ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2022 విజేతలతో సెప్టెంబరు 5న ముచ్చటించనున్న ప్రధానమంత్రి

Posted On: 04 SEP 2022 1:29PM by PIB Hyderabad

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 సెప్టెంబర్ 5 న సాయంత్రం 4:30 గంటలకు 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌లో 2022కుగాను జాతీయ ఉపాధ్యాయ పురస్కారం-2022 విజేతలతో సంభాషిస్తారు.

 

కర్తవ్య నిబద్ధత, విశిష్ట కృషితో పాఠశాల విద్య నాణ్యతను మెరుగుపరచడమేగాక తమ విద్యార్థుల జీవితాలను సుసంపన్నం చేసిన అత్యుత్తమ ఉధ్యాయులను సత్కరించడమే ఈ జాతీయ అవార్డుల ప్రధానోద్దేశం.

దేశవ్యాప్తంగా గల ప్రాథమిక, మాధ్యమిక పాఠశాలల్లో  పనిచేస్తున్న  ప్రతిభావంతులైన ఉపాధ్యాయులకు ప్రజల గుర్తింపును ఈ జాతీయ ఉపాధ్యాయ అవార్డులు ప్రతిబింబిస్తాయి. ఈ సంవత్సరం పురస్కారాలకు పటిష్ట,  పారదర్శక ఆన్‌లైన్ ప్రక్రియను మూడు దశలలో  నిర్వహించారు. తద్వారా 45 మంది ఉపాధ్యాయులను ఈ పురస్కారం కోసం ఎంపిక చేశారు.

                            ***


(Release ID: 1856693) Visitor Counter : 141