత పనులు చేపట్టారు. లోతును పెంచడం  ద్వారా చంద్రవాల్ నదిని పునరుద్ధరించడానికి అనురాగ్ పటేల్   కృషి చేశారు. ఆయన కృషితో మీర్జాపూర్‌లో 664, జనపద్‌ ఫరూఖాబాద్‌లో 101 చెరువులు పునరుద్ధరించబడ్డాయి.

6.  స్నేహలతా శర్మ

 శివపురి జిల్లా బదర్వాస్, పిపరోధా గ్రామ  బ్లాక్‌కు చెందిన స్నేహలత శర్మ గత 1 సంవత్సరం నుండి నీటి సంరక్షణ మరియు నిర్వహణ రంగంలో గణనీయమైన మరియు ప్రశంసనీయమైన కృషి  చేస్తున్నారు. నీరు మరియు దాని పరిరక్షణ గురించి గ్రామం చుట్టూ అవగాహన కల్పించడం కోసం ఆమె మహిళలను ప్రోత్సహిస్తున్నారు. తక్కువ నీటిని వినియోగించే పంటలపై కూడా ఆమె అవగాహన కల్పించారు.

 

 ప్రతి నెలా పోటీ నిర్వహించబడుతుంది. దీనిని  MyGov పోర్టల్‌లో చూడవచ్చు. పోటీలో పాల్గొనడానికి, నీటి సంరక్షణ ప్రయత్నాలపై వారి విజయగాథలను 1-5 నిమిషాల వీడియో రూపంలో పోస్ట్ చేయాలి, దానితో పాటు 300 పదాలు మించకుండా వ్యాసాన్ని  ప్రయత్నాలను వివరించే కొన్ని ఫోటోగ్రాఫ్‌లు/ఫోటోలను జతచేయాలి. పోటీలో  పాల్గొనేవారు MyGov పోర్టల్ (www.mygov.in)లో తమ వీడియోలను (వారి యూట్యూబ్ వీడియో లింక్‌తో) షేర్ చేయవచ్చు. waterheroes.cgwb[at]gmail[dot]com లో ఎంట్రీలను సమర్పించవచ్చు

***



(Release ID: 1858685) Visitor Counter : 109