ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రెవెన్యూ లోటు గ్రాంట్ రూ.7,183.42 కోట్లు 14 రాష్ట్రాలకు విడుదల


ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం రెవెన్యూ లోటు
గ్రాంట్ రూ. 43,100.50 కోట్లు

2022-23లో రాష్ట్రాలు మొత్తం రెవెన్యూ లోటు గ్రాంట్ రూ.86,201 కోట్లు

Posted On: 06 SEP 2022 1:53PM by PIB Hyderabad

ఆర్థిక మంత్రిత్వ శాఖ వ్యయ విభాగం మంగళవారం పోస్ట్ డెవల్యూషన్ రెవిన్యూ డెఫిసిట్ (పీడీఆర్డి) గ్రాంట్ 6వ నెలవారీ వాయిదాను విడుదల చేసింది. 14 రాష్ట్రాలకు రూ.7,183.42 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ఈ గ్రాంట్‌ విడుదలైంది. పదిహేనవ ఆర్థిక సంఘం మొత్తం డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి 14 రాష్ట్రాలకు రూ.86,201 కోట్లు విడుదల చేసింది. సిఫార్సు చేసిన  గ్రాంట్‌ను 12 సమానమైన నెలవారీ వాయిదాలలో సిఫార్సు రాష్ట్రాలకు వ్యయ శాఖ విడుదల చేస్తుంది. 2022 సెప్టెంబర్ నెలలో 6వ విడత విడుదల చేయడంతో, 2022-23లో రాష్ట్రాలకు విడుదల చేసిన రెవెన్యూ లోటు గ్రాంట్ల మొత్తం రూ. 43,100.50 కోట్లు.

విభజన తర్వాత రెవెన్యూ లోటు గ్రాంట్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ 275 ప్రకారం రాష్ట్రాలకు కేటాయిస్తారు.  రాష్ట్రాల రెవెన్యూ ఖాతాలలోని అంతరాన్ని తీర్చడానికి వరుసగా వచ్చిన ఫైనాన్స్ కమిషన్‌ల సిఫార్సుల మేరకు గ్రాంట్లు రాష్ట్రాలకు విడుదల అవుతాయి.
 

2020-21 నుండి 2025-26 వరకు రాష్ట్రాలు ఈ గ్రాంట్‌ని స్వీకరించడానికి అర్హత, గ్రాంట్ పరిమాణాన్ని పదిహేనవ ఆర్థిక సంఘం అంచనా వేసిన తర్వాత రాష్ట్ర ఆదాయ మరియు వ్యయాల మదింపు మధ్య అంతరం ఆధారంగా నిర్ణయించింది. 

2022-23లో పదిహేనవ ఆర్థిక సంఘం ద్వారా డివల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్‌ను సిఫార్సు చేసిన రాష్ట్రాలు: ఆంధ్రప్రదేశ్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్.

2022-23కి సిఫార్సు చేయబడిన పోస్ట్ డెవల్యూషన్ రెవెన్యూ లోటు గ్రాంట్ మరియు 6వ విడతగా రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

 రాష్ట్రాల వారీగా డెవల్యూషన్ అనంతర రెవెన్యూ లోటు గ్రాంట్  (పీడీఆర్డిజి )   విడుదల 

 

(రూ. కోట్లలో)

క్రమ సంఖ్య 

రాష్ట్రం 

సెప్టెంబర్ నెలకు గాను విడుదల చేసిన 6వ వాయిదా 

2022-23లో రాష్ట్రాలకు విడుదల చేసిన మొత్తం పీడీఆర్డిజి 

1

ఆంధ్రప్రదేశ్ 

879.08

5274.50

2

అస్సాం 

407.50

2445.00

3

హిమాచల్ ప్రదేశ్ 

781.42

4688.50

4

కేరళ 

1097.83

6587.00

5

మణిపూర్ 

192.50

1155.00

6

మేఘాలయ 

86.08

516.50

7

మిజోరాం 

134.58

807.50

8

నాగాలాండ్ 

377.50

2265.00

9

పంజాబ్ 

689.50

4137.00

10

రాజస్థాన్ 

405.17

2431.00

11

సిక్కిం 

36.67

220.00

12

త్రిపుర 

368.58

2211.50

13

ఉత్తరాఖండ్ 

594.75

3568.50

14

పశ్చిమ బెంగాల్ 

1132.25

6793.50

 

****


(Release ID: 1857371) Visitor Counter : 196