ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
సైబర్ సురక్షిత్ భారత్ చొరవ కింద 30వ బ్యాచ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్లు (సిఐఎస్ఒ)లకు డీప్ డైవ్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎన్ఇజిడి, ఎంఇఐటివై
Posted On:
03 SEP 2022 10:40AM by PIB Hyderabad
భవిష్యత్తులో జరుగనున్న సైబర్ దాడులను ఎదుర్కొనేందుకు సంసిద్ధం కావడం కోసం, సంస్థలు తమ డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షంచుకోవడం సహా పెరుగుతున్న విపత్తును ఎదుర్కొనేందుకు తగిన భద్రతా చర్యలను నిర్ధారించడం కోసం ప్రభుత్వ శాఖల వ్యాప్తంగా ఫ్రంట్ లైన్ ఐటి అధికారులు, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అధికారుల (సిఐఎస్ఒలు) సామర్ధ్యాల నిర్మాణం కోసం, సైబర్ నేరాల గురించి అవగాహనను పెంచాలన్న లక్ష్యంతో సైబర్ సురక్షిత్ భారత్ చొరవను రూపకల్పన చేయడం జరిగింది.
అవగాహన, విద్య, సశక్తత అన్న సూత్రాలపై పని చేస్తూ, సామర్ధ్య నిర్మాణాల పథకం కింద నేషనల్ ఇ- గవర్నెన్స్ డివిజన్ (ఎన్ఇజిడి) ఆగస్టు 22-26, 2022 వరకు 30వ సిఐఎస్ఒ డీప్- డైవ్ (లోతైన విశ్లేషణ) శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించింది. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ (ఐఐపిఎ)లో నిర్వహించిన 5 -రోజుల శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల నియమిత సిఐఎస్ఒలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, పోలీసు, భద్రతా దళాల సాంకేతిక విభాగాలు, సిటిఒలు, సాంకేతిక/ పిఎంయు బృందాలు సహా ఆధీన సంస్థలు/ పిఎస్‌యులుతో పాటుగా తమ తమ సంస్థలలో ఐటి వ్యవస్థల భద్రతను సంరక్షించేందుకు బాధ్యులైన అధికారుల కోసం రూపకల్పన చేశారు.
సైబర్ దాడులను సమగ్రంగా, కూలంకషంగా అర్థం చేసుకునేలా సిఐఎస్ఒలు చైతన్యపరిచి, సశక్తం చేయడం ఈ డీప్ డైవ్ శిక్షణా కార్యక్రమ నిర్ధిష్ట లక్ష్యం. దీనితో పాటుగా, భద్రతకు సంబంధించిన తాజా సాంకేతికతల పట్ల అవసరమైన అవగాహన, వ్యక్తిగత సంస్థలు, పౌరులకు స్థూలమైన ఇ- మౌలిక సదుపాయాల ప్రయోజనాలను అందించడం కూడా ఈ లక్ష్యంలో భాగం. ఈ శిక్షణ చట్టపరమైన నిబంధనల సమగ్ర దృక్పధాన్ని అందించడం, సైబర్ భద్రతా పరిధికి సంబంధించిన విధానాలను రూపకల్పన చేసేందుకు సిఐఎస్ఒలు సశక్తం చేయడం, నిర్ధిష్ట సైబర్ సంక్షోభ నిర్వహణ ప్రణాళికలను రూపొందించడానికి సిఐఎస్ఒలను సశక్తం చేస్తుంది.
ఈ కార్యక్రమ సెషన్‌కు ఎన్ఇజిడి పి&సిఇఒ శ్రీ అభిషేక్ సింగ్, ఐఐపిఎ డిజి శ్రీ ఎస్. ఎన్. త్రిపాఠి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వర్తమానంలో పెరుగుతున్న సైబర్ దాడుల దృష్ట్యా సైబర్ భద్రతా ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ తమ సంస్థల సైబర్ భద్రతా కృషికి మద్దతునివ్వడంతో పాటుగా సిఐఎస్ఒలు వినూత్నంగా, భవిష్యత్ దృష్టితో ఆలోచించవలసింది సిఐఎస్ఒలను శ్రీ త్రిపాఠి ప్రోత్సహించారు. వ్యక్తిగత స్థాయిలో సైబర్ భద్రత నిర్వహణ అవసరాన్ని నొక్కి చెప్తూ, పాల్గొన్న అందరు సిఐఎస్ ఒలను తగిన లైసెన్స్ డ్ సాఫ్ట్‌వేర్ ను ఉపయోగించవలసిందిగా తన సందేశంలో శ్రీ అభిషేక్ సింగ్ నొక్కి చెప్పారు. ఈ పరిధిలో భారత ప్రభుత్వ వివిధ చొరవలను, ముఖ్యంగా కీలక మౌలిక సదుపాయాలకు సంబంధించిన సంభావ్య సైబర్ బెదిరింపులను పరిష్కరించడానికి తక్షణమే స్పందించే నేషనల్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రొటెక్షన్ సెంటర్ (ఎన్‌సిఐఐపిసి)ని పట్టి చూపుతూ గుర్తు చేశారు. సైబర్ భద్రతకు సంబంధించిన కీలక అంశాలైన పాలనా విపత్తు, నిబద్ధత, అభివృద్ధి చెందుతున్న సైబర్ భద్రతా పోకడలు, భారతదేశంలో సైబర్ భద్రతా ఉత్పత్తుల క్షత్రం, నెట్‌వర్క్ భద్రత, సైబర్ క్రైసిస్ వర్క్‌ప్లేస్ ప్లాన్, అప్లికేషన్, డాటా భద్రత, క్లౌడ్ భద్రత, మొబైల భద్రత, క్రిప్టోగ్రఫీ, సైబర్ భద్రత పరీక్ష, ఆడిట్, ఐటి చట్టంలో సైబర్ భద్రతకు సంబంధించిన అంశాలు, ఐఎస్ ఒ 27001 సహా ఐఎస్ఎంఎస్ ప్రమాణాలు సహా వివిధ పరిశ్రమ, విద్య సంస్థలు, ప్రభుత్వం వైపు నుంచి విషయ పరిజ్ఞాన నిపుణులను ఈ శిక్షణా కార్యక్రమం ఒక చోటకు చేర్చింది. సెషన్ చివర్లో పాల్గొన్నవారు చేసిన ప్రభావవంతమైన ప్రెజెంటేషన్ సెషన్ పరస్పరం విషయాలను పంచుకునేందుకు తోడ్పడింది.
2018లో ప్రారంభించిన సిఐఎస్ఒ శిక్షణ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య (పిపిపి) నమూనాలో ప్రభుత్వ, పరిశ్రమల సహ వ్యవస్థకు సంబంధించిన ప్రత్యేక భాగస్వామ్యం. 2018 జూన్ నుంచి ఈ కార్యక్రమం తమతమ సంస్థల డిజిటల్ మౌలిక సదుపాయాలను, వ్యవస్థల భద్రత కోసం 1,224 సీనియర్ అధికారులను అర్హులను, సశక్తులను చేసింది.
***
(Release ID: 1856550)
Visitor Counter : 205