వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అభివృద్ధి చెందిన దేశంగా భారత్ తన ప్రయాణాన్ని వేగవంతం చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల భాగస్వామ్యం ఎంతగానో సహాయపడుతుంది: శ్రీ పీయూష్ గోయల్


టైర్ 2, టైర్‌ 3 నగరాలతో పాటు మారుమూల ప్రాంతాలలో స్టార్టప్‌లకు మెంటార్ మరియు సపోర్ట్ చేయడానికి పాలో ఆల్టోలో ఎస్‌ఈటియు ప్రారంభించబడింది: శ్రీ పీయూష్ గోయల్

పెట్టుబడి మరియు వాణిజ్య ప్రోత్సాహక సంస్థల మధ్య సమన్వయం భారతదేశ విస్తరణలో గణనీయమైన మార్పును కలిగిస్తుంది: శ్రీ పీయూష్ గోయల్

Posted On: 11 SEP 2022 11:45AM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈ రోజు మాట్లాడుతూ.. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయుల మధ్య భాగస్వామ్యం అభివృద్ధి చెందిన దేశంగా భారతదేశ ప్రయాణాన్ని వేగవంతం చేయడంలో సహాయపడుతుందని అన్నారు. అమెరికా పర్యటనలో చివరి రోజైన ఈరోజు ఆయన లాస్ ఏంజెల్స్‌లో మీడియాతో మాట్లాడారు.

యుఎస్‌లోని భారతీయ కమ్యూనిటీకి చెందిన వ్యాపారవేత్తలు మరియు పెట్టుబడిదారులతో  తాను జరిపిన చర్చల గురించి మంత్రి మాట్లాడుతూ..వారు తమ అనుభవాలను పంచుకున్నారని అనేక సూచనలను అందించారని చెప్పారు. భారతదేశ అభివృద్ధి భాగస్వామ్యంలో వారు వాటాదారులుగా ఉంటామని శ్రీ గోయల్ విశ్వాసం వ్యక్తం చేశారు. డయాస్పోరా సభ్యులు వారు ఎంచుకున్న వృత్తిలో చాలా విజయవంతమవుతారని..ప్రతి ఒక్కరు యునైటెడ్ స్టేట్స్ సమాజం మరియు ఆర్థిక వ్యవస్థలో ఒక ముద్ర వేశారని ఆయన తెలిపారు.

ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ..అమెరికా నుండి వచ్చిన ఆలోచనలు మరియు వ్యవస్థాపకులు భారతదేశంలోని వాటాదారులకు అనుసంధానించడంలో ప్రభుత్వం పోషించగల కొన్ని పాత్రలకు సంబంధించి అనేక సూచనలు ఉన్నాయని చెప్పారు. ఆ క్రమంలో భారత్ ఇప్పటికే రెండు కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను హ్యాండ్‌హోల్డ్ చేసే ఇన్వెస్ట్ ఇండియా మరియు భారతదేశంలో స్టార్టప్‌లకు మద్దతు ఇచ్చే చాలా శక్తివంతమైన స్టార్టప్ ఇండియా బృందం. భారతదేశం మరియు విదేశాలలోని పెట్టుబడిదారులతో కనెక్ట్ అవ్వడానికి మరియు ఇంక్యుబేటర్లు, యాక్సిలరేటర్‌లు, శిక్షణ మరియు నైపుణ్యం సౌకర్యాలను ఏర్పాటు చేయడంలో వారికి సహాయపడుతుందని మంత్రి వివరించారు.

వాణిజ్య శాఖకు చెందిన ప్రతిపాదిత పునర్నిర్మాణాన్ని ప్రస్తావిస్తూ స్వాతంత్ర్యం మరియు స్వయంప్రతిపత్తివంటి ఆంశాలతో ఇన్వెస్ట్ ఇండియాకు సమానమైన వాణిజ్య ప్రమోషన్ బాడీని ఏర్పాటు చేయడం గురించి ఆలోచిస్తున్నట్లు శ్రీ గోయల్ తెలిపారు. ఇది భారతదేశం నుండి వాణిజ్యాన్ని ప్రోత్సహించే సులభతర యూనిట్‌గా ఉపయోగపడుతుందని, ఈ పెట్టుబడి ప్రోత్సాహం మరియు వాణిజ్య సులభతర సంస్థలు కలిసి  ఔట్రీచ్‌లో గణనీయమైన మార్పును కలిగిస్తాయని ఆయన అన్నారు.

పాలో ఆల్టో-సేతులో తాను ప్రారంభించిన స్టార్ట్ అప్ కార్యక్రమం అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉందని మంత్రి వివరించారు.  ఈ ఆలోచనను రంగాల వారీగా అభివృద్ధి చేసినట్టయితే టైర్ 2, మరియు టైర్3 నగరాలతో పాటు మారుమూల ప్రాంతాల్లో కూడా స్టార్టప్‌లకు మార్గదర్శకంగా మరియు మద్దతుగా  సహాయపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. సామాన్యుల జీవితాన్ని సులభతరం చేసే ఆలోచనలు కలిగిన అనేక మంది యువకులు మన వద్ద ఉన్నారన్నారు. ఈ సేతు  పెట్టుబడిదారులతో వ్యవస్థాపకులు మరియు ఆలోచనలను అనుసంధానించడం ద్వారా వారికి సహాయపడుతుందని తాను ఖచ్చితంగా భావిస్తున్నట్టు చెప్పారు.

అంతకుముందు రోజు ఆయన లాస్ ఏంజెల్స్‌లోని శ్రీ స్వామినారాయణ ఆలయాన్ని సందర్శించి దక్షిణ కాలిఫోర్నియాలోని వ్యాపార సంఘంతో సంభాషించారు.

వెంచర్ క్యాపిటలిస్టులు మరియు శాన్ ఫ్రాన్సిస్కోలోని సింగులారిటీ యూనివర్సిటీ ప్రతినిధుల సమావేశంతో మంత్రి తన అమెరికా పర్యటనను ముగించారు.

“డిజిటలైజేషన్ భారతదేశ వృద్ధికి ఎలా శక్తిని ఇస్తుందో హైలైట్ చేసింది. భారతదేశ కథ కోసం పిచ్ చేయబడింది మరియు ఈ పరివర్తన ప్రయాణంలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించాము” అని ఆయన ట్వీట్ చేశారు.

 — పీయూష్ గోయల్ (@PiyushGoyal) సెప్టెంబర్ 11, 2022

 

image.png

 

image.png

***



(Release ID: 1858569) Visitor Counter : 133