రక్షణ మంత్రిత్వ శాఖ
ఎయిర్‌వారియర్స్‌కు ఆర్థిక పొదుపు, అవగాహన కల్పించేందుకు సెమినార్
Posted On:
10 SEP 2022 2:32PM by PIB Hyderabad
ఎయిర్ వారియర్స్ (వైమానిక దళ పోరాట యోధుల)కు వ్యక్తిగత స్థాయిలో ఆర్థిక ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైన నిశితమైన అంశాలపై అవగాహన కల్పించే యత్నంలో భాగంగా భారత వైమానిక దళం 09 సెప్టెంబర్ 2022న సహేతుకమైన వర్తమాన ఆర్థిక సమస్యలపై ఒకరోజు సెమినార్‌ను నిర్వహించింది. ఫైనాన్షియల్ ప్రూడెన్స్ అండ్ అవేర్‌నెస్ ఫర్ ఎయిర్ వారియర్స్ (వైమానిక దళ పోరాట యోధులకు ఆర్థిక పొదుపు, అవగాహన) అన్న శీర్షికతో ఆర్‌బిఐ సహకారంతో భారత వైమానిక దళం న్యూఢిల్లీలోని ఎయిర్‌ఫోర్స్ ఆడిటోరియంలో సెమినార్ ను నిర్వహించింది.
తమ వ్యక్తిగత జీవితాలలో ఎయిర్ వారియర్స్ మంచి, చైతన్యంతో కూడిన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు వారికి తోడ్పడాలన్నది సెమినార్ ఉద్దేశ్యం. ఆర్థిక చైతన్యం, బ్యాంక్ మోసాలు, ఆంబుడ్స్‌మాన్ పాత్ర సహా విభిన్న అంశాలపై ఆర్ బిఐ అధికారులు చర్చలను నిర్వహించారు. ఎస్‌బిఐ, ఇతర ఆర్థిక నిపుణులు కూడా ఈ కృషికి తోడ్పడి ఎయిర్ వారియర్స్‌కు బహుముఖీయంగా వారికి అవగాహన కల్పించారు.
అన్ని ర్యాంకులకు చెందిన దాదాపు 400 ఎయిర్ వారియర్స్ ఈ సెమినార్‌కు హాజరయ్యారు. వారు ఉన్న ప్రాంతంతో సంబంధం లేకుండా ఈ సెమినార్ గరిష్టంగా అన్ని ఎయిర్ ఫోర్స్ యూనిట్లు, ఫార్మేషన్లను చేరుకుని, వారు వీక్షించేందుకు ప్రత్యక్ష ప్రసారం చేశారు.
***
(Release ID: 1858326)
Visitor Counter : 156