రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ర‌క్ష‌ణ శాఖ‌ పెన్షనర్లకు.. పించ‌న్ల డిజిటల్ పంపిణీ 'స్ప‌ర్ష్' ద్వారా న‌మోదు


- డిజిటల్ వేదిక మీద‌కు 5.6 లక్షల మంది పెన్షనర్లు వలస

Posted On: 02 SEP 2022 3:05PM by PIB Hyderabad

డిజిటల్ ఇండియా చొరవకు ప్రోత్సాహాన్ని అందిస్తూ.. ర‌క్ష‌ణ శాఖ 'సిస్టమ్ ఫర్ పెన్షన్స్ అడ్మినిస్ట్రేషన్ - రక్ష' లేదా 'స్ప‌ర్ష్'  ద్వారా ఆగస్టు, 2022 నెలలో  పెన్షనర్‌లకు రూ. 3,090 కోట్లకు పైగా పించ‌న్ల‌ను డిజిటల్ రూపంలో పంపిణీ చేసింది. ఇదే క్ర‌మంలో ఆగస్టు 2022 నెల‌లో మొత్తం 5,62,946 మంది ర‌క్ష‌ణ శాఖ పెన్షనర్లు 'స్ప‌ర్ష్'   డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లోకి విజయవంతంగా వ‌చ్చి చేరారు. దీంతో స్పర్ష్  వేదిక‌లో చేరిన మొత్తం పెన్షనర్ల సంఖ్య 11 లక్షలకు చేరింది. ఫ‌లితంగా ఈ వేద‌కిపై లబ్ధిదారుల సంఖ్య మిలియన్ మార్క్‌ను దాటిన‌ట్ట‌యింది. ఇది భారతదేశంలోని మొత్తం రక్షణ శాఖ నుంచి పెన్షన్ల‌ను అందుకుంటున్న వారిలో  దాదాపు 33% కావ‌డం గ‌మ‌నార్హం. పెరుగుతున్న ఆవిష్కరణల ద్వారా మాత్రమే ఈ పరివర్తనాత్మక మార్పు సాధ్యమైంది. స్పర్ష్  అనేది పెన్షన్ క్లెయిమ్‌లను ప్రాసెస్ చేసే వెబ్ ఆధారిత వ్యవస్థ. ఎటువంటి బాహ్య మధ్యవర్తి లేకుండా నేరుగా రక్షణ శాఖ త‌న పెన్షనర్లకు బ్యాంక్ ఖాతాలలో పెన్షన్‌ను జమ చేస్తుంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ. 57 కోట్లకు ప‌రిమిత‌మైన ఈ త‌ర‌హా పంపిణీ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో రూ. 11,600 కోట్లకు చేరింది.  మేటి వృద్ధిని న‌మోదు చేసింది.  డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్‌మెంట్ అనేది ప్రాజెక్ట్ స్పర్ష్  యొక్క  నోడల్ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ. ఇది 3000 పెన్షన్ ప్రారంభ, మంజూరు మరియు పంపిణీ ఏజెన్సీలను ఏకీకృతం చేస్తుంది. ఇది పెన్షనర్ వెరిఫికేషన్ యొక్క డిజిటల్ ప్రక్రియ నుండి ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన రియల్ టైమ్ ట్రాకింగ్ వరకు - అనుభవజ్ఞుల ద్వార ఇంటి వద్దకే పెన్షన్ సేవలను అందిస్తోంది.
                                                                           

***********



(Release ID: 1856372) Visitor Counter : 138