వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

భారత్-అమెరికాల మధ్య ఉన్న "నమ్మకమైన భాగస్వామ్యం" ట్రేడ్, టెక్ అండ్ టాలెంట్ అనే 3 పిల్లర్లపై ఆధారపడి ఉంది - శ్రీ పీయూష్ గోయల్

Posted On: 06 SEP 2022 4:21PM by PIB Hyderabad

వాణిజ్యం, సాంకేతికత,ప్రతిభ అనే మూడు స్తంభాలపై ఆధారపడి భారత్-అమెరికా మధ్య 'నమ్మకమైన భాగస్వామ్యం' ముందుకు సాగుతుందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజా పంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తెలిపారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మంత్రి మీడియాతో మాట్లాడుతూ.." ప్రముఖ వ్యాపార నిపుణులు, సిఈఓలు, పరిశ్రమల సీనియర్ అధికారులు, స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలు, వెంచర్ క్యాపిటలిస్ట్‌లు మొదలైన వారితో  సంభాషించాను. ఈ సమావేశంలో వారు భారతదేశంతో పనిచేసిన అనుభవాలను పంచుకున్నారు. అలాగే భారతదేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అవసరమైన సూచనలు, భారత్‌లోకి పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచడం, దేశంలో ఉద్యోగాల కల్పన పరంగా యూఎస్‌తో ఒప్పందాల గురించి కొత్త ఆలోచనలను అందించారు"అని తెలిపారు. భారత్‌తో కలిసి పనిచేయడానికి వారిలో ఉన్న అసాధారణ ఉత్సాహాన్ని గుర్తించి శ్రీ గోయల్ సంతోషం వ్యక్తం చేశారు.

శాన్ ఫ్రాన్సిస్కోలో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించడంతో మంత్రి తన రోజును ప్రారంభించారు. అనంతరం గదర్ మెమోరియల్ హాల్‌ను సందర్శించారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత యునైటెడ్ స్టేట్స్‌లోని 6 ప్రాంతాలలో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసిఏఐ)ని కూడా ప్రారంభించారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో జిఐటిపిఆర్‌ఓ (గ్లోబల్ ఇండియన్ టెక్నాలజీ ప్రొఫెషనల్స్ అసోసియేషన్స్) మరియు ఎఫ్‌ఐడిఎస్‌ (ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పోరా స్టడీస్) నాయకత్వంతో  శ్రీ పీయూష్ గోయల్ సంభాషించారు. 'ఇండియా స్టోరీ'ని ఆమోదించాలని అలాగే భారతదేశాన్ని ఒక ప్రాధాన్య పెట్టుబడి గమ్యస్థానంగా మార్చాలని శ్రీ గోయల్ టెక్ కమ్యూనిటీకి పిలుపునిచ్చారు. గ్రోత్ స్టోరీ ఆఫ్ ఇండియాలో భాగం కావాలని వారిని ప్రోత్సహించిన శ్రీ గోయల్..భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి, కార్యకలాపాలను ఏర్పాటు చేయడానికి వారిని ఆహ్వానించారు.

శ్రీ పీయూష్ గోయల్ శాన్ ఫ్రాన్సిస్కోలోని యూఎస్‌ ఇండియా స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ ఫోరమ్ (యూఎస్‌ఐఎస్‌పిఎఫ్‌)తో కూడా సంభాషించారు.

 

 

WhatsApp Image 2022-09-06 at 15.59.42.jpeg



సెప్టెంబర్ 5 నుండి 10వ తేదీ వరకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో మరియు లాస్ ఏంజెల్స్‌లలో కేంద్ర మంత్రి  పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్‌-యుఎస్ వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్ సదస్సుతో పాటు ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపిఇఎఫ్) మంత్రివర్గ సమావేశానికి మంత్రి హాజరవుతారు.

 

 

****

 



(Release ID: 1857362) Visitor Counter : 105