గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

దీనదయాళ్ అంత్యోదయ యోజన-జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పరిధిలోకి రాని కుటుంబాలను అందులోకి తీసుకురావడానికి సామాజిక సమీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది


7 సెప్టెంబర్, 2022 నుండి దేశవ్యాప్తంగా 15 రోజుల కార్యక్రమం కొనసాగుతోంది

Posted On: 09 SEP 2022 12:23PM by PIB Hyderabad

గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 34 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని పేద గ్రామీణ మహిళలను మహిళా స్వయం సహాయక బృందాలుగా (ఎస్‌హెచ్‌జి) సమీకరించే ప్రక్రియను వేగవంతం చేయడానికి 2022 సెప్టెంబర్ 7 నుండి 20 వరకు దేశవ్యాప్తంగా 15 రోజుల ప్రచారాన్ని నిర్వహిస్తోంది.

ప్రచార సమయంలో ప్రతి గ్రామం నుండి మహిళా సంస్థలు సామాజిక సమీకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. ఇక్కడ ప్రతి సభ్యురాలు వారితో పాటు నాన్‌ఎస్‌హెచ్‌జి సభ్యురాలైన స్నేహితురాలిని లేదా పొరుగువారిని తీసుకువస్తారు.డిఎవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎంలలో భాగం కావడం వల్ల కలిగే ప్రయోజనాలను వారికి వివరిస్తారు. ఇప్పటివరకూ సభ్యులు కానివారు అందులో చేరడానికి ప్రేరేపించబడినవారు ఈ కమ్యూనిటీ సంస్థలతో అనుసంధానించబడతారు. మారుమూల గ్రామ పంచాయతీల్లోని మహిళలకు చేరువయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా బ్లాక్ స్థాయి సిబ్బంది ప్రత్యేక వ్యూహాలను కూడా సిద్ధం చేస్తున్నారు.

ఎస్‌హెచ్‌జీలను ఉన్నత స్థాయి సమాఖ్యలలో చేర్చేలా చూడటం కూడా ఈ కార్యక్రమ లక్ష్యం; టైర్ టూ లెవల్ విలేజ్ ఆర్గనైజేషన్స్ (విఓఎస్) మరియు టైర్ త్రీ లెవెల్ క్లస్టర్ లెవెల్ ఫెడరేషన్స్ (సిఎల్‌ఎఫ్‌ఎస్‌).

ఇటువంటి సమాఖ్య నిర్మాణాలు జీవనోపాధి మరియు సామాజిక అభివృద్ధికి చెందిన కార్యక్రమాలకు దారితీస్తాయని తద్వారా పేదల సంఘాలు నిర్వహణ సంస్థలుగా పరిణామం చెందుతాయని మంత్రిత్వ శాఖ భావన. ఏర్పాటైన ఏడు రోజుల్లో అన్ని ఎస్‌హెచ్‌జిలు, విఓలు మరియు సిఎల్‌ఎఫ్‌లకు బ్యాంకు ఖాతాలు తెరవబడతాయి.

ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని సెప్టెంబర్ 5వ తేదీన గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ నాగేంద్ర నాథ్ సిన్హా ప్రకటించారు. ఆగస్టు 31 నాటికి డిఏవై-ఎన్‌ఆర్‌ఎల్‌ఎం ఫోల్డ్ కింద 8.5 కోట్ల కుటుంబాలు 78.33 లక్షల స్వయం సహాయక సంఘాలతో అనుసంధానించబడ్డాయి.


 

****



(Release ID: 1858164) Visitor Counter : 127