రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భార‌త్‌ను సంద‌ర్శించే ర‌వాణాయేత‌ర మోటారు వాహ‌నాల నిబంధ‌న‌లు, 2022 నోటిఫికేష‌న్ జారీ

Posted On: 05 SEP 2022 1:17PM by PIB Hyderabad

 రోడ్డు ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ 02.09.2022 నాటి జిఎస్ఆర్ 680(ఇ) నోటిఫికేష‌న్‌ను అనుస‌రించి మోటార్ వెహికిల్స్ నాన్ ట్రాన్స్‌పోర్ట్ వెహికిల్స్ విజిటింగ్ ఇండియా రూల్స్ (భార‌త్‌కు వ‌చ్చే ర‌వాణాయేత‌ర మోటారు వాహ‌నాల నిబంధ‌న‌లు),2022ను జారీ చేసింది. ఇత‌ర దేశాల‌లో రిజిస్ట‌ర్ అయిన ర‌వాణాయేత‌ర (వ్య‌క్తిగ‌త‌) వాహ‌నాలు భార‌త దేశంలోకి ప్ర‌వేశించేట‌ప్పుడు లేదా దేశ భూభాగంలో చ‌రిస్తున్న  వాటి క‌ద‌లిక‌ల‌ను ఈ నిబంధ‌న‌లు అధికారికం చేస్తాయి. 
దేశంలో ఉన్న స‌మ‌యంలో ఈ వాహ‌నాల‌ను న‌డుపుతున్న‌ప్పుడు ఈ నిబంధ‌న‌ల కింద దిగువ‌న పేర్కొన్న ప‌త్రాల‌ను వాహ‌నంలో ఉంచుకోవాలి. అవి -

ఎ) చెల్లుబాటు అయ్యే రిజిస్ట్రేష‌న్ స‌ర్టిఫికెట్‌;
బి) చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు లేదా అంత‌ర్జాతీయ డ్రైవింగ్ ప‌ర్మిట్, ఏది వ‌ర్తిస్తే అది
సి) చెల్లుబాటు అయ్యే ఇన్సూరెన్స్ పాల‌సీ
డి) చెల్లుబాటు అయ్యే కాలుష్య నియంత్ర‌ణ స‌ర్టిఫికెట్ (మూల దేశంలో వ‌ర్తిస్తే)
ఒక‌వేళ పైన పేర్కొన్న ప‌త్రాలు ఇంగ్లీషు కాక వేరే భాష‌లో ఉంటే, దానిని జారీ చేసిన అధికార యంత్రాంగం వాటిని ధ్రువీక‌రించిన అధీకృత ఆంగ్ల అనువాదాన్ని అస‌లు ప‌త్రాల‌తో పాటు ఉంచుకోవాలి. 
భార‌త దేశంలో కాకుండా మ‌రే ఇత‌ర దేశంలో న‌మోదు చేసిన మోటారు వాహ‌నాల‌ను, భార‌త భూభా ప‌రిధిలో స్థానిక ప్యాసింజ‌ర్ల‌ను, వ‌స్తువుల‌ను ర‌వాణా చేసేందుకు అనుమ‌తించ‌రు. 
భార‌త‌దేశం కాకుండా ఇత‌ర దేశాల‌లో న‌మోదు చేసిన మోటారు వాహ‌నాలు భార‌త‌ మోటారు వాహ‌నాల చ‌ట్టం, 1988 కింద రూపొందించిన నియ‌మాలు నిబంధ‌న‌లకు లోబ‌డి, అందుకు అనుగుణంగా ఉండాలి.  
గెజెట్ నోటిఫికేష‌న్ కోసం దిగువ‌న క్లిక్ చేయండి

 

 


(Release ID: 1856961) Visitor Counter : 166