ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ

ఆగస్టు నెలలో 152.5 కోట్ల ఆధార్ కార్డు ప్రామాణికరణం


జూలై నెలలో 222.84 కోట్ల ఈ-కేవైసీ కార్యకలాపాలు

ప్రజల నుంచి అందిన వినతులతో 1.47 ఆధార్ కార్డులను నవీకరించిన యుఐడీఏఐ

జూలై నెలలో కొత్తగా ఆధార్ పొందిన 53 లక్షల మంది. దేశంలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వయోజనులు

నెలలో దాదాపు 12,511 కోట్ల మేరకు జరిగిన ఏపీబీ లావాదేవీలు

Posted On: 02 SEP 2022 4:06PM by PIB Hyderabad

దేశంలో ఆధార్ నమోదు, వినియోగం మరియు ఆమోద కార్యకలాపాలు వేగంగా సాగుతున్నాయి. 2022  జూలై  చివరి నాటికి దేశ ప్రజలకు  134.11 కోట్లకు పైగా ఆధార్ కార్డులు జారీ అయ్యాయి.

 జూలై నెలలో 1.47 కోట్ల మంది ఆధార్ మార్పుల కోసం దరఖాస్తు చేశారు. వీటిలో ప్రజల నుంచి అందిన వినతుల మేరకు 63.55 కోట్ల ఆధార్ కార్డులలో మార్పులు చేర్పులు చేసి నవీనీకరించడం జరిగింది. భౌగోళిక, బయో మెట్రిక్ మార్పుల కోసం ప్రజల నుంచి ఆధార్ కేంద్రాల నుంచి బౌతికంగా మరియు ఆన్‌లైన్ పద్దతిలో ధరఖాస్తులు అందాయి. 

జూలై నెలలో ఆధార్ ద్వారా 152.5 కోట్ల అధీకృత కార్యకలాపాలు జరిగాయి. వీటిలో ఎక్కువ శాతం ( 122.57 కోట్లు) వేలిముద్రల బయోమెట్రిక్ ప్రామాణీకరణ కార్యకలాపాలు జరిగాయి. భౌగోళిక అధీకృత కార్యకలాపాలు రెండో స్థానంలో నిలిచాయి. 

 2022 జూలై చివరి నాటికి ఆధార్ వినియోగించి మొత్తం 7885.24 కార్యకలాపాలు జరిగాయి. జూన్ చివరి నాటికి ఈ సంఖ్య 7702.74 కోట్లుగా ఉంది.

జూలై నెలలో కొత్తగా 53 లక్షల ఆధార్ కార్డులు జారీ అయ్యాయి. వీటిలో ఎక్కువ శాతం కార్డులను 18 సంవత్సరాల లోపు[ వయస్సు (0 నుంచి 18 మధ్య వయస్సు ఉన్నవారు) వయస్సు ఉన్నవారికి జారీ చేయడం జరిగింది.  దేశంలో వయో జనులందరూ దాదాపు ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. దేశంలో ఆధార్ కార్డు కలిగి ఉన్న వయోజనుల శాతం 93.42 వరకు ఉంది. 26 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో దాదాపు 90% మంది వయోజనులు ఆధార్ కార్డు కలిగి ఉన్నారు.  

డిజిటల్ వ్యవస్థ ద్వారా  సుపరిపాలనకు మార్గం సుగమం చేస్తున్నసౌకర్యాల్లో కీలకంగా ఉన్న ఆధార్ సౌలభ్య జీవన విధానం, సులభతరం వ్యాపార నిర్వహణకు దోహదపడుతోంది. గుర్తించిన లబ్ధిదారులకు  పారదర్శక విధానంలో సంక్షేమ పథకాల ఫలాలు అందేలా చూస్తున్న ఆధార్ వ్యవస్థ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖలు విభాగాల పనితీరు, సామర్థ్యం పెంపుదలకు అవకాశం కల్పిస్తోంది. దేశంలో దాదాపు 900 కి పైగా సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆధార్ తో అనుసంధానం చేసి అమలు చేస్తున్నాయి.   

 వంట గ్యాస్ సబ్సిడీ, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం,  జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద అందుతున్న ప్రయోజనాలను  ప్రత్యక్ష విధానంలో  బదిలీ అయ్యే అంశంలో  ఆధార్ పేమెంట్ బ్రిడ్జి  (APB) కీలక పాత్ర పోషిస్తోంది. జూలై నెలలో ఆధార్ పేమెంట్ బ్రిడ్జి  ద్వారా మొత్తం   12511 కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు జరిగాయి. 

 ప్రధానమంత్రి శ్రీ  నరేంద్ర మోడీ ప్రాధాన్యత ఇస్తున్న డిజిటల్ ఇండియా రూపకల్పన అంశంలో ఆధార్ కీలకమైన పాత్ర పోషిస్తోంది. ఈ-కేవైసీ, ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానం, ఆధార్ ఆధారిత ప్రత్యక్ష బదిలీ విధానం లాంటి ముఖ్యమైన కార్యకలాపాలు ఆధార్ ద్వారా సాగుతూ డిజిటల్ ఇండియా నిర్మాణం కోసం సహకరిస్తున్నాయి.  

 ఆధార్ ఆధారంగా జూలై నెలలో 22.84 కోట్ల   ఈ-కేవైసీ   లావాదేవీలు జరిగాయి.   జూన్‌లో 1226.39 కోట్లుగా ఉన్న ఈ-కేవైసీ లావాదేవీల సంచిత సంఖ్య  జూలైలో 1249.23 కోట్లకు పెరిగింది. ఆధార్ కలిగి ఉన్న వ్యక్తి నుంచి  సమ్మతి పొందిన తర్వాత ఈ-కేవైసీ   లావాదేవీ జరుగుతుంది. దీనివల్ల  పత్రాల సమర్పణ,  వ్యక్తిగత ధృవీకరణ అవసరం ఎక్కువగా ఉండదు. 

ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ  (AEPS) మరియు మైక్రో ATMల నెట్‌వర్క్ ద్వారా 1507 కోట్ల  బ్యాంకింగ్ లావాదేవీలు జరిగాయి . క్షేత్ర స్థాయిలో ఆర్థిక కార్యకలాపాల విస్తరణకు ఈ వ్యవస్థ అవకాశం కల్పించింది.  . ఒక్క జూలైలోనే భారతదేశ వ్యాప్తంగా 22.37 కోట్ల  ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ   లావాదేవీలు జరిగాయి.
గమనిక:  ఆధార్  విజయాలు మరియు పురోగతిపై యుఐడీఏఐ  నెలవారీ బులెటిన్‌ను ప్రారంభిస్తోంది. కొన్ని సమాచార వివరాలు  మారే అవకాశం ఉంది.

 

***



(Release ID: 1856374) Visitor Counter : 144